చిత్రం: ఏమో గుర్రం ఎగరావచ్చు (2013)
సంగీతం: యమ్.యమ్.కీరవాణి
సాహిత్యం:
గానం: రాహుల్ సిప్లిగంజ్
నటీనటులు: సుమంత్ , సావిక
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
నిర్మాత: పూదోట సుధీర్ కుమార్
బ్యానర్: చెర్రీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్
విడుదల తేది: 2013
పల్లవి:
ఓ నీలవేణి నీలవేణి రావే అలక మాని
నీ హంసనడకలని ఫాలో అవుతున్నానని
కోపంలోను ఇంతందమా మనకి మనకి
తేడాలెన్నో ఉన్నా కూడా కూడా రానా
నీడై నీడై పోనా ఇలా ఇలా (2)
చరణం: 1
ఎండపడి ఎర్ర ఎర్రగా కందినదే లేత బుగ్గ
గొంతుతడి ఆరి ఎంతగా వాడినది మల్లెమొగ్గ
నీకోసం నీలి మబ్బునై ఆకాశం చేరనా
నేనే ఓ వాన జల్లునై ఒళ్ళంతా తడమనా
కూడా కూడా రానా నీడై నీడై పోనా
తేడాలెన్నో ఉన్నా ఇలా ఇలా
చరణం: 2
సోయగము విరిసి గుండెకే చేయకిక తీపిగాయం
సోకులతో నన్ను చంపడం నీకు ఇది ఏమి న్యాయం
నీ పంతం మొయ్యలేనిదని ఏనాడో తెలిసినా
నువ్వేడు మల్లెలెత్తు అని ఇష్టంగా మోయనా
కూడా కూడా రానా నీడై నీడై పోనా
తేడాలెన్నో ఉన్నా ఇలా ఇలా
No comments
Post a Comment