చిత్రం: దొంగలకు దొంగ (1977)
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: ఆరుద్ర , దాశరధి, గోపి
గానం: సుశీల , జానకి , యస్.పి.బాలు, ఆనంద్
నటీనటులు: కృష్ణ , జయప్రద , మోహన్ బాబు, పండరీ భాయి, మాస్టర్ రమేష్ (కృష్ణ గారి అబ్బాయి)
మాటలు: బమిడిపాటి రాధాకృష్ణ
దర్శకత్వం: కె.యస్.ఆర్.దాస్
నిర్మాతలు: పి.బాబ్జి , జి. సాంబశివరావు
ఫోటోగ్రఫీ: పుప్పాల గోపాలకృష్ణ
ఎడిటర్స్: ఎన్. ఎస్.ప్రకాశం , డి.వెంకట రత్నం
బ్యానర్: త్రిమూర్తి ప్రొడక్షన్స్
విడుదల తేది: 29.09.1977
పల్లవి:
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
చాటుగ నను చేరి
అల్లరిపెడుతుంటే నీతో వేగేదెలా
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
చరణం: 1
వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేశావు
గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవు
వెన్నెలతో నా ఒళ్ళంతా పెనవేశావు
గిలిగింతలతో ఉక్కిరి బిక్కిరి చేసేవు
ఎవరైన చూసేరు ఎగతాళి చేసేరు
నీతో గడిపేదెలా
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
చరణం: 2
నిన్ను చూసి లేత కలవు విరివిసింది
తెల్లవార్లు మోటు సరసం తగదండీ
నిన్ను చూసి లేత కలవు విరివిసింది
తెల్లవార్లు మోటు సరసం తగదండీ
ఒకసారి ఔనంటే వదిలేది లేదంటె
ఎట్లా తాళేదిరా
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
చాటుగ నను చేరి
అల్లరిపెడుతుంటే నీతో వేగేదెలా
ఈ రాతిరి ఓ చందమామ
ఎట్లాగడిపేది అయ్యోరామ
****** ****** ******
చిత్రం: దొంగలకు దొంగ (1977)
సంగీతం: సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలు, సుశీల
పల్లవి:
పగడాల దీవిలో.. పరువాల చిలక
తోడుగా చేరింది.. పడుచు గోరింక
ఓయమ్మ నీ అందం.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు
ముత్యాల కోనలో.. గడుసుగోరింక
ఆశగా చూసింది.. చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే.. వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ.. నా కళ్ళకు కాళ్ళకు
చరణం: 1
ఎరుపేది మలిసంధ్యలో.. ఓ.. అది దాగింది నీ బుగ్గలో
వెలుగేది తొలిపొద్దులో.. ఓ.. అది తెలిసింది నీ రాకలో
ఆ..ఎన్నడు చూడనీ..అందాలన్నీ..
ఎన్నడు చూడనీ..అందాలన్నీ....
చూశాను ఈ బొమ్మలో..ఓ..హా..
ముత్యాలకోనలో.. గడుసు గోరింక
ఆశగా చూసింది చిలకమ్మ వంక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ... నా కళ్ళకు కాళ్ళకు
చరణం: 2
నీ చిలిపి చిరునవ్వులే..ఏ.. ఊరించే నా వయసునూ
ఓ..హో..ఆ సోగ కనురెప్పలే..ఏ..కదిలించే నా కోర్కనూ
ఆ.. నీవే నేనై తోడు నీడై.. నీవే నేనై తోడు నీడై
నిలవాలి నూరేళ్ళకు..
పగడాల దీవిలో పరువాల చిలక
తోడుగా చేరింది పడుచు గోరింక
ఓరయ్యో నీ చూపే వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
ఓయమ్మ నీ అందం వేసింది బంధం
నా కళ్ళకు కాళ్ళకూ..నా కళ్ళకు కాళ్ళకు
***** ****** *****
చిత్రం: దొంగలకు దొంగ (1977)
సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: బాలు, సుశీల
పల్లవి:
ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ
హహా..
ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హహా..కరిగిపోవాలనీ
ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ
హాహా..
ఒడిలో కమ్మగా కరిగిపోవాలనీ
హాహా..కరిగిపోవాలనీ హా..హా..
చరణం: 1
నడకతో లేత నడుముతో చెలి మంత్రమే వేసెనూ
కురులలో నీలి కనులలో నా హృదయమే చిక్కెనూ
నీ చూపులే నను నిలువునా కౌగిలిస్తున్నవీ
నా పెదవులే నీ నామము పలవరిస్తున్నవీ
హే...కలలోను కనులందూ కదలక నిలిచెను నీ సొగసూ
చరణం: 2
చేతికి చేయి తగిలితే గుబులు పుడుతున్నదీ
కొత్తగా నా వయసుకు దిగులు వేస్తున్నదీ
చెక్కిట ఆ నొక్కులు ఆశ పడుతున్నవీ
ఆ ఒంపులు మేని బరువులు నను నిలువనీకున్నవి
హా..హహహా...
అణువణువు ప్రతి నిమిషం తొందర చేసెను నీకోసం
ఒకటే కోరిక హా..నిన్ను చేరాలనీ