Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Deshoddharakudu (1986)




చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
నటీనటులు: బాలకృష్ణ, విజయశాంతి
దర్శకత్వం: ఎస్. ఎస్. రవిచంద్ర
నిర్మాత: ధనేకుల. మురళీ మోహన్ రావు
విడుదల తేది: 07.08.1986



Songs List:



అమ్మాయి ముద్దబంతి పాట సాహిత్యం

 
చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నాది?
ముద్దిస్తే మందార మొగ్గౌతున్నాది
అమ్మాయి నూగారు మెడ ఏమన్నాది?
అమ్మాయి నూగారు మెడ ఏమన్నాది?

సన్నాయితో తాళి కట్టాలన్నాది
సన్నాయితో తాళి కట్టాలన్నాది
అరె తప్పెట్లమ్మా తాలాలు
దేవుడి గుళ్ళో బాజాలు
ఒయ్ ఒయ్ ఒయ్ తప్పెట్లమ్మా తాలాలు
దేవుడి గుళ్ళో బాజాలు

అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నాది?
ముద్దిస్తే మందార మొగ్గౌతున్నాది

ఉయ్యాలూగే వయ్యారమ్మా ఏమన్నాది?
సయ్యాటాటాడే సరసాలమ్మ ఏమిస్తది?
కన్నె కౌగిళ్ళల్లో కట్నాలన్నీ నీవేనన్నది
లేనంటున్న లేనడుమమ్మ ఏమున్నది!
ఉందనుకుంటు చెయ్యేస్తుంటే ఏమౌతది?
కట్టుచీరకు తప్ప తెలియని గుట్టు నీదౌది
దీపం పెట్టే వేళవుతుంటే గుబులమ్ముడు
ఆ దీపం తీసి తలుపేసేది ఇంకెన్నడు?
సంధిళ్ళల్లో ప్రాణాలు చూడని చీకటి కోణాలు
అరెరే.. సందళ్ళల్లో ప్రాణాలు 
చూడని చీకటి కోణాలు

అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నాది?
ముద్దిస్తే మందార మొగ్గౌతున్నాది

కాటుక పెట్టే కనుపాపమ్మ ఏమున్నది?
కాటేస్తుంటే కసి బుగ్గమ్మ ఏమున్నది!
నువ్వు బుగ్గన చుక్క పెట్టేదాక సిగ్గన్నది
అబ్బబ్బో వచ్చే వచ్చే శ్రావణమాసం ఏమున్నది?
వచ్చిరాని జత కోలాటం ఎట్టుంటది!
కాసే కాయ పండై కవ్వింతల్లో ముంచేస్తది
పగ్గాలన్నీ తెంపేస్తున్న పరువాలలో....
లగ్గాలింక పెట్టకపోతే పరువుంటదా
మద్దేళ్ళమ్మ మేళాలు వెన్నెల వేళా కోలాలు
కరు . ఓయ మద్దేళ్ళమ్మ మేళాలు 
వెన్నెల వేళా కోలాలు

అమ్మాయి ముద్దబంతి బుగ్గేమన్నాది?
ముద్దిస్తే మందార మొగ్గౌతున్నాది
అమ్మాయి నూగారు మెడ ఏమన్నాది?
అమ్మాయి నూగారు మెడ ఏమన్నాది?

సన్నాయితో తాళి కట్టాలన్నాది
సన్నాయితో తాళి కట్టాలన్నాది
అరె తప్పెట్లమ్మా తాలాలు
దేవుడి గుళ్ళో బాజాలు

అరె పిప్పి పీ పీ డుండుం డుం
చచ్చ చా   పిప్పి పిప్పి




ఎంతపని చేసిందమ్మ బిళ్ళంగోడు పాట సాహిత్యం

 
చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

అమ్మో...
ఎంతపని చేసిందమ్మ బిళ్ళంగోడు
ఆహాహా ఓహోహో
ఎట్టానే తీర్చాలమ్మ పిల్లగోడు 
ఆహాహా ఓహోహో
ఎక్కడో చిక్కిందమ్మ బిళ్ళంగోడు
ఎక్కడో చిక్కిందమ్మ బిళ్ళంగోడు
వెతకబోతే కలిసిందమ్మ ఈడు జోడు హా
హ అఆఆ..హ అఆఆ.. హా అఆఆ

ఎంతపని చేసిందమ్మ బిళ్ళంగోడు 
ఆహాహా ఓహోహో
ఎట్టానే తీర్చాలమ్మ పిల్లగోడు
ఓహోహో ఆహాహా

చెమ్మచెక్కలాడుకోక ఏల ఆడితి?
తొక్కుడుబిళ్ల ఆడుకోక ఏల అడితి?
ఆటల్లో అందాలే కందెనమ్మా
వొంగే పొంగు జారే కొంగు ఎల చూసితి?
కరిగే బొట్టు దొరికే గుట్టు ఏల చూసితి?
హొయ్ కాదంటూ కవ్విస్తే ఎట్టాగమ్మా?
హోయ్ నిప్పంటు దాన్ని నేను నీటుగాడా
నన్నంటుకున్నానంటే అగ్గిమంటా
నీ ఒంటికాకంతా నిప్పులేవమ్మో
తప్పు ఒప్పు ముద్దుల్లోన ముంచెత్తేనమ్మో

హా హా హా హా హా

ఎంతపని చేసిందమ్మ బిళ్ళంగోడు
ఆహాహా ఓహోహో
ఎట్టానే తీర్చాలమ్మ పిల్లగోడు
అయ్యయ్యో  అబ్బబ్బో

ఆటాపాటా అన్నీ ఉన్న అందగాడిని హా
సయ్యాటల్లో పేరుగన్న సవ్యసాచిని
నా ఒళ్లోనే పడ్డావే వన్నెలాడి
చల్లకొచ్చి ముంతదాచే పిల్లదానిని
ముంత దాచి ముద్దులడిగె ముద్దరాలిని
నీ ఒళ్లోనే ఉంటాలే చంటివాడా
హోయ్ చంటోన్ని కాను నేను సత్యభామ
ఈ రేపల్లెకంతా నేను మేనమామ
హోయ్ భాగోతం చాలుగాని బాలకిష్టయ్యో
వెన్న జున్నులిస్తాగాని వెళ్లిరావయ్యో

ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ హో

ఎంతపని చేసిందమ్మ బిళ్ళంగోడు
ఆహాహా ఓహోహో
హెయ్ ఎట్టానే తీర్చాలమ్మ పిల్లగోడు
ఓ హోహో ఆహాహా

ఎక్కడో చిక్కిందమ్మ బిళ్ళంగోడు - ఆహాహా
ఎక్కడో చిక్కిందమ్మ బిళ్ళంగోడు 
అయ్యో వెతకబోతే కలిసిందమ్మ 
ఈడు జోడు - ఓహో ఓహో ఓహో హా

ఆఆ ఆఆ ఆఆ ఆ హా
ఓఓ ఓఓ ఓఓ ఓ ఓ హో




గగన వీధుల్లో పాట సాహిత్యం

 
చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

తందాన తానాన తన తన
తందాన తానాన తన తన

గగన వీధుల్లో  ఓ...  -  ఓ...
గాజు మేడల్లో - ఓ...
సందెపొద్దు సావాసాలు 
కన్నెముద్దు తాంబూలాలు
నావేనంటా నవ్వే చూడు నువ్వేనంటా

తందానన  తందానన

పులకరింతల్లో ఓ... - ఓ... 
పూలబాటగా - ఆ...
కొండాకోన వాకిలల్లో ఎండా వాన కౌగిళ్లల్లో
నవ్వేజంట నువ్వేనంటా  నీతోవుంటా

తందన తందాన తాన
తందన తందాన తాన

చుక్కలు వెలిగిన చోట 
చూపులు తగలని చోట
నువ్వు ఒళ్ళో కొస్తే 
ప్రేమబల్లో వేస్తా చినవాడా

సూర్యుడు చూడని గంగ 
చంద్రుడు చూడని కలువ
ముద్దులిప్పిస్తాలే 
ప్రేమదిద్దిస్తాలే చినదానా

వాలుపాదు బొట్టుపెట్టి పోయే ల లా.. లా..
చందమామ పువ్వులివ్వవచ్చే ల లా.. లా..
కృష్ణవేణి నది పొంగిపోయినది హే...

పులకరింతల్లో ఓ ఓ -  ఆ ఆ
పూలబాటల్లో - ఆ  ఆ

సందెపొద్దు సావాసాలు 
కన్నెముద్దు తాంబూలాలు
నవ్వేజంట నువ్వేనంటా నీతోవుంటా

తందాన తందాను

పెదవులు కలిసిన చోట ప్రేమలు వెలసిన చోట
జంటకట్టేందుకే జన్మ ఎత్తానులే చినదానా
పరువము పుట్టిన చోట ఫైటలు వేసిన చోట
సిగ్గుదోచేందుకే నీకు దక్కానులే చినవాడా

చేతిరంత వెన్నెలిచ్చుకుంటే  ల లా... లా..
తెల్లవార్లు నిన్ను అల్లుకుంటే  ల లా... లా..
పేరుకిద్దరము ప్రేమ కొక్కరము హే...

గగన వీధుల్లో  ఓఓ - ఓ...
గాజు మేడల్లో.. ఓఓ - ఓ.ఓ...
కొండాకోన వాకిలల్లో ఎండావాన కౌగిళ్లల్లో
నవ్వేజంటా నువ్వేనంటా నీతోవుంటా




పట్టుకుంటే మాసిపోయే పడుచుపిట్టా పాట సాహిత్యం

 
చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

ఆహా... గిలిగిలిగిలిగిలి గిలి గిలి
పట్టుకుంటే మాసిపోయే పడుచుపిట్టా 
ఆహో అహో
పట్టు కాస్త చిక్కిపోయే పాలపిట్ట ఆహో అహో
పైట కొంగు జారిపోయే కంగారులో
పుట్టుమచ్చ ముద్దులిచ్చే కౌగిళ్లలో
నా దెబ్బకు నిన్ను అబ్బనిపించి
దెయ్యాన్ని దించెయ్యనా

అహో - దినక్ దిన్ (4)

మోజులింక పెట్టమాకు పోరగాడా ఆహా ఆహో
రంకెలేసి లాభమేమి అంగపోడా ఆహా ఆహో
నక్కజిత్తులన్ని జిత్తు నా ముందు
బిక్కసచ్చిపోమాకు రా సుందరా
ని ఎత్తుకు నేనూ పైఎత్తేసి దాసోహమనిపించనా

ఆహా అహహా హా ఆతర...

గిరిగిలిగిలి గిలిగిలిగిలిగిలి గిల్లీ గిల్లి గిల్లి
గిల్లీ కజ్జా గీర్వాణమ్మా గిచ్చుడు మంత్రం పెట్టేస్తా
తరికిట తరికిట తరికిట తరికిట
కుక్కురు కకుక్కురు కూ
అల్లాటప్పా గోంగూరమ్మ చెక్కలిగింతలు పెట్టేస్తా
అల్లుడు నేనై వచ్చేస్తా
నీ ఇల్లును గుళ్లను చేసేస్తా
సున్నం కొట్టి సూడిదలిస్తా రారా సరసుడా
అరె పోరా వీరా సూరా చోరా చండామర్కుడా

అహో అర్హహా  ఆహో హే.. హహ
అహో, అనను  ఆహా! ఆ హాహా

పట్టుకుంటే మాసిపోయే పడుచు పిట్టా
ఆహో ఆహా
పట్టు కాస్త చిక్కిపోయే పాలపిట్ట అహో అహో
నక్కజిత్తులన్ని చిత్తు నా ముందర
బిక్కసచ్చిపోమాకు రా సుందగా
నా దెబ్బకు నిన్ను అబ్బనిపించి 
దెయ్యాన్ని దించెయ్యనా

చెడుగుడు చెడుగుడు చెడుగుడు 
చెడుగుడు చెడుగుడుగుడు
టింగురంగా పింగాణమ్మా 
ముద్దుల మోతలు పుట్టిస్తా
చింగారే చింగారే చింగ చింగారే చింగారే చింగ
లంగాఓణీ బంగారమ్మా లాగుడు మంత్రం ఆడేస్తా
చెంపలు మెత్తగ వాయిస్తా
కెంపులు గుంపులకెత్తేస్తా
గాజులు వేస్తా, గంధం పూస్తా రారా రసికుడా
మిడి మేళం తాళం కళ్ళెం పెట్టి ఊరేగించనా

అహో దినక్ దిన్ ఆ కుక్కురొక్కు క్కుర్
అహో జరగ... ఆహా హహా  కిర్

పట్టు కాస్త చిక్కిపోయే పాలపిట్ట ఆహో అహో
పైట కొంగు జారిపోయే కంగారులో
పుట్టుమచ్చ ముద్దులిచ్చే కౌగిళ్లలో
నా దెబ్బకు నిన్ను అబ్బనిపించి
దెయ్యాన్ని దించెయ్యనా

అహో - దినక్ దిన్ (4)




వచ్చె వచ్చె వాన జల్లు పాట సాహిత్యం

 
చిత్రం: దేశోద్ధారకుడు (1986)
సంగీతం: కె. చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్. పి. బాలు, పి.సుశీల

అరె వచ్చె వచ్చె వాన జల్లు
గొడుగు ముద్దు పెడతా
హా గుచ్చె గుచ్చె వలపు ముళ్ళు
అడుగు ముద్దు పెడతా
హోయ్ మోజుపూల మొగ్గ తడిసి 
మోహనాల బుగ్గ తడిసి
జాణ ఒళ్ళే మెరిసిందిలే
ఆహా జంట బాగా కలిసిందిలే

హా వచ్చే వచ్చే వాన జల్లు 
గొడుగు ముద్దు పెడతా
అరె గుచ్చె గుచ్చె వలపు ముళ్ళు 
అడుగు ముద్దు పెడతా

సూటిగొచ్చి నాటుకుంది 
సూది చినుకు - హోయ్ - హా
చాటు చూసి కాటువేసే
నీటి చినుకు - హోయ్ - హా
వానొచ్చి నా పిచ్చి ముదిరిందమ్మో
అందాలు అప్పిచ్చి పొమ్మందమ్మో
వరదల్లే నా వయసు పొంగించుకో
పరువాల నీ పడవ నడిపించుకో
అరె తాకిడిలో  తందనాలో
తాకితేనే తంటాలమ్మో

వచ్చె వచ్చె వాన జల్లు 
గొడుగు ముద్దు పెడతా - హా - హా
గుచ్చె గుచ్చె వలపు ముళ్ళు 
అడుగు ముద్దు పెడతా - హా హా

ముక్కుమీద పడ్డ చినుకు
ముక్కుపుడక - హా - హోయ్
పెదవి మీద పడ్డ చినుకు
ముద్దు చిలక హా హోయ్
తడిపైట తాళాలు వేసిందయ్యో
ఒడినిండా తాపాలు తెంచిందయ్యో
మబ్బొచ్చి మెరుపు కళ్ళు కొట్టిందమ్మో
మనసంతా కొత్త ఉరుము పుట్టిందమ్మో
ఒంటిమీద లేత చినుకు
కంటిమీద పెట్టిందయ్యో

అరెరరె వచ్చె వచ్చె వాన జల్లు
గొడుగు ముద్దు పెడతా ఉమ్ ఉమ్
గుచ్చె గుచ్చె వలపు ముళ్ళు
అడుగు ముద్దు పెడతా  హా ఆ
మోజుపూల మొగ్గ తడిసి
మోహనాల బుగ్గ తడిసి - హా
ఒళ్ళే మెరిసిందిలే  హా
జంట బాగా కలిసిందిలే


No comments

Most Recent

Default