చిత్రం: కిరాయి కోటిగాడు (1983)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణ , శ్రీదేవి
కథ: సత్యమూర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి
సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాత: యన్. రామలింగేశ్వర రావు
బ్యానర్: రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 17.03.1983
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
నమస్తే.. సుస్వాగతం...సమస్తం నీ అధీనం...
అజంతా అందాలు ..ఎల్లోర శిల్పాలు ..ఇస్తున్నా అంకితం
ఇదే ..ఇదే ..ఇదే ..నా ఆహ్వానం....
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఓహో..
నమస్తే...ఓ సుందరి..క్షమిస్తా..నీ అల్లరి..
నీలోనీ అందాలు..అవి తీసే రాగాలు ...ఇస్తుంటే అంకితం
అదే కదా ..సదా నీ అభిమానం...
చరణం: 1
పెళ్ళిపెద్దగారు లగ్గమేదో పెట్టి వస్తుంటే...
ఖద్దరంచు పంచ ..కండువాల ఠీవి చూస్తుంటే...
పెళ్ళికానిపిల్ల తుళ్ళి తుళ్ళి మీదికొస్తుంటే...
కళ్ళు పడ్డ చోట.. గళ్ళు పడ్డ కోక చూస్తుంటే...
తెల్ల మబ్బు గొడుగేస్తుంటే...
ఆ..ఆ...చల్లగాలి మనసిస్తుంటే...
సిరిమల్లి చిరునవ్వులే..ఏ...చినదాని సిగపువ్వులై...ఈ..
ఘుమా ఘుమా ఘుమా విరిసే నా కోసం
నమస్తే... హ...సుస్వాగతం...సమస్తం నీ అధీనం... హ...
చరణం: 2
ఒంపుకొక్క సొంపు వంతెనేసుకున్న అందాలే...
వాలు పొద్దుకాడ లేత ముద్దులిస్తే..అందా..లే...
మల్లెచెండులోన మంచుతేనే పిండు చిన్నోడే...
దోరనవ్వులిచ్చి దొండపండు దోచుకున్నాడే...
చీకటమ్మ చిటికెస్తుంటే...
ఆ..ఆ...ఆకలమ్మ అడిగేస్తుంటే....
మన పల్లే కలిపిందిలే..ఏ....వలపల్లే మన జంటనే..ఏ..
ఇదే కదా...కలుసుకున్న అనుబంధం...
నమస్తే...హా..ఓ సుందరి..క్షమిస్తా...హ....నీ అల్లరి..
అజంతా అందాలు ...ఎల్లోర శిల్పాలు... ఇస్తున్నా అంకితం...
అదే కదా ...సదా నీ అభిమానం...
No comments
Post a Comment