చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ నటీనటులు: కృష్ణ, విజయనిర్మల దర్శకత్వం: బాపు నిర్మాతలు: సురేష్ కుమార్, శేషగిరి రావు విడుదల తేది: 01.07.1967
Songs List:
అటుఎన్నెల ఇటుఎన్నెల పాట సాహిత్యం
చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: సుశీల అటుఎన్నెల ఇటుఎన్నెల ఎటుచూస్తే అటుఎన్నెల ఓరందకాడ బంగారు సామీ నా మనసు ఎవరిపాలు సేతునురా ఈ వయసు ఎవరిపాలు సేతునురా మీదజూస్తే సందమామ కిందజూస్తే తెల్లకలువ మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా ఓరందకాడ బంగారుసామీ నవ్వులోనే తెల్లవారునురా ఏరులా ఎన్నెలంతా జారిజారి పారిపోతే ఏటికెడద అడ్డమే సెదరా ఓరందకాడ బంగారుసామీ నీటిమీదే కొంగు పరతునురా ఆశ పెట్టే లేత పెదవి ఆవులించే దోరవయసు కన్నునిన్నే కౌగలించెనురా ఓరందకాడ బంగారుసామీ నిన్నుజూస్తే మనసు నిలువదురా ఇలా నిన్నుజూస్తే మనసు నిలువదురా
దయలేదా నీకు దయలేదా పాట సాహిత్యం
చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: సుశీల, పి.బి.శ్రీనివాస్ దయలేదా నీకు దయలేదా ప్రాణసఖునిమీద దయలేదా చిటపట చినుకుల దుప్పటి తడిసెను కటకట నాపై దయలేదా నడివీధిలోనే నడిరేయిదాటే పడతిరో ఇసుమంత దయలేదా రాథా చూడుబాధ, కరుణలేదా, అలుకపోదా ఏలా, పంతమేలా, తాళజాలా, విరహజ్వాలా చాలు నీ పదాలు బూటకాలు నాటకాలు ఆలు ఎర్రతేలు దానికాలు నీకు మేలు సత్య మీద చూపించు హెచ్చుతున్న వలపు తట్టితట్టి ఏడ్చినా తీయనోయి తలుపు దయచేయి నువ్వు దయచేయి దాని యింటికే దయచేయి అలదాని యింటికే దయచేయి భామా సత్యభామా విజితహేమా చూడు ప్రేమా ఒట్టు నన్ను తిట్టు జడనుకొట్టు, వలదు బెట్టు మగువ లెందరున్ననూ మరులుకొంది అత్త మగవారి మోసాలు మాకు కావు కొత్త కల్లబొల్లి మాటలు మేము యింక నమ్మం వెళ్ళువెళ్ళు చేరుకో రాధ పెరటిగుమ్మం దయచేయి నువ్వు దయచేయి దాని యింటికే దయచేయి అల దానియింటికే దయచేయి దయలేదా మీకు దయలేదా ప్రాణ సఖునిపైన దయలేదా బ్రతుకు వీధిపాలాయెను దయలేదా వచనం: అంకటి కపట నాటక సూత్రధారియగు మురారి అమ్మగువల నేమ్మనమున తన మాయవల్ల ఏమి తోపించినా, డనగా తానొక్కడే మగడు వాని కెందరో సఖులు సొగసౌ తేనెకు తుమ్మెద జగతిని వేవేల లతల చరియించదొకో మగవాడు నటులే కాదా మగువా నీ మనసులోన మచ్చరమేలే అంతట అయ్యంగనా మణులు తమముంగిళ్ళు వీడి ఏమనుచున్నారనగా ..... రావోయి కృష్ణ రావోయి రాధ యింటికే రావోయి ప్రేమధామ యింటికే రావోయి రావోయి కృష్ణ రావోయి భామయింటికే రావోయి ముద్దు భార్య యింటికే రావోయి శ్రీ కృష్ణ అహం | మీ యిద్దరూ నేస్తం కడితేగాని నే రాను అని చేతులు కలుపుతున్నాడు. కోరస్: రావోయి కృష్ణ రావోయి రాస క్రీడకూ రావోయి అల రాసకేళికే రావోయి
చుక్క నిన్నుఎతుకుతుంటే పాట సాహిత్యం
చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల, సుశీల సిలిపోడా సిన్నోడా సీరదోచు కున్నోడా సలిసలిగా వున్నదిరా సరసాలు సాలునురా చుక్క నిన్నుఎతుకుతుంటే ఎక్కడోయీ దాగున్నావూ దుబ్బుచాటూ సందమామా దబ్బున బై టికిరారా సీర దొంగిలించానే శ్రీకృష్ణుడు నై నానే రేపల్లె గోపెమ్మను ఏపుకు తింటున్నానే సొగసైనా సినదానా సోగా కన్నుల దానా సలిసలిగా వున్నదిరా సరసాలు సాలునురా చిన్నదే నీదైనాకా చీర నీకు ఎందుకురా? సీరిస్తే ఏమిస్తావ్ ? న నవ్విస్తా నిను నవ్విస్తా నవ్వించీ నిను కవ్విస్తా సీకటీ సీరాగట్టి సిగ్గులా రైకా దొడిగి టెక్కు గిక్కూ ఒగ్గేసి రారా టక్కరి సుక్కా
అమ్మ కడుపు చల్లగా... పాట సాహిత్యం
చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: సుశీల పల్లవి: అమ్మ కడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా అమ్మ కడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా చరణం: 1 నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా .. నా సిగపూవుల రేకైనా వాడదురా... వాడదురా .. బతకరా.. బతకరా పచ్చగా చరణం: 2 చల్లని అయిరేణికి మొక్కరా .. సన్నికల్లు మీద కాలు తొక్కరా చల్లని అయిరేణికి మొక్కరా .. సన్నికల్లు మీద కాలు తొక్కరా చల్లనేళ కంటనీరు వద్దురా ... నా నల్ల పూసలే నీకు రక్షరా.. రక్షరా ... బతకరా.. బతకరా పచ్చగా చరణం: 3 నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. నా చెయ్యి నీ చెయ్యి కలపరా నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. నా చెయ్యి నీ చెయ్యి కలపరా ఏడడుగులు నాతో నడవరా ... ఆ యముడైనా మనమద్దికి రాడురా.. రాడురా .... బతకరా.. బతకరా పచ్చగా అమ్మ కడుపు చల్లగా... అత్త కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగా
ఎవరికివారే ఈలోకం పాట సాహిత్యం
చిత్రం: సాక్షి (1967) సంగీతం: కె.వి.మహాదేవన్ సాహిత్యం: ఆరుద్ర గానం: మోహన్ రాజ్ పదిమందికోసం నిలబడ్డ నీకు ఫలితం ఏమిటి? యమపాశం! ఎవరికివారే ఈలోకం రారు ఎవ్వరూ వీకోసం నిజము నిప్పులాటి దెప్పుడూ నిన్ను దహించక తప్పదూ లేదులేదురా న్యాయమూ నీకు చావు ఒక్కటే సాయము నిట్టూర్చే గాలి నిదురించె భూమి నినుచూసి నవ్వింది ఆకాశం ఎవరికి వారేయీ లోకం వేసిన తలుపులు తీయరు మూసిన కన్నులు తెరువరు ఎంత పిలిచినా పలకరు నీకై రవ్వంత కన్నీరు విడువరు చుట్టాలులేరు నక్కాలులేకు నీ నీడతో చేయి సావాసం ఎవరికి వారే యీ లోకం చందమామా నిజము చూడకు చూసినా సాక్ష్యం చెప్పకూ పరిగెత్తి వస్తోంది రాహువు అయ్యో తరిగిపోతున్నాది ఆయుపు నా దైవానికైనా దయలేదు ఒంటిగా చేరవోయ్ కై లాసం ఎవరికి వారే యీలోకం రారు ఎవ్వరూ నీకోసం