చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి నటీనటులు: వెంకటేష్ , సౌందర్య , వినీత కథ: భాగ్యరాజ మాటలు: ఇసుకపల్లి మోహనరావు దర్శకత్వం: ఇ. వి. వి.సత్యనారాయణ నిర్మాత: కె.ఎల్. నారాయణ సినిమాటోగ్రఫీ: యస్.గోపాల్ రెడ్డి ఎడిటర్: కె.రవీంద్ర బాబు విడుదల తేది: 22.05.1996
Songs List:
పాపరో పాప్ పాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: మనో, సంగీత, సజిత్ పాపరో పాప్
బోల్ బోల్ బోల్ రాజా పాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: ఎస్.పి.బాలు, సుజాత బోల్ బోల్ బోల్ రాజా
ప్రియురాలే ప్రేమగాపాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: ఎస్.పి. బాలు, చిత్ర ఆ.....ఆఆ ఆఆ ఆ......ఆఆ ఆఆ ఆ.. లల లల...లలా..ల,ల,ల,ల ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని కల కాలం కమ్మని జత నీవే కమ్మని నీ వలపే రాగమని నీ చలిమే నాదమని... శృతి చేయని.... సుఖ వీణని.... ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని కల కాలం కమ్మని జత నీవే కమ్మని ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం మనసైన అందమా మనువైన బంధమా బ్రతుకంతా నిండుమా బ్రతికించే పాశమా దూరము కాలము చెరపలేని స్నేహమా తోడువై నీడవై ప్రణయమే ప్రాణమై తలపు మలుపులలో కొలువుండిపో... ఎదనిండిపో... ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని కల కాలం కమ్మని జత నీవే కమ్మని ఓ.. ఓ... ఓ... ఓ ఓ హూం హూం హూం కడదాకా ప్రేమవై మనసిచ్చే ప్రేమికా కలిసొచ్చే కాలమే మనకిచ్చే కానుక కంటిలో గుండెలో ప్రియుని రూపే చూడగా కౌగిల్లల్లో వెచ్చగా వొదిగిపో హాయిగా విడని ముడిపడని మనసైనవి...మనవైనవి... ప్రియురాలే ప్రేమగా ప్రియ గీతం పాడని కల కాలం కమ్మని జత నీవే కమ్మని నీ వలపే రాగమని... నీ చలిమే నాదమని.... శృతి చేయని.... సుఖ వీణని....
ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో పాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: మనో ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హొ హో హో హో హో హో... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హొ హో హా హా హా హా అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా హోయ్ హా హా హా హా... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హొ హొ హొ హా హా హా పండు వలిపించి తినిపించేస్తానే నా మగతనమంతా పొగరెక్కి సెగ రేపేస్తానే దిండు దులిపించి ఆడించేస్తానే నా పనితనమంత చూపించి మురిపించేస్తానే అరె ఠారెత్తి హోరెత్తి టాపే లేపేస్తా హొయ్ జోరెక్కి జోగేలా జోడీ కట్టేస్తా హొయ్ తిమ్మిరి తిక్క తీరేదాక ఉక్కిరిబిక్కిరి అయ్యేదాక చిక్కేవన్ని దక్కేవన్నీ చిత్తు చిత్తు చేస్తా ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా అబ్బా అరె అయ్యయ్యయ్యయ్యయ్యో నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హ హా హా హా హా హా బుల్లి బులపాటం తీరించెయ్యాలే నా బులిబులి పిట్టా ఉబలాటం ఊరించెయ్యాలే ఇంక మొహమాటం మనేసెయ్యాలే ఓ గిలిగిలి గింజ రోజంత మెలికెలు వెయ్యాలే అరె అప్పట్లో చూదందే ఇప్పుడు చూపిస్తా హేయ్ మనవడినే ఇప్పిస్తే ఆనందిచేస్తా హే ఇచ్చేకొద్ది కావాలమ్మో రెచ్చేకొద్ది ఇంకా ఇంకా ఏదో ఏదో ఇవ్వాలంటానమ్మో ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా హేయ్ హా హా హా హా నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హే ఎ ఏ హహా ఎ ఏ ఏ అబ్బాడి బాడీ కబ్బాడి ఆడి వాడి వేడి రేగే దాడి అల్లల్లల్లల్లాడి ఓలమ్మి తిమ్మిరి ఎక్కిందే ఎక్కడో హా హే హో హో హోహో... నా తిక్క తీర్చవే అమ్మడో జిమ్మడో హా హే హా హా హా హా
చిలకతో మజా పాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: ఎస్.పి. బాలు, చిత్ర చిలకతో మజా చిలిపి గిజగిజ పడుచు పంకజ గడుసుకామజా చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో హో హో హో హో హో భామతో సోకు భలేనాజూకు పైటకో షేపు పెంచరో కైపు వెచ్చగా పచ్చిగా గిచ్చినా కామా వేడి పెంచెను ప్రేమా నచ్చిన గుచ్చిన రెచ్చినా భామా దగ్గరవుదామా చిలకతో మజా చిలిపి గిజగిజ పడుచు పంకజ గడుసుకో మజా చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో హో హో హో హో హో ఓ..ఓ...ఓ .. అబ్బబ్బ అన్నాదబ్బ రేగేదెబ్బా తిన్నాదబ్బ పాప సూపరు జిగి జిగి లగి జిగి జిగి జిగి జిగి జిగి లగి జిగి ఓ..ఓ...ఓ అమ్మమ్మమ్మ నెగ్గేడమ్మా అన్నిట్లోని ఉంటాడమ్మా అల్ రౌడరూ ఓయ్ చూడగానే చీరాగుట్టు చిక్కినాదే..ఏ ఏ ఆడదానీ ఆశపట్టు పట్టినాడే ఓయ్ కొత్తపిచ్చి పుట్టుకొచ్చి పక్కదాక తీసుకొచ్చి పచ్చి పచ్చి సోకులిచ్చి ఆడపిచ్చి సాగనిచ్చి అమ్మాడి గుమ్మాడి లవ్వాడి ముద్దాడరోయ్... చిలకతో మజా చిలిపి గిజగిజ పడుచు పంకజ గడుసుకో మజా చక్కని చుక్కల చెక్కిలిపై చిటిక్కెయ్యరో హో హో హో హో హో
అమ్మనే అయ్యానురా పాట సాహిత్యం
చిత్రం: ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు (1996) సంగీతం: కోటి సాహిత్యం: సామవేదం షణ్ముఖ శర్మ గానం: చిత్ర అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మనీ ఆనందమే నిండాలి నీతో ఓ జాబిలి కూనా లాలిజో ఓ నవ్వుల నానా లాలిజో మా కలలకు రూపం కంటికి దీపం ప్రేమకు ప్రతిరూపం నిన్ను కన్న తల్లికి దక్కలేని భాగ్యమే అమ్మా అనే మాటకి నేనే నోచకుంటిరా మోసే బరువు లేకుండా పురిటి బాధ రాకుండా నన్నే తల్లిని చేసావయ్యా ఇన్ని నాళ్లకి కన్నది ఎవరైనా నీకున్నది ఈ అమ్మ ఎన్నడు ఏమైనా నను వదలకురా నాన్న చిగురెరుగని తోటే చిగరించెనురా చిరు చిరు నవ్వులకీ కళ్లే మూసి వుంచినా కలలో నీవే నాయనా గుండెలలోను ఊపిరిలోనూ ఉయ్యాలూగగా కన్నె పేగు దీవెన పెంచే ప్రేమ లాలనా కాపాడాలి నిన్నే చిన్నా కంటికి రెప్పగా ఎక్కడ నీ ఉన్నా నా ఆశలు నీవమ్మా నీతో నీడల్లే నా ప్రాణం వుందమ్మా నువ్వు ఇంతకు ఇంతై అంతకు అంతై ఎదగరా ఓనాన్నా... అమ్మనే అయ్యానురా నీ రాకతో కమ్మనీ ఆనందమే నిండాలి నీతో ఓ జాబిలి కూనా లాలిజో నవ్వుల నాన్న లాలిజో మా కలలకురూపం కంటికిదీపం ప్రేమకుప్రతిరూపం
No comments
Post a Comment