చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి (All) నటీనటులు: కృష్ణ, జయప్రద కథ: వడ్డాది మాటలు: జంధ్యాల స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కట్టా సుబ్బారావు సినిమాటోగ్రఫీ: ఎ. వెంకట్ ఎడిటర్స్: యమ్.ఉమానాథ్ , మణి నిర్మాతలు: జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి, నూలి రంగయ్య బ్యానర్: విష్ణుప్రియ ఆర్ట్ పిక్చర్స్ విడుదల తేది: 24.02.1979
Songs List:
ఛర్రు బొప్పాయి గుండు పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఛర్రు బొప్పాయి గుండు బోడిగుండు బొప్పరాయిగుండు బోలా కొట్టిందీ బొప్పాయిగుండు ఆడగాలి సోకగానే ఆటే తలకిందు అమ్మాయి చూపుకు అబ్బాయి చిత్తు దెబ్బకు తాసాల్ బంద్ బోడిగుండు బొప్పరాయి గుండు బోల్తా కొట్టిందీ బప్పాయి గుండు అందాలన్నీ ఆరబోస్తే ఆటే తలకిందు వయ్యారి భామా సయ్యాటలన్నీ దెబ్బకు తాసాల్ బందూ కుడి ఎడమైతే పొరబాటు గురి చెదిరిందా గ్రహపాటు ఆడ చేతిలో ఓడడమే ఆది నుంచి మీకలవాటు ఆవాగుడుకాస్తా ఆపకపోతే వళ్ళు నాకు మండు అచ్చిక బుచ్చిక లాడావంటే మచ్చిక చేస్తా చూడు. అక్రమాలలో విక్రమార్కులు వక్రబుద్ధిలో వంద మార్కులు ఓటమి గెలుపనుకుంటారు ఎప్పుడో ఫల్టీ కొడతారు అణిగి మణిగి వుండక పోతే వేస్తా ఘాటు మందు బడాయి పప్పు లడాయి చారూ చేస్తా నీకు విందు
పున్నాగ తోటల్లొ సన్నాయి పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల పల్లవి: పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. చరణం: 1 దేవుడి మాట.. కోవెల గంట.. దీవెనగా పలికింది పండగ పూట పడుచుల పాట.. పల్లె పదంగా మిగిలింది అనురాగాలే విను రాగాలై.. మమతల వేణువు పిలిచింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. చరణం: 2 రెప రెపలాడే రెప్పలలోనే రేపటి పొద్దులు మెరవాలి నవనవలాడే నవ్వులలోనే వయసు వసంతలాడే కన్నెతనంలో వెన్నెల కెరటం నేడే ఈడై ఎగసింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ.. ఆ సన్నాయి పాటల్లో అమ్మాయి ఆడింది గోదారి వరదల్లే ఉయ్యాలలూగింది పున్నాగ తోటల్లొ సన్నాయి పాడింది..ఆ.. ఆ..
ఓ.. కలలోని ఊర్వశీ.. పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: ఓ.. కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే ఓ.. ఓ.. ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక వచ్చాను పిలుపే నీదనీ.. నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే చరణం: 1 నీ సోకులన్నీ కను సోకగానే.. పులకింత నాలో పలికిందిలేవే నిను చూడగానే నిలువెల్ల పొంగే.. నను తాకగానే తనువెల్ల ఊగే నా రాగాలలో డోలలూగాలిలేవే ఓ.. అనురాగ మాలిక.. అందాల ఏలిక వచ్చాను పిలుపే నీదనీ.. నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే చరణం: 2 జత చేరగానే జడివాన కురిసే.. జడివానలోనే ముడికాస్త బిగిసే నీ గుండెలోనే తలదాచుకోనీ.. నీ ఎండలోనే తడి ఆర్చుకోనీ ఈ వానల్లో వలపంతా వరదల్లే పొంగే ఓ కలలోని ఊర్వశీ.. కల కాని ప్రేయసీ వచ్చాను వలపే నీవని నీ కోసమే వేచి ఉన్నానులే నీ కౌగిలే కోరుకున్నానులే అహా..హ..హా..
గుటకాయ స్వాహా సర్వం పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు గుటకాయ స్వాహా సర్వం గుటకాయ స్వాహా అత్త సొత్తుకే అల్లుడి దానం సత్తు చిత్తూ యావత్తూ గుటుక్కు అన్నదాతా సుఖీభనా మీ అత్తగారూ సుఖీభవ అత్త చేత్తో నెయ్యేసిందా ఎత్తిపోతల జలపాతం మీ నెత్తికి నేతుల అభిషేకం ఎముకలేని ఆచేతి వడ్డన తిన్నవారికే తిన్నంత ప్రాప్తం మాకూ మాకూ లక్ష్మంటవి మధ్య మీకెందుకు మధ్య అహ మీకెందుకు మధ్య మీ తిండి మీది మిగతాది మిధ్య చెయ్యండి స్వామి హల్వాల హత్య అన్నదాతా సుఖీభవా మీ అత్త గారూ ముఖీభవా కడుపు అన్నది కడలి వంటిది ఎంత మెక్కిన తక్కువంటది వెనకా ముందూ చూడకుండా తునకా తుభ్యం సేవించండి అస్తు పిస్తుగా భోం చేయ్యండి అస్తు తధాస్తని దీవించండి మాకూ మాకూ కోపం తాపం ఏభై ఆరుంటాయ్. మీకెందుకు పాపం అహ మీకెందుకు ఆ పాపం డబ్బూ దస్కం సర్వనాశనం చెయ్యండి స్వామి మాయిల్లు గుల్ల
పాలు పొంగే వయసే నీది.. పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల, యస్.పి.బాలు పల్లవి: పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే.. పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే.. చరణం: 1 చల్లకొచ్చి ముంత దాచే చక్కని గుంట.. నువ్ సల్లగుండ రావే నా వెంట రాగాల పంట పగలు రేయి పండించుకుంట...ఓ..ఓ..ఓ.. అల్లరెందుకు అందాల విందుకు పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే.. చరణం: 2 మాటలెందుకు మగసిరుంటే.. పాటలెందుకు నీ పక్కనుంటే అరుపులెందుకు నిన్నల్లుకుంటే.. అర్ధరాత్రి ఎవరేనా వింటే.. ఓ..ఓ..ఓ.. హద్దులెందుకు ముద్దాడుకొందుకు పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే.. చరణం: 3 పాత రోజులు గుర్తుకొచ్చే.. కొత్త మోజులు పుట్టుకొచ్చే బండబారిన పడుచుదనము... పడగ విప్పి పైపైకి వచ్చే ఏ..ఏహె..ఏహె.. అల్లరెందుకు అందాల విందుకు పాలు పొంగే వయసే నీది.. పంచదార మనసే నాది కలుపుకొంటే కమ్మగుంటదిలే.. అది వలపు కంటే తీపిగుంటదిలే.. అహ..అహ..హ..హ..హా.. ఆ..ఆ..ఆ..ఆ..ఆ.. ఓ..ఓ..ఓ.. ఓ.. ఓ..
లోకాల నేలే నూకాలమ్మో పాట సాహిత్యం
చిత్రం: వియ్యాలవారి కయ్యాలు (1979) సంగీతం: చళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: లోకాల నేలే నూకాలమ్మో మేలుకో మమ్మేలుకో కొలుపుల్నే చేస్తాము పోలేరమ్మో కాచుకో కాపాడుకో అమ్మల గన్నయమ్మ నమ్మిన నాంచారమ్మా అండపిండ బ్రహ్మాండాలదరగొట్టరావమ్మా ॥లోకాలే॥ చరణం: 1 మరియమ్మను నేను మంటెక్కి వున్నాను. మరియాద చెయ్యండిరో పెద్దింటమ్మను నేను మీ యింటికొచ్చాను పేరంటం చేయ్యండిరో ఇనుప గజ్జెల మోత ఇనపడుతోంది ఎనక నుంచి గజలక్ష్మి వచ్చేస్తోంది. ఏటలొద్దు....వద్దా? పోతులౌద్దు ... ఏంకావాలమ్మా? కడు నిండు నైవేద్యం గజలక్ష్మిరో శాంతించమ్మా శాంతించమ్మా శాంతించి మాకు దారి చూపించమ్మా బతికుంటే బలుసాకు తింటుంది పచ్చని కొంపల చిచ్చు పెడుతుంది భూత బలులు నైవేద్యాలెన్నెనో వుండగ ఈ నర రూప రాక్షసి నీకెందుకమ్మా చరణం : 2 కంకాళ కాళినీ చండీ చాముండినీ కైంకర్యం చెయ్యండిలో శాకినీ డాకినీ శక్తుల్ని ఊదేస్తా సంబరాలు చెయ్యండిరో ఇడిగిడిగో తోకచుక్క నయ్యాల ఈడ్ని ఏసెయ్యరో నాకు ఇయ్యాల చుక్కేసుకుంటాడు చుక్కల చెరబడతాడు ఆడజాతికే వీడు కీడు చేస్తున్నాడు. శాంతించమ్మా శాంతించమ్మా శాంతించి వీణ్ని మాకు ఒదిలెయ్యమ్మా అడ్డమైన గడ్డి తినీ బలిశాడు. కొంపల్ని ముంచడమే వీడి పని నాటమైన వేటలెన్నో నికుండగ ఈ నీతిలేని గుంటనక్క కుటుంబరావు నీకెందుకమ్మా