Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Samajaniki Saval (1979)




చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
నటీనటులు: కృష్ణ, శ్రీదేవి, సుమలత
దర్శకత్వం: యస్.పి.రాజారాం
నిర్మాత: యస్.పి.వెంకన్నబాబు
బ్యానర్: శ్రీ ఉదయ్ ఆర్ట్ పిక్చర్స్
విడుదల తేది: 28.12.1979



Songs List:



నడిచే ఓ అందమా.. పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా
పండగంటి పడుచువాణ్ణి.. ఎండకంటి చూపువాణ్ణి
అంటుకోవు.. జంటకావు.. పంతమా
నడిచే ఓ అందమా..

నడకే నా అందము... పరుగే నీ కోసము
మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము
నడకే నా అందము...

చరణం: 1
నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది
నీ అడుగుల్లో హంసధ్వని రాగమున్నది
అది నీకూ నాకూ ఏక తాళమైనది

నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది
నీ పలుకుల్లో పడుచుదనం పల్లవైనది
అది నాలో నీలో వలపు వెల్లువైనది

చూపుల సుడివడి... అడుగులు తడవడి
చూపుల సుడివడి... అడుగులు తడవడి
మనసులు ముడిపడితే అందమూ.. రాగబంధము

నడిచే ఓ అందమా..ఆ.. ఆ.. నడకే నా అందము

చరణం: 2
నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి
నీ పిలుపుల్లో అష్టపదుల వలపులున్నవి..
నవమోహన వేణువులై అవి పలుకుతున్నవి

నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి
నీ చూపులలో వెన్నెల మునిమాపులున్నవి
అవి ఎండలలో విరివెన్నెల దండలైనవి

అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
అడుగులు దూరమై.. ఎడదలు చేరువై..
వయసులు గుడికడితే అందమూ.. ప్రేమబంధము

నడిచే ఓ అందమా.. పరుగే నీ పందెమా

మల్లెపూల మనసుదాన్ని... వెన్నెలంటి చిన్నదాన్ని
అంటుకుంటే అంతులేని తాపము...




ఆనంద మానంద మాయెనే పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

ఆనంద మానంద మాయెనే
మా సీతమ్మ పెళ్ళికూతురాయెనే

మా రామయ్య పెళిళకొడు కాయెనే
ఆచూపు ఈచూపు చుట్టాలు కాగా
ఆ చూపు ఈ చూపు చుట్టాలు కాగా
ఆకంటి కీ కన్నె కట్నాలు తేగా
కల్యాణమే వై థోగమే –
మురిపాల ముంగిళ్ల లోన
ఇరువురి సరసాల వందిళ్ళలోన
కనుచూపు కౌగిళ్ళలోన
సడిలేని సరసాల సందెళ్ళలోన
ఆమేను యీ మేను మేళులుగా
ఆ తాకీ తాకని వలపు తాళాలుగా

కల్యాణమే వైభోగమే
సీతకు ప్రాణం రామయ్య
దశరథ రాముని బాణం సీతమ్మ
లంకకు చేటు సీతమ్మ
రక్కసి మూకలకే పోటు రామయ్య
సీతమ్మ రామయ్య కల్యాణమే
లోకానికే నిత్య కల్యాణమే
కల్యాణమే పై భోగమే



వద్దు వద్దంటున్నా వయసొచ్చింది పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.శైలజ 

వద్దు వద్దంటున్నా వయసొచ్చింది
పడుచోళ్ళతో పెద్ద బెడదొచ్చింది
ఏం చేయను ఏడ చావను
ఓయ్ బావలు ఓయ్ మావలు
పచ్చగడ్డి కొయ్యబోతే పాలేరు కన్నుకొట్టే
సరుకులు కొనబోతే షావుకారు కొంగుబట్టే
గుళ్ళో పూజారి నా కళ్ళల్లోకి చూడబట్టే
ఇంట్లో నా అక్క మొగుడు ఏదో వంకతో తాకబట్టే

ఏం చేయను అబ్బ ఏడ చావను
ఓయ్ దావల ఓయ్ మావలూ

పడుచోడు కనబడితే
పాడు మనసు ఆగదాయె
పదిమందిలో వున్నా పైటకొంగు నిలవదాయె
వుండుండి వళ్ళంతా
వులుకేదో మొదలాయె
ఎందుకొచ్చిన పీడ వయసు
ఏమేమో చేసి పోయే




చీరలమ్మా చీరెలు పాట సాహిత్యం

 
చిత్రం: సమాజానికి సవాల్ (1979)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు

చీరలమ్మా చీరెలు వన్నె వన్నెల చీరెలు
వెంకటగిరి చీరెలు ధర్మవరం చీరలు కంచి పట్టు చీరెలు గద్వాలు చీరలు
కన్నెలకైనా, అమ్మలకైనా కన్ను చెదిరే చీరలు
ఆవ్వైనా ఈ చీర కట్టుకుంటే పదహారేళ్ళ పడుచల్లే వుంటుంది
కన్నె పిల్లైన ఈ చీర కట్టుకుంటే పెద్ద ముత్తయిదువల్లె వుంటుంది
అకతాయి భామలను ఆదుపున పెట్టే చీర ఇది
ఒళ్లు తెలియని పడుచులకు ఒదుగులు నేర్పే చీర ఇది
ప్రేయసికి చీర నందించు ప్రియుడు తీయని ప్రేమకు సూచనగా
చెల్లాయికీ చీర నందించు అన్నయ్య చల్లని మమతకు దీవెనగా
పుట్టిన రోజైనా, తాళి కట్టిన రోజైనా ప్రతి వనిత కొత్త చీరకడుతుంతి - మనసారా

No comments

Most Recent

Default