చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ నటీనటులు: శ్రీకాంత్, స్నేహ, సునీల్, కె.విశ్వనాధ్ కథ, స్క్రీన్ ప్లే, మాటలు (డైలాగ్స్): ముళ్ళపూడి వెంకట రమణ దర్శకత్వం: బాపు అసిస్టెంట్ డైరెక్టర్: నాని (హీరో) నిర్మాతలు: కె.అనిల్ కుమార్, కె.నాగేంద్ర బాబు బ్యానర్స్: అంజనా ప్రొడక్షన్స్ , శ్రీ క్రియేషన్స్ విడుదల తేది: 29.04.2005
Songs List:
శతమానం భవతి పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, చిత్ర శతమానం భవతి
నీ వాలు జడ పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట పల్లవి: చందమామ లాంటి మోము నువ్వు పూవ్వు లాంటి ముక్కు దొండ పండు లాంటి పెదవి కలువపూల వంటి కళ్ళు జామపండులాంటి బుగ్గ బెల్ల ముక్క లాంటి గడ్డం వలపు శంఖమంటి కంఠం ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో యవ్వనాల నవనిధులు కవ్వించి ఊరించి చంపేవన్నీ ముందు వైపునే ఉంటే నువ్వొక్కదానివే వెనకనెందుకు ఉన్నావే జడా? ఆ...ఆ బుగ్గలు సాగదీస్తావ్ ముక్కుని పిండుతావ్ పెదవులు జుర్రుకుంటావ్ గడ్డాన్ని కొరుకుతావ్ ముద్దులు గుద్దులు గిచ్చుళ్లు నొక్కుళ్లు అదేమిటంటే ఆరళ్లు గీరళ్ళు శృంగారం పేరుతో గింగిరాలు తిప్పుతావనే ఇలా.. వెనకాల ఉన్నా నీ పక్క చూపులు వెనక చూపులు ఎంచక్క కనిపెడుతున్నా అవసరమైతే పని పడుతున్నా ఓ వాలు జడా మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా నువలిగితే...నాకు దడా ఓ పట్టు జడా రసపట్టు జడా బుసకొట్టు జడా నసపెట్టు జడా ఇప్పుడేందుకే ఈ రగడా.... ఓ వాలు జడా మల్లెపూల జడా ఓ పాము జడా సత్యభామ జడా చరణం: 1 వీపుకి మెడకి భుజములకి తగు అందం తెచ్చే జడా ఈ తగవులేలనే జడా కులుకుల నడుముకి వెనకన తిరుగుతు కళకళలాడే జడా నను కనికరించవే జడా పిరుదుల బిరుదుల జడగంటలతో జగతికి చాటే జడా నా పొరపాటేమే జడా అత్తరి ఇత్తర అనుమానాల తత్తర బిత్తర జడా ఎద కత్తిరించకే జడా..ఆ ..ఆ కనికట్టు జడా కనిపెట్టు జడా పనిపట్టు జడా..ఆ..పనిపెట్టు జడా నిను విడువని ప్రేమికుడా.... చరణం: 2 వడిసేలల్లే తిప్పితే జడా గుండెలోన దడదడా ఏ గుబులు రేపకే జడా నడుము తిప్పుడూ నాగస్వరానికి నాగుపామువే జడా నగుమోము చూపవే జడా జెడ కోలాటం సరసమె కానీ జగడము కాదే జడా నను సరసకు రానీ జడా జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా నిను దువ్వనీయవే జడా...ఆ..ఆ కనువిందు జడా నను పొందు జడా సరసాల జడా ఇక చాలు జడా ఏనాటికి నీవాడా....జజడాం జగడ జఝడాం...
ఆగడాలు పాగడాలు పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, కల్పన ఆగడాలు పాగడాలు జగడాలు కోపాలు తాపాలు లేనిపోని పంతాలు ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే ఆగడాలు పాగడాలు జగడాలు కోపాలు తాపాలు లేనిపోని పంతాలు చరణం: 1 భార్య వేచి ఉండడాలు మొగుడు రాకవోపడాలు కోపగించు కోవడాలు కారణాలు చెప్పటాలు గొంతుచించు కోవటాలు సమర్ధించు వాదాలు గోడవపెంచుకోవడాలు గోల చేసుకోవడాలు అరవడాలు ఉరమడాలు కసరడాలు విసరడాలు చిలిపి చిలికి గాలి వానల ఆవడలు వాయుగుండం పడటాలు పొంపుదుండం ఆవడాలు తెల్లవారుజామునే తీరని తాకడాలు సోరిలు చెప్పటాలు సరే అనుకోవటాలు అసలు ఏం జరగనట్టు తెల్లారిపోవడలు చరణం: 2 ఫోను ఏదో రావడాలు నవ్వుతూ మాట్లాడడాలు అనుమానం రావడాలు తిరుగుటం అవడాలు ఆరాలు తీయడాలు కారాలే నూరడాలు ఏనాటికావాదాలు ఏకరువులు పెట్టడాలు తిట్టడాలు నెట్టడాలు ఒకరినొకరు కట్టడాలు రోజు రోజు మాటలాగిపోవడాలు తిక్క తిక్కగా ఉండడాలు పక్క మంది చేయటాలు బ్రహ్మయ్య ఉండటాలు మన్మధుని తిట్టడాలు సోరి అని అనుకోవటాలు సర్దిచెప్పుకోవటాలు చరణం: 3 చీరకట్టుకోవడాలు తెమరకుండపోవడాలు మొగుడు ముట్టుకోవడాలు టైందాటిపోవడాలు రైలు వెళ్లిపోవడాలు రోడ్ మీద ఎగరడాలు తెల్లముఖం వేయడాలు ఇంటిముఖం పట్టడాలు గంటసేపు తిప్పడాలు కంటినీళ్లు కార్చడాలు అలగడాలు తలగడాలు తలవాదాలు అర్ధరాత్రి దాటడాలు భద్రకాళి అవడాలు నిద్రమానుకోవడాలు నిప్పుమీద చిమడాలు సారీలు చెప్పడాలు చల్లబడి పోవడాలు గుద్దులాట నవ్వులాటై ముద్దులాట ఆడుకోవడాలు ఆగడాలు పాగడాలు జగడాలు ఐ యామ్ సారీ... కోపాలు తాపాలు లేనిపోని పంతాలు ఐ యామ్ సారీ.. ఐ యామ్ సారీ.. ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే ఐ యామ్ సారీ సారీ... ఒక్కసారి సోరి చెపితే మల్లీ అంతా మామూలే ఐ యామ్ సో సారీ...
మా ముద్దు రాధమ్మ పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సునీత ఉపద్రష్ట పల్లవి: మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీమువ్వ గోపాల గీతాలు ఆ చేయి ఈ చేయి తాళాలూ అనురాగాలలో గట్టి మేళాలూ... మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీ మువ్వ గోపాల గీతాలు ఆ చేయి ఈ చేయి తాళాలూ అనురాగాలలో గట్టి మేళాలూ మా ముద్దు రాధమ్మ రాగాలే... చరణం: 1 నువ్వందం నీ నవ్వందం తల్లో మల్లె పువ్వందం కట్టందం నీ బొట్టందం నువు తిట్టే తిట్టే మకరందం సూరీడు చుట్టూ భూగోళం రాధమ్మ చుట్టూ గోపాళం సూరీడు చుట్టూ భూగోళం... రాధమ్మ చుట్టూ గోపాళం... నడుము ఆడితే కధాకళి జడే ఆడితే కూచిపూడి నువ్వే ఆడితే ఫలానా తతిమ్మాది తిల్లానా మా ముద్దు రాధమ్మ రాగాలే శ్రీ మువ్వ గోపాల గీతాలు ఆ చేయి ఈ చేయి తాళాలూ అనురాగాలలో గట్టి మేళాలూ చరణం: 2 కూరలు తరిగే కూరిమి ఇష్టం చేతులు తెగితే మూతులకిష్టం ముద్దలు కలిపి పెడితే ఇష్టం ముద్దులదాకా వెడితే... వలచిన వారి పరాకు అందం గెలిచిన సతిపై చిరాకు అందం కొపతాపముల కోలాటంలో మనసు ఒక్కటే మంగల్యం కస్సుబుస్సుల కామాటంలో కౌగిలిగింతే కళ్యాణం ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార మీరూ ఓటమి గెలుపుల ఆటుపోటుల ఆలుమగల సంసార జలధిలో ఓడలు జరిపే ముచ్చట గనరే వనితలార నేడూ...
తొలి కోడి కూసేను పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: ముళ్ళపూడి వెంకట రమణ గానం: మురళీధర్, చిత్ర పల్లవి: తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో నాదు మొరకాస్త ఆలించి నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో అందగాడా నిదురపో చందురూడా నిదురపో తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో చరణం: 1 ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి ముగ్గులు పెట్టాలి గోపాలుడా కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి చెంగు విడిచిపెట్టు గోపాలుడా చెంగు విడిచిపెట్టి సెలవిచ్చి పంపితే మాపటేళకు మళ్లీ వస్తాను తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను గుండెలో వలపంతా గుమ్మరిస్తాను చెంగు వదలర సామి గోపాలుడా సరుసుడ నా సామి గోపాలుడా తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో తొలికోడి కూసేను తెలవార వచ్చేను మరుకేళి చాలించి నిదురపో చరణం: 2 సుప్పనాతి సూరీడొచ్చెను వెన్నెలంతా ఎర్రాబారెను మల్లెలన్నీ నల్లాబోయెను కలువకన్నియ కందీపోయెను కమిలిపోయెను కానుకో కంటినిండా నిదురకోసం కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన మూడు జాములు తిరగాలేదు నాలుగోది పొడవాలేదు తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా నిన్నెవరు పిలిచారు సూరీడా నీకిక్కడేమి పని సూరీడా నీకెప్పుడేమి పని సూరీడా... పోరా పోరా సూరీడా రారా రారా సూరీడా పోరా పోరా...
గ్రహణం పట్టని పాట సాహిత్యం
చిత్రం: రాధా గోపాలం (2005) సంగీతం: మణిశర్మ సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు గ్రహణం పట్టని
No comments
Post a Comment