చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి గానం: యస్.పి.బాలు, యస్.జానకి నటీనటులు: కృష్ణ , విజయశాంతి దర్శకత్వం: కోడి రామకృష్ణ నిర్మాత: సి. వెంకట్రాజు , జి.శివరాజు విడుదల తేది: 02.03.1989
Songs List:
చక్కన్ని గాజుల్ని సారంగ పాట సాహిత్యం
చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: జొన్నవిత్తుల గానం: యస్.పి.బాలు, యస్.జానకి పల్లవి: చక్కన్ని గాజుల్ని సారంగ తొడిగించు తొడిగించు మెల్లంగ ముంజేయి నొక్కుతూ దరిజేరుతూ ముంజంటీ బుగ్గ నీ ముద్దాడితే లేతా .లేతా వయ్యారాలే మోతా మోగీ పోవాలంట అచ్చొచ్చే గాజుల్ని అందంగ తొడిగేస్తా తొడిగేస్తా మెల్లంగ గమ్మత్తుగుంటదీ నీ సేతికీ నొప్పేదీ పుట్టడు నాజూకుకీ చూశారంటే ఆడోళ్ళంతా దాసోహాలే సెయ్యాలంట....!! చరణం: 1 తొడిగేస్తే నా సేతికి అదరాలీ నా ఒంటికీ సుమపైన నీ సుదుటికీ దిద్దేసా కస్తూరినీ జారింది పడును పైట నీ చూపుకి ఎగిరించి పిల్లమనసు నీ వేపుకీ జాగర జారి జారి పడిపోతదే జాతర్లో కొచ్చినాక గోడవౌతదే నచ్చిన దానికి కానుక యింతేనా? రవ్వల గాజుల రాణికి తందానా! ఈ ముద్దుల మువ్వ మోజుల గువ్వ ఒయ్యారాలే యిస్తాదంటా! చరణం: 2 అందాల చలిమద్దెల వందేళ్ళూ మోగించనీ సరదాల పందాలలో సందేళ్ళ సాగించరా సైయంటే చాలు నువ్వు సందేళకి తాళాలు తప్పవింక తాపాలకి ఊరిస్తూ రేపబోకు ఉబలాటమే కూసింత లేదు నాకు మోమాటమే సీటికి మాటికి సాటుకి రావాలే నీకటి సాటున సిగ్గులు తగ్గాలీ ఇక తప్పదులేవే పక్కకిరావే హద్దూ పద్దూ లేనేలేవే....!
ఆ నీలి కొండలో అందాలు పాట సాహిత్యం
చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, యస్.జానకి ఆ నీలి కొండలో అందాలు ఆరేసుకోవె ఈ లేత ఎండల్లో పరువాలు పండించుకోరా చీరమ్మ గుట్టు చిరుతిళ్ళు పెట్టు విరితేనె బొట్టు చిగురాకు పట్టు ఓ పట్టు పడదామయ్యో | చిమ్మిరి చీకటిలో నా చిక్కని సందిటలో చేజిక్కిన సోకులలో తైతక్కలు చూశావే మల్లెల వొత్తిడిలో మనసిచ్చిన మత్తులలో కై పెక్కిన కన్నులలో కవ్వింతలు చూకావే వలపే వయ్యారమై వొడిలో కొచ్చిందిలే మనసే మందారమై శిగలో పూసిందిలే కన్నీరు మోపే కావిళ్ళు ముద్దు చెక్కిళ్ళు నీవే క్రాపళ్ళు దిద్దు ఈ సందె నరపాలలో చక్కిలి గింతలలో ఎదనొక్కిన చెమ్మలలో వేడెక్కిన అల్లరిలో తమ తిక్కలు చూశావే టక్కుల టిక్కులలో పదునెక్కిన నడకలలో బుగ్గలు ఎరుపెక్కే పులకింతలు చూశావే ఇది ఏ శృంగారమో జతలో కోలాటమై మొదలెట్టేసిందిలే కధలే నీ జంటలో చుక్కమ్మ తోడు సూరీడు రాడు ఓ యమ్మ వినవే నా ఈడు గోడు ఈ మంచు పరదాలలో
నేనేరా! మోసగాళ్ళకి మోసగాడ్ని పాట సాహిత్యం
చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు పల్లవి: నేనేరా! మోసగాళ్ళకి మోసగాడ్ని నేనేలే మంచివాళ్ళకి మంచివాడ్ని... మనసిస్తేనే మానవుడ్ని ఎదురొస్తే నే దానవుడ్ని ఆ చక్రం తిప్పే దేవుడ్ని ఈ సమాజానికే మిత్రుడ్ని చరణం: 1 ఇటు చూస్తే అరాచకం అటు చూస్తే దురాగతం రాబందుల రాజ్యంలో సామాన్యుడి జీవితం ఏదండి ప్రజాబలం రాదండి మరో జగం ఈ మారణ హెూమంలో చావాలా నిరంతరం శివమెత్తిన శివరూపాన్ని చీకటిలో రవి దీపాన్ని గుంఢా అన్నా రౌడీ అన్నా గుండెలున్న బల్ మొనగాడ్ని చరణం: 2 నా పేరే సంచలనం నా దారే సంజ్వలనం ఈ దారుణ లోకంలో నా పిలుపే ప్రభంజనం చెల్లదులే మంచితనం సాగదులే మనిషితనం సెంటర్లో హంటర్ తో నే చెబుతా గుణపాఠం సాధిస్తా నా లక్ష్యాన్ని మనసు ఇచ్చినా మమత పంచినా మాట తప్పనీ మగవాణ్ణి
మగువలా ఉండలేవు పాట సాహిత్యం
చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్. జానకి మగువలా ఉండలేవు మమతలో పండలేవు మాతవై సీతవై మహిలో జీవించలేవు మహికాళిలా రగిలే మానవతీ! లేదు లేదు నీ పాపానికి నిష్కృతి చరణం: 1 అబలవైన నీ కెందుకు పగా ప్రతీకారం హింసకు ప్రతిహింసకాదు పరమార్థం మహిషాసుర మర్దనలో ఆదిశక్తి ఆడది నరకాసుర వధనే నడిపిన క్రియాశక్తి ఆడది ఏ రాముడు శ్రీవాలో నిన్ను తాకడానికి శిలవై పోయిన నిన్ను స్త్రీని చెయ్యడానికి పల్లవి: మహంకాళిలా రగిలే మానవతీ! లేదు లేదు నీ పాపానికి నిష్కృతి చరణం: 1 రక్తసిక్త చరిత్రలో ఆరని రావణ కాష్టం శిథిలమైన సంసారం విధి ఆడిన చదరంగం నా జీవన కురుక్షేత్ర రణరంగంలో అవతారం మార్చుకుని మమకారం చంపుకొని సాధిస్తా పగకు నేమ ప్రతీకారం ఆత్మ సాక్షి నీవైతే అంతటితో ఊరుకో నా ఉద్యమ సాధనకే ఊపిరిగా మారిపో! పల్లవి: మగువలా ఉండలేను మమతలో పండలేను మాతనై సీతనై మహిలో జీవించలేను జ్వలిస్తోంది నా ఎదలో శిలాకృతి వద్దు వద్దు నా పాపానికి నిష్కృతి
పిల్లా పిల్లా మల్లె మొగ్గా పాట సాహిత్యం
చిత్రం: గూండా రాజ్యం (1989) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, యస్. జానకి పల్లవి: పిల్లా పిల్లా మల్లె మొగ్గా చుర్రుమందా ఎర్ర బుగ్గ! నీ నడుమాడెను కోలాటం నాలో రేగెను ఆరాటం! ఓ యబ్బో నీ వరస ఒళ్ళంతా తకథిమిత। గుమ్మెత్తిపోయే నా రూపం వెర్రెత్తిపోయె నీ కోసం! చరణం: 1 అంటుకుంటే చాలు మొగ్గల్లే ముడుచుకుపోతావు ఆగమంటే చాలు తూనీగలాగా ఎగిరేవు తాకింది చాలు ఇంక తాప మాగదు రేపింది చాలు ఇంక ఊపిరాడదు | పక్కన చేరితే చిక్కులు తప్పవు పడుచు కునా చిక్కులు విప్పే చిట్కా వుంటే చెప్పిపోవా? పెదవీ పెదవీ హత్తుకుపోతే ఒళ్ళు ఒళ్ళు అల్లుకుపోతే చిక్కులు చప్పున విడిపోతాయి చక్కెర గుమ్మా చరణం: 2 మొన్న కల్లో కొచ్చీ ఓ చిన్న ముద్దిమ్మన్నావు నేడు ఒళ్ళో చొచ్చీ నీ వాడి చూపుతున్నావు! ఆ పూట నాటుకున్న ముద్దు కాటు ఈ పూట చూసుకున్నా ఎంత ఘాటు చిక్కవి కౌగిట ఉక్కిరి బిక్కిరి చెయ్యబోకు అందని రుచులు అందేవరకు అపబోకు కెరటం ఎగిరీ ఒడ్డును ముంచితే! సరసం ముదిరి హద్దులు దాటితె అమ్మో యమ్మో దిమ్మ అదిరిపోతుందిలే
No comments
Post a Comment