Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Iddaru Dongalu (1984)



చిత్రం: ఇద్దరు దొంగలు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All)
నటీనటులు: కృష్ణ , శోభన్ బాబు, జయప్రద
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: కె.నాగేశ్వరరావు
విడుదల తేది: 01.14.1984

పల్లవి:
జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు...
సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు
నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక...

చరణం: 1
రాక రాక వచ్చినావు రాతిరంతా నీదోనురోయ్... హహ
వచ్చినాక వెళ్ళలేవు రాపిడంతా నాదేనురోయ్... హా

అహాహా... నంగనాచి రంగసాని దొంగసొత్తు దోచెయ్యనా..హా
ఉంగరాల జుట్టు తీసి చెంగుముద్దు కాజేయ్యనా... హా

ఈ దోపిడి వద్దుర మావా... మరి రాతిరికెట్టా భామా
తీగదాక సాగినాక పోకచెక్కలివ్వమంటే పొద్దుపోదు తెలుసా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్
అరే... జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
జిగినక.. జిగిజిగినక...

చరణం: 2
చీకటింటికొచ్చినాక చీకుచింత తీర్చెయ్యనా...హా
సిగ్గు వచ్చిపోయినాక చీర నీకు కట్టెయ్యనా... హా

హహహ... సొమ్ములన్ని దోచుకుంటే సొమ్మసిల్లిపోతానురో..అయ్యయ్యో
సోకులన్నీ రాలిపోతే అమ్మతల్లి అంటానురో...

అనుకోవే కృష్ణారామా... మరి బ్రతికేదెట్టా మావా
కాలమంతా చెల్లిపోతే కాయ కాస్త పండిపోతే...
దిక్కులేదు తెలుసా

జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు...
సొగసమ్మ తళుకు తందానరోయ్

జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా

జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక...


 ******   *******   *******


చిత్రం: ఇద్దరు దొంగలు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి..  అహ.. హా..

చరణం: 1
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా
ఎన్నో స్వరాల నీ నవ్వు చూసి నేనే వరించగా
నీ రూపమంత ఆలాపనాయె నాలోన నీడగా

నీ కొంటెచూపు మనసంత వెలుగు వేదాలు పాడగా
అల్లారుపొద్దు అల్లారుముద్దు నీకే జవాబులిస్తాగా
బదులైనా బతుకైనా..ముద్దుకు ముద్దే చెల్లంటా
వయసుకు వయసే వళ్ళంటా..
కన్ను తుదల.. ఎన్ని ఎదల తీపి సుధలు నీలో..
వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో
వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

చరణం: 2
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో
ఎన్నో యుగాల నీ వీక్షణాల కరిగే క్షణలలో
చేసే దగాలు చెరిపే సగాలు కలిపే సుఖాలలో

వీచే పెదాల చిలిపీ సిరాల.. చిరు సంతకాలతో
నా జీవితాలు చెలి కాగితాలు..నీకంకితాలు చేస్తాగా

కలలైనా.. నిజమైనా.. కౌగిలి పెట్టిన ఇల్లంటా
ఇద్దరి పేరే ప్రేమంటా..
ఎన్నిజతులు.. ప్రేమ జతలు.. పూలరుతులు నీలో..

తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో
తుంటరి తుమ్మెదనై.. అవి తొందరపడెనాలో

ఆ నవ్వుకు ఒక ఆమనీ.. అహ.. హా..
ఆ చూపుకు ఒకటే చలి.. అహ..హా..
ఆ కౌగిట ఒక వేసవి.. అహ..హా..
ఆ చక్కిట చిరు జాబిలి.. అహ..హా..

ఏమి లయలు.. ఎంత హొయలు.. ఎన్ని రుచులు నీలో
మొగ్గలు మొగ్గలుగా.. అవి సిగ్గులుపడెనాలో
వెచ్చని ముద్దులుగా..  అవి అచ్చులు పడెనాలో

లలలల.. లా.. లల.. లాలలల.. లలలాలా..


Most Recent

Default