Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ganga Manga (1973)




చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, వాణిశ్రీ , గరికపాటి వరలక్ష్మి
కథ : జలిమ్-జెవేద్
మాటలు (డైలాగ్స్): డి. వి.నరసరాజు
దర్శకత్వం: తాపీ చాణక్య
నిర్మాతలు: బి.నాగిరెడ్డి , ఆలూరి చక్రపాణి
బ్యానర్: విజయా ప్రొడక్షన్స్
విడుదల తేది: 30.11.1973



Songs List:



గాలిలో పైరగాలిలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి.రామకృష్ణ, పి.సుశీల

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా...
పొదామా...  సాగి పోదామా 
అలా అలా అలా అలా నింగిలో నీలి నింగిలో

ఎగిరిపోదామా అందాల హంసలై రాజ హంసలై
పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా 

చరణం: 1 
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 
అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం

అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా




తొలి వలపులలో పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి.సుశీల

పల్లవి:
తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను ..
అది కవుల పైత్యమనుకున్నాను ..
నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను ..
నీ చెలిమి కోరుతూ ఉన్నాను..

మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..
ఆడది తానే చెంతకు వస్తే అలిగే పనులే చేస్తారు..
ఆ అలకే వలపనుకుంటారు ..

చరణం: 1
కోరినవాణ్ని కొంగు ముడేసి తిప్పదలచుకుంటారు..
మరో మగువతో మాటాడగనే మూతి ముడుచుకుంటారు..
మొగము తిప్పుకుంటారు..

సేవ పేరుతో చేకిలి నొక్కి సరసం మాడుతుంటారు..
నిజం తెలిస్తే బుజం తడుముకొని నీతులు పలుకుతు ఉంటారు..
సాకులు చెబుతూ ఉంటారు

తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను
మాయలు చేసి మీ మగవారు మాటలు చాలా నేర్చారు..
ప్రతి మగువకిలాగే చెబుతారు..

చరణం: 2
ఆడవారు తమ అనురాగంలో అనుమానం పడుతుంటారు
లోపల మమత పైన కలతతో సతమతమవుతూ ఉంటారు
కుత కుత లాడుతూ ఉంటారు

తేనెటీగలో ఉన్న గుణాలు మగవారలలో ఉంటాయి
వీలు దొరికితే వారి తలపులు దారి తప్పుతూ ఉంటాయి
పెడదారి పట్టుతూ ఉంటాయి...

చరణం: 3
కలలోనైనా నా కన్నులలో వెలుగుతున్నది నీ రూపం
నీ అందాలను ఆరాధిస్తూ పూజించడమే నా ధ్యేయం
జీవించడమే నా గమ్యం

కోరినవారు దూరమవుదురని గుబులుపడును నా మనసు
నీ హృదయంలో నాపై ప్రేమ నిండుగ ఉందని తెలుసు
అది పొంగుతున్నదని తెలుసు...
ఆ..అహ..ఆ..అ..అహ..ఆ..ఆ
ల.ల.లా..ఉ..ఊ..ఉ..



హుషారు కావాలంటే పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలు 

పల్లవి:
హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా 

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే... మందురా  

చరణం: 1
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
అన్ని చింతలూ మరపించేది... ఎన్నో వింతలు చూపించేది 
మదిలో దాగిన నిజాలనన్ని మనతోనే పలికించేదీ
అహ అహ ఆ... ఏది?....  మందొక్కటే మందురా       

చరణం: 2
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా
జీవితమెంతో చిన్నదిరా... ప్రతి నిమిషం విలువైనదిరా 

నిన్నా రేపని తన్నుకోకురా...  ఉన్నది నేడే మరువబోకురా
అహ .... అహ....  అహా..ఆ   

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే....  మందురా 

చరణం: 3
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా
ఇల్లు వాకిలి లేనివాడికి... రహదారే ఒక రాజమహలురా

తోడూ నీడా లేని వాడికి... మ్మ్ చొ...  చొ..తోకాడించే నీవే తోడురా  

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా... ఇది మించి ఏముందిరా

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే
మందొక్కటే మందురా...





గడసాని దొరసాని పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: యస్. పి.బాలు, పి. సుశీల

పల్లవి:
గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ బాబు...  ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ..దాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని..

చరణం: 1 
అరెరెరె నడకంటె నడక కాదు
చలాకి నడక.. బల్ కిలాడి నడక
నవ్వంటే నవ్వుగాదు తారాజువ్వ...   అది వడిసెల రువ్వ 

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

వగలంటే వగలు కాదు వలపుల సెగలు
చూపంటే చూపు కాదు మదనుడి తూపు
ఆ నడక...  ఆ నవ్వు...  ఆ వగలు...  ఆ చూపు
అన్ని కలిపి యిసిరితే గుమ్మైపోతారు తల దిమ్మైపోతారండి
   
గడసాని..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి... ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి...  అబ్బొ... దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..

చరణం: 2
మాటలతోటే నన్ను మురిపించకురా
ఏమేమో పొగిడేసి బులిపించకురా
మాటలతోటే నన్ను... మురిపించకురా
ఏమేమో పొగిడేసి... బులిపించకురా

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

కవ్వించాలని నువ్వు కలలు కనకురా
కత్తితోటి చెలగాడి చిత్తు గాకురా
గడ ఎక్కి...  తాడెక్కి...  గంతేసి...  చిందేసి
అందరు మెచ్చేలాగా ఆడీ చూపాలిరా 

గడసాని..హేయ్..హేయ్..గడసాని దొరసాని 
ఒడుపు చూడండి ఓ బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొదాని ఒడుపు చూడండి
గడసాని... దొరసాని...    

చరణం: 3
తళుకు బెళుకు చూపిస్తా..
గజ్జె ఘల్లుమనిపిస్తా..

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ హా హా హా హా హా హా ఆ ఆ ఆ హా

తళుకు బెళుకు చూపిస్తే....  తటపట తటపటపట లాడాలి
గజ్జె ఘల్లుమనిపిస్తే... గిలగిల గిలగిలగిల లాడాలి

ఆ తళుకు...  ఆ బెళుకు... ఆ బిగువు...  ఆ బింకం
అన్నికలిపి చూపితే ఐసై పోవాలండీ..పైసలు రాలాలండీ

గడసాని..ఆహా..గడసాని దొరసాని ఒడుపు చూడండి
ఓ..బాబు ఒడుపు చూడండి
మెరుపులాంటి చినదాని సొగసు చూడండి
సొగసు చూడండి అబ్బొ..దాని ఒడుపు చూడండి 

గడసాని... దొరసాని..




అలా అలా అలా పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: వి. రామకృష్ణ, పి. సుశీల 

పల్లవి:
అలా అలా అలా అలా గాలిలో ... పైర గాలిలో
సాగి పోదామా తెలిమబ్బు జంటలై ... వలపు పంటలై
పొదామా...  సాగి పోదామా... 
పొదామా...  సాగి పోదామా 

అలా అలా అలా అలా నింగిలో....  నీలి నింగిలో
ఎగిరిపోదామా....  అందాల హంసలై ...  రాజ హంసలై.... 
పోదామా ... ఎగిరి పోదామా
పోదామా ... ఎగిరి పోదామా 

చరణం: 1
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము
వెనుదిరిగి చూసే పనిలేదు మనకు
దూరాలు తీరాలు చేరాలి మనము 

జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
జతచేరి దూకే సేలయేళ్లలాగా ... లేల్లలాగా
మునుముందుకేగాలి మనము
నీకు నేను తోడుగా
నేను నీకు నీడగా
ఈ బాట మన బ్రతుకు బాటగా
పూల బాటగా...  హాయిగా సాగి పోదామా

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా...  ఎగిరి పోదామా       

చరణం: 2
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం
అనురాగ లతలే పెనవేసె మనను
ఏనాడు విడిపోదు మన ప్రేమబంధం 

అందాలు చిందే నీ లేతమోము
నీ కంటి పాపలో నిలవాలి నిరతం
అందాలు చిందే నీ లేతమోము
నా కంటి పాపలో నిలవాలి నిరతం

చేయి చేయి చేరగా ... మేను హాయి కోరగా
నీ మాట నా మనసు మాటగా
వలపు బాటగా...  జంటగా సాగి పోదామా 

అలా అలా అలా అలా గాలిలో
పైర గాలిలో పోదామా ఎగిరి పోదామా
పోదామా ఎగిరి పోదామా     




తాగాను నేను తాగాను పాట సాహిత్యం

 
చిత్రం: గంగ - మంగ (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల

పల్లవి:
తాగాను... నేను తాగాను... బాగా నేను తాగాను..తాగాను 
భలే నిశాలో ఉన్నాను..ఉన్నాను..తాగాను..నేను తాగాను   
చరణం: 1
కైపులో ఉన్నాను కలలుకంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను
కైపులో వున్నాను కలలు కంటున్నాను
మదిలోని వేదన మరువలేకున్నాను

మ్మ్ హూ మ్మ్ హూ వలపులో పడ్డాను
వెత తీర్చ వచ్చాను... వలపులో పడ్డాను
నే నెవ్వరో నేనే చెప్పలేకున్నాను

తాగాను...  నేను తాగాను...  బాగా నేను తాగాను....  తాగాను    

చరణం: 2
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి
కోటి తారలు నిన్నే కోరుకుంటాయి
అందాలు చందాలు అందజేస్తాయి 

మ్మ్ హూ మ్మ్ హూ
ఆ నెలరాజుతో చెలిమి నే కోరలేను
నీ దారిలో నుండి తొలగిపోతాను
మన్నించమన్నాను....  మరచిపొమ్మంటాను


No comments

Most Recent

Default