చిత్రం: నాపేరు శివ (2010)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
నటీనటులు: కార్తి, కాజల్ అగర్వాల్
కథ, మాటలు ( డైలాగ్స్ ) , స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుసీంద్రన్
నిర్మాతలు: యస్. ఆర్. ప్రకాష్ , ఎస్.ఆర్.మధు
సినిమాటోగ్రఫీ:
ఎడిటర్:
బ్యానర్:
విడుదల తేది: 20.08.2010
చిత్రం : నాపేరు శివ (2010)
సంగీతం : యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం : హరిచరణ్
పల్లవి:
వెన్నెల చేతపట్టి తేనా పిండి బొమ్మ చేసి ఈనా
ఓహో ఆటలాడుదాం
పాటపాడుదాం చంద్రవంక పైన
నింగికి వెయ్యి నిచ్చెనలు
మేఘము చెయ్యి మాలికలు
వెల్‌కమ్ కడదాం చెలిమితో పై మెట్లు (2)
చరణం: 1
రేయి చూసి బెదురేలా వేదనెంతో పడనేలా
చీకటి లేక ఈ లోకాన జాబిలి అందం తెలిసేనా
కలలు నమ్ముకోనేలా కరుగు వేళ వగపేలా
కలలో పూచే పూవులు అన్నీ
చేతిలో మిలమిల మెరిసేనా
ఆ నింగికి మల్లే ఓ బంధం
మబ్బులు కమ్మిన ఎద మౌనం
కలిసొచ్చే రోజున వలపై రాదా
ప్రియమౌ అనుబంధం
చరణం: 2
కలత చెందు ఒక నిమిషం
గడిచిపోతే సంతోషం
నిలువున జ్వాలై మండేటపుడే
దీపపు వెలుగుకు ఉత్సాహం
కడలిలోన నది ఐక్యం
ఉనికి విడిన ఉప్పు గుణం
చినుకే ఐనా వానగ మారి
చివరికి కాదా మణిముత్యం
ఈ జీవితమన్నది ఓ వలయం
విశ్రాంతెరుగని ఓ స్వప్నం
అది మొదలే లేని ముగియని కథనీ
పొందకు దుఃఖాన్ని
******* ****** ******
చిత్రం: నాపేరు శివ (2011)
సంగీతం: యువన్‌శంకర్‌రాజా
సాహిత్యం: సాహితి
గానం: కార్తీక్
పల్లవి:
మనసే గువ్వై ఎగిసేనమ్మో
చెలిమి మాటే వినపడగా
పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా
ఎద నాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా
మంచల్లే కరిగేనే ఈ గాలే నాపై వీచగా
అయ్యయ్యో ప్రేమే పుట్టెనే
అది అణగని ఆశై పట్టెనే
నా ఎదలో ఏదో మెరుపై మెరిసి తలుపే తట్టేనే
కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు
నా జంటై ఎప్పటికింకా నువ్వుంటే అంతేచాలు
చరణం: 1
చెంతకొచ్చి నువు నిలవడం నిన్ను కలిసి
నే వెళ్లడం అనుదినం జరిగెడి ఈ నాటకం
ఒక సగాన్ని చెప్పేయడం మరు సగాన్ని
దాపెట్టడం తెలిసెలే తెలిసెలే కారణం
కాలాలు పూచెలే వేగాలు వేచెలే
కలువా నీ కాటుక కన్నుల చూపులు
గారడి చేసేలే
చరణం: 2
నా కంటికి ఏమైనదో రేయంతా
ఎరుగదు కునుకును
ప్రియా నువు లేనిదే నీ లేను ఓవ్ ఓహో
నా మీద నీ సువాసన ఏనాడో వీచగ కోరెను
ఎలా నిను చేరక బతికేను ఓవ్ ఓహో
నా ఇరు కళ్లకే ఓ హరివిల్లువే
నీ విరిసే నవ్వులే ఎదలో పూల జల్లులే