చిత్రం: కోడలుపిల్ల (1972) సంగీతం: జి. కె. వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర, అనిసెట్టి నటీనటులు: కృష్ణ , అంజలీ దేవి, కె.ఆర్.విజయ, పండరీ భాయి మాటలు: రాజశ్రీ దర్శకత్వం: యమ్.మల్లికార్జున రావు సినిమాటోగ్రఫీ: కులశేఖర్ నిర్మాత: మరయనన్ చెట్టియర్ విడుదల తేది: 29.06.1972
Songs List:
నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో పాట సాహిత్యం
చిత్రం: కోడలుపిల్ల (1972) సంగీతం: జి. కె. వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు పల్లవి: నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో ఒక పెను వేడి రగిలింది మదిలో నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం: 1 నింగి నుండి దేవత దిగెనో పన్నీటి జల్లు చిలకరించెనో నింగి నుండి దేవత దిగెనో పన్నీటి జల్లు చిలకరించెనో చెలి పక్కన ఉంటే నే పరవశమౌతా చెలి పక్కన ఉంటే నే పరవశమౌతా ఈ చక్కని చుక్క చెక్కిలినొక్కుట ఏమో కల ఏమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో చరణం: 2 దేవలోక సుధలు తెచ్చెనో తన తేనెలాంటి మనసు కలిపెనో దేవలోక సుధలు తెచ్చెనో తన తేనెలాంటి మనసు కలిపెనో ఆ మధువు తాగితే నా మనసు ఊగితే ఆ మధువు తాగితే నా మనసు ఊగితే ఈ మధుర మధుర మధుర భావమేమో వలపేమో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో తడిమేను వొణికింది చలితో ఒక పెనువేడి రగిలింది మదిలో ఆ..ఆ.. నన్ను తాకి ఎవ్వరో ఎవ్వరో యవ్వనాల నవ్వులో పువ్వులో
ఆ గోపాలుడు పాట సాహిత్యం
చిత్రం: కోడలు పిల్ల (1972) సంగీతం: జి.కె వెంకటేష్ సాహిత్యం: అనిశెట్టి గానం: యస్.జానకి ఆ గోపాలుడు లీలా వినోదుడు యమునా నదికేగే ఆడేపాడే గోపికలందర్నీ కవ్వించగ సాగే పిల్లనగ్రోవీ మధురస్వరాల పరవశుడై నాడే ముద్దుగుమ్మలా మోహాలతేలే మై మరచి ఆడే యమునయే వరదగా ఎగసెలే అతనీ ఉడుపులా దూసెనులే గొల్లున నవ్విరి గోపికలే కొంటెగ నవ్విరి గోపికలే ఆతడే సిగ్గుతో తలవంచె సిగుతో తలవంచె నదివై వేగిన ద్రౌపదీ ఆతనీ స్థితినే గమనించె చీరకొంగునే జారవిడిచెలే అడ్డుగా విసిరెనులే ఆ గోపాలుని ఆపదయందూ అండగ నిలిచెనులే నీ సాయము నే మరువలేనులే కృతజ్ఞతాంజలిదే నీ కెపుడైనా తోడుగా నిలిచెడ రుణం తీర్చుకునేద జూదాన ఓడిపోయే ధర్మరాజే ఆ క్రూరాత్ముల కర్ధాంగి దాసియైపోయే ఘోరముగా హింసబెట్టి జుట్టుబట్టి పతివ్రత నీడ్చుకువచ్చె దుష్టుడా! దుర్మతీ కౌరవులకు రాజూ క్రూరుడూ అతడే శాసించే సభలో పలువురిలో సాధ్వీవసనమ్మొలిపించే ద్రౌపది రోదించే ప్రాణనాధుల నర్దించే అసహాయులు అశక్తులూ వారు ఆవేదనతో కృంగారు కృష్ణాః ఆపద్బాంధవా ; దేవాః దేవాః గోకులరమణా ! గోపాలా : వాక్కును మరచితివో అసహాయను ఆపదలో కావరావేలనో కృష్ణా! రావో కనలేవో! కృష్ణా: కృష్ణాః కృష్ణాః కృష్ణా! దుర్యోధనా చూడు నీ తొడను ఒకనాడు చీల్చి రక్తం కళ్ళజూస్తా దుశ్శాసన నీదు పచ్చిరక్తంతోటి కడిగి నాకురులు ముడివేస్తా తల్లీ పరాశక్తి ఆన ప్రాణేశులైదుగురిమీద ఆన ఆపదలో దీనులనుబ్రోచే మహాత్ముడు కృష్ణునిమీద ఆనః ఆనః భారతభూమిని వెలసెనమ్మా ఆ పాండవ పతాకయే పార్థివు విల్లే వధించెనమ్మా ఆ క్రూరులాః కౌరవులాః భీముని గదయే దుర్యోధనునీ తొడను చీల్చివేసే నిర్జీవములో ద్రౌపది కన్నుల ఉజ్వల కాంతెగసే: ఉజ్వలకాంతెగ సే క్రూర దుశ్శాసను రక్తమె పూసె కురులను ముడివేసే పరంధాముని వదసం గాంచి ద్రౌపది భక్తితో పూజించే ప్రణతల నర్పించే భారతజాతికి పంచమ వేదం ఆ పాండవుల చరితం సడతులకు ఆదర్శప్రాయమే ఆ పాంచాలి శపథం.... శ పథం.... శపథం
దీనుల కానవయ్య నా తండ్రి పాట సాహిత్యం
చిత్రం: కోడలు పిల్ల (1972) సంగీతం: జి.కె వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.పి.బాలు ఓదేవా .... నా దేవా.... దీనుల కానవయ్యా నా తండ్రి ఈ పేదల కానవయ్యా నా తండ్రి కొలుపులే జరుపుతాము నా తండ్రి నిన్ను మనసులో నిలుపుతాము నా తండ్రి కల్ల నెరుగని పల్లేవారిని చల్లగ చూడవో నావేవా ! గింజలు పండా గాదెలు నిండా కలిమి బలము నిచ్చేవా మాకు కలిమి బలము నిచ్చేవా మా పసుపు, కుంకుమలు కాపాడు దయచూడు నీకు ముడుపులే కట్టుకుంటాం నా తండ్రి నిత్యం నీ పాదధూళి ఒడలంతా పులుముకొని తలలమీద చల్లుకుంటాం నా తండ్రి మాకు దీవెనలివ్వవయ్యా నా తండ్రి ఇలను నీతి నిలువకున్న దేవా ! నీకు మహిమేది ధర్మనిరతి గెలవుకున్న దేవా! నీకు శక్తేది పుణ్యం పాపం యొక్క టైనా పూజలకు ఫలమేది బ్రోవవయ్యా మా తండ్రి కావవయ్యా మా తండ్రి.
తైతక్కలాడు పాట సాహిత్యం
చిత్రం: కోడలు పిల్ల (1972) సంగీతం: జి.కె వెంకటేష్ సాహిత్యం: ఆరుద్ర గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, యస్.పి.బాలు తండ్రినైన ధర్మమ్ముకోసమై తగువులాడవలయు తప్పుకాదు. గట్టి నీతికన్న చుట్టాలు లేరయా విశ్వదాభిరామ వినుర వేమా తైతక్కలాడు.... తర్వాతచూడు నీ ఆట కట్టిస్తామూ ఒకనాడూ-చూడు మామాట చెల్లుతుంది ఆనాడూ చేశేము శపథం ఇక పడతాముభరతం నీతులెన్నో చెప్పుతాడు గోతులెన్నో తీస్తాడు తాను తీ"సే గోతిలోన తప్పకుండా పడతాడు. తల్ల క్రిందులవుతాడు చావుకేక వేస్తాడు చాటుమాటు వ్యవహారము ఈ ధర్మదాతల అవతారము నీ తప్పే నీ ముప్పు ఈ రోజే కనువిప్పు నే బైట పెడతాను బండారము దేరుమంటుందాకారము నీకు ఇదుగో శ్రీకారము మేడ మీద దొరగారు మిడిసికింద పడతారు అప్పుడు చూడు అయ్యగారు ఆవగింజకు కొరగారు ముప్పుతిప్పలు పడతారు ముసుగు నెత్తిన వేస్తారు
No comments
Post a Comment