చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: సినారె, కొసరాజు గానం: సుశీల, బాలు, వసంత, మాధవపెద్ది సత్యం, రమేష్, రఘురాం నటీనటులు: కృష్ణ , మంజుల, చంద్రమోహన్, షావుకారు జానకి , రాజాబాబు, కుమారి శ్రీదేవి దర్శకత్వం: సి. యస్.రావు నిర్మాత: డి.యన్. రాజు బ్యానర్: పూర్ణిమా పిక్చర్స్ విడుదల తేది: 22.11.1975
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
నవ్వు నవ్వించు పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు నవ్వు నవ్వించు
రా రా నా స్వామి రంగ పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల రా రా నా స్వామి రంగ
కండలు కరిగిస్తే పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు కండలు కరిగిస్తే
జగములెల్ల పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు , రండి రమేష్ , మాదవపెద్ది సత్యం , పి.సుశీల జగములెల్ల
చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ చూచుకున్న అందమేమి చేసుకుంటావూ.. కాటుకలా రంగరించి పూసుకుంటానూ చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామా సింగారి సింగారి పిల్లా.. బంగారు బంగారు మామా చరణం: 1 ఏటికి ఎదురీదే గండుమీనులా.. ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ ఏటికి ఎదురీదే గండుమీనులా.. ఎందుకే తుళ్ళి తుళ్ళి పడుతున్నావూ తగినోడు కాదగినోడూ.. తగినోడు కాదగినోడూ నే జిక్కేది ఎప్పుడని చూస్తున్నానూ చేజిక్కితే వాణేమి చేసుకుంటావూ? నా కొప్పులో గుప్పున ముడిచేసుకుంటానూ చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ చరణం: 2 పట్టు దొరకని పరువంలాగా.. పడవెళ్ళిపొతుందే పడుచుదానా వీలు చూసీ వాలు చూసీ.. వీలు చూసీ వాలు చూసీ.. ఎత్తరా తెరచాప బుల్లిరాయడా ఓ నా బుజ్జి నాయనా.. నేను బుజ్జోణ్ణయితే ఎమిచేసుకుంటావూ పాల బువ్వెట్టి ఎదలో దాచేసుకుంటానూ చరణం: 3 పంట చేనిపై పైర గాలిలా.. ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ పంట చేనిపై పైర గాలిలా.. ఎందుకో చక్కిలిగిలి పెడుతున్నావూ మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా.. మూణ్ణాళ్ళకా రెణ్ణాళ్ళకా మూడు ముళ్ళు ఎప్పుడని అడుగుతున్నానూ ఆ మూడు ముళ్ళు వేసి ఏమి చేసుకుంటావూ నిన్ను ప్రతి జన్మకు నా దానిగ చేసుకుంటానూ చారడేసీ కళ్ళేమి చేసుకుంటావూ.. ఓరబ్బీ నీ అందం చూసుకుంటానూ సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా సింగారి సింగారి పిల్ల.. బంగారు బంగారు మామా..
ద్రాక్ష పండు పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: రండి రమేష్, బి.వసంత ద్రాక్ష పండు తియ్యన
పల్లె సీమ పాట సాహిత్యం
చిత్రం: దేవుడులాంటి మనిషి (1975) సంగీతం: కె. వి. మహదేవన్ సాహిత్యం: కొసరాజు గానం: యస్.పి.బాలు , మాదవపెద్ది సత్యం పల్లె సీమ
No comments
Post a Comment