చిత్రం: గాయత్రి (2018)
సంగీతం: యస్.యస్.థమన్
నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు , శ్రేయా శరణ్
కథ, మాటలు ( డైలాగ్స్ ) : ఆర్.మధన్ , పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.మధన్
నిర్మాత: మోహన్ బాబు
విడుదల తేది: 09.02.2018
చిత్రం: గాయత్రి (2018)
సంగీతం: యస్.యస్.థమన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
గానం: జూబిన్ నాటియల్, శ్రేయఘోషల్
నీ కళ్ళలోన నన్నే చూస్తున్నా
నీ పెదవుల మెరుపుల్లో నేనే ఉన్నా
నీ ఊపిరిలోన నను దాచేస్తున్నా
నీ కౌగిలిలో నను వదిలేస్తున్నా
నా కోసం నేనసలే లేనంటున్నా
నీ తోడై నేనుంటే చాలంటున్నా
నా హృదయం నీది నా సమయం నీది
నేనంటే నువ్వంటు జీవిస్తున్నా
ఒక నువ్వు ఒక నేను
ఒకటయ్యాం మనం
ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3)
ఉన్నానంటే ఉన్నాను ఇన్నేళ్ల వరకు
నేనెవరంటు తెలిసింది ఇన్నాళ్లకు
రంగై కలలే చూపావు నాలోని కలకు
ఉబికే కన్నీరయ్యాను నీ ప్రేమకు
చెలియా వీలైతే గతమంతా చెరిపి
మరల మొదలవన నీ జత కలిసి
వినిపించవే జోలలై ఆలాపన
నీ పసిపాపనయ్యను నీ నీడన
నేనంటూ లేనంటూ చేరిపేస్తున్నా
నీ పేరుకు నా పేరు కలిపేస్తున్నా
నా హృదయం నీది నా సమయం నీది
నేనంటే నువ్వంటు జీవిస్తున్నా
ఒక నువ్వు ఒక నేను
ఒకటయ్యాం మనం
ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3)
లేనే లేదన్నా మతిక లేనే లేదే
అన్నీ దొరికాయి నీ చిరునవ్వులో
వేరే వరమేది కోరగా తోచలేదే
దేవత నా జతగా ఉందను ధ్యాసలో
బ్రతుకే బంగారు వర్ణాన మెరిసే
వెతకని పుదరి నేల కలిసే
ఏడు రంగుల్లో చల్లవే నీ కాంతిని
ఏదేమైనా విడిపోకు నా చేతిని
చినుకంటి నీ ప్రేమకు పులకిస్తున్నా
మన ప్రేమకు చిగురిస్తున్నా
నా హృదయం నీది నా సమయం నీది
నేనంటే నువ్వంటు జీవిస్తున్నా
ఒక నువ్వు ఒక నేను
ఒకటయ్యాం మనం
ఇక పైన ఇద్దరికి ఒక ప్రాణం (3)