చిత్రం: కలియుగ పాండవులు (1986)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, జానకి
నటీనటులు: వెంకటేష్ , కుష్బూ
కథ, మాటలు: పరుచూరి బ్రదర్స్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
నిర్మాత: డి.రామానాయుడు
విడుదల తేది: 14.08.1986
బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
అరె బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
కమ్మని చెలగాటం కౌగిలి ఇరకాటం
మూడు ముళ్ళేసి ఏడూ జన్మాలు తోడై బంధానికి
అరె బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
నీవు నేను కలిశాక నిదురే కంటికి రాదంటా
నింగి నేల కలిసేశాక ఎదురే జంటకు లేదంటా
ముందుగా తొలివిందుగా నీ అందాలివ్వు అందాక
ముద్దులే మన హద్దుగా నీ అల్లరి ఆటలు పొందాక
ఈ దాహం ముదిరే తాపం
తీరాలంటే తీరా తమరు ఇంకేమివ్వాలో
మొత్తం అన్నీ కట్నం కింద ఇస్తాలే
అరె బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
చెయ్యి చెయ్యి కలిశాక చేతలకంతే లేదంటా
కన్ను కన్ను కలిపేస్తే కౌగికి నిండా వలపంటా
ఇవ్వనా నేనడగనా నీ ఆరటాలే అందాక
కాచిన నే దోచినా ఈ మోమాటాలే పొందాక
ఈ బంధం పిలిచే అందం
రేపో మాపో తాంబూలంగా నీకే ఇస్తాలే
నేడో రేపో ఈడు జోడు పండించేస్తాలే హే హే
బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
ఓయ్ బుగ్గ బుగ్గ చెప్పాలి బుగ్గకు చుక్క ఎప్పుడని
నువ్వు నేను తేల్చాలి పువ్వుల పక్క ఎప్పుడని
No comments
Post a Comment