Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Kondapalli Raja (1993)




చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
నటీనటులు: వెంకటేష్ , సుమన్ , నగ్మా
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
విడుదల తేది: 09.07.1993



Songs List:



కొండపల్లి రాజా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: యస్.పి. బాలు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

కన్నతల్లిలా పాలనిచ్చి ప్రాణం పోసే
త్యాగం ఉన్న గొప్ప జాతి నీది
సొమ్ము చూపిస్తే గొంతు కోసి రంకెలేసే
జాలిలేని పాడు లోకం మాది తెలుసా బసవన్న
నీకైనా యెందుకు ఇంతటి భేదం
క్షణమే బతుకన్న ఓ బసవన్న
మనిషికి లేదురా పాశం
కాటికెళ్ళినా కాసు వీడడు
సాటివాడిపై జాలి చూపడు
డబ్బును మేసే మనుషులు కన్న
గడ్డిని మేసే నువ్వె మిన్న

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా

మబ్బు డొంకల్లో దూసుకెళ్ళే పక్షిని చూసి
కూర్చినాడు మనిషి విమానం
వాగు వంకల్లో ఈదుకెళ్ళే చేపని చూసి
నేర్చినాడు పడవ ప్రయాణం
దివికి భువికి ముచ్చటగా
నిచ్చెన వేసిన మనిషి
చెలిమి కలిమి నలుగురికి
ఎందుకు పంచడు తెలిసీ
తరిగి పోనిది ప్రేమ ఒక్కటే
తిరిగి రానిది ప్రాణమొక్కటే
ప్రాణం కన్నా స్నేహం మిన్న
స్నేహం లేని బతుకే సున్నా

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా
పశువంటె మనిషికి అలుసు
మనసున్న నీకది తెలుసు
అ ఆ ఇ ఈ రానె రాదు
అయినా మాయా మర్మం లేదు

కొండపల్లి రాజా గుండె చూడరా
బసవన్న ఓ బసవన్నా
గుండెలోన పొంగే ప్రేమ నీదిరా
వినరన్నా ఓ బసవన్నా 





గువ్వం గుడుగుడు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: భువనచంద్ర
గానం: మనో , యస్.పి. శైలజ

హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ
పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా
రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ
రెక్కపట్టి రెచ్చకొట్టి చుట్టుముట్టి
ఛీఛీకొట్టి దుడుకు దుడుకు
వయసు ముడుపులడిగిన
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ

చికిచికి చాo చికిచికి చాo చాo
ముద్దబంతి పువ్వు
చికిచికి చాo చికిచికి చాo చాo
ముద్దులాడనివ్వు
లకిచికి చాo లకిచికి చాo చాo
వేడి వేడి లవ్వు
లకిచికి చాo లకిచికి చాo చాo
ఆరగించనివ్వు
కసకస లాడే మిస మిస లన్నిచూసా
పరువపు సరిగమలో
పెదవుల పదనిసలా
పంచుకున్న పోక చక్క
పెంచమంది తీపి తిక్క
అసలు సిసలు మరుల మలుపు తెలియగ
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ

తకధిమితోo తకధిమితోo తోo
వగలమారి పింఛం
తకధిమితోo తకధిమితోo తోo
విప్పుకుంది కొంచెం
దిమికిటతోo దిమికిటతోo తోo
మల్లెపూల మంచo
దిమికిటతోo దిమికిటతోo తోo
అడుగుతోoది లంచం
పదపదమన్న పసి పసి పొంగు చుసేయ్
తనువుల తొణికిసలో
సొగసుల రిమరిమలే
వెచ్చబడ్డ వెన్నెలమ్మ
వెన్ను మీద వాలుతుంటే
కొసరి కొసరి చిలిపి వరములడిగిన
హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ
పెదవి పెదవి కలిసే క్షణమిది సిరిమువ్వా
రగిలే పొగిలే ఒడిలో కథ బలపడనివ్వ
రెక్కపట్టి రెచ్చకొట్టి
చుట్టుముట్టి ఛీఛీకొట్టి
దుడుకు దుడుకు వయసు ముడుపులడిగిన
హే హే హే గువ్వం గుడు గుడు గువ్వా
నీ సర్వం చెరిసగమివ్వ



దానిమ్మ తోటకు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర

దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు
అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల
కౌగిలింతలొ ఒదిగే ఉంటూ
చిరాకులే సరాగారమై పారాకు లారగించి
పైటంతా పక్కకు దీసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు, కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు

ఎడమ కుడి కన్నుల జంట అదిరింది నీకు
నాకు ఏక మంచ యోగముందని
ఆ పందిరి పట్టె మంచంలో తెలిసింది
వెన్ను వెన్ను ఆనిస్తే వెన్నలేనని
చిలిపి సొగసు చలికి రగిలే
పెదవి చివర ఎదలు పలికే
కూసినా తొలికోడి అనలేదు కోక్కొరుకోక్కో
కోరుకో ఒకసారి సరసాల చెమ్మల చెక్కు
సుఖీభవే సఖిప్రియ తపించి పోవు జంట
తపాలే దీపాలెట్టి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు

గణపవరం సిద్ధాంతి అన్నడు

వలపుల్లో వర్జలే ఉండబోవని
గన్నవరం వేదాంతి చెప్పాడు
కౌగిలింత నోముల్లో కరిగిపోమ్మని
నలక నడుము మెలిక తిరిగి
తొడిమే తగిలి తొనలు అదిరే
చచ్చినా చలిగాలి మరి రాదు వెన్నెలకొడకో
వచ్చినా వడగాలై మరిగేను మల్లెల మొలకో
కదా ఖుషి కమామిషి కామాను అన్న వేళా
కౌగిట్లో చప్పట్లేసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు నీటు
అందాల అర్ధరాత్రిలో అతికే వుంటు గంధాల
కౌగిలింతలొ ఒదిగే ఉంటూ
చిరాకులే సరాగారమై పారాకు లారగించి
పైటంతా పక్కకు దీసి
దానిమ్మ తోటలోకి చెప్పవే రూటు చాటు
మాటు ఆటు పోటు కొకమ్మా కట్టుదాటి
పెట్టవే స్వీటు హాటు ఘాటు నాటు






ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గు పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి. బాలు , చిత్ర

ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే
ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ
యమ్మహో యమ్మహో యమ్మహా
విందులే అందుకో కమ్మహా
ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తాఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా

కన్ను కొట్టుడు రోజుల్లో కాగే
కౌగిళ్ళల్లో నీ ప్రేమకె సెగనై తగిల
పైటలాగుడు పుటల్లో సాగే సంజట్టల్లో
నీ సిగులే నిరుడే అడిగా
తొణికే పాలే
తొలికొపాలై
తడిరూపాలే
అహహహ ఒడి దీపాలై
అహహహ
గిల్లి గిల్లి కజ్జా లెట్టి
బుల్లి బుల్లి బుజ్జయంటీ ఈడును
లేపి వెచ్చని తోడై దౌడే తీస్తుంటే
యమ్మహో యమ్మహో యమ్మహా
ఎక్కడో నొప్పిగ వుందాహ

ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా

ఏకపక్కల రాత్రుల్లో మల్లె మాగాణుల్లో
నీ వన్నెలో వెన్నెలే చిలికా
తెల్ల వారని పొద్దుల్లో తెరిచే
వాకిళ్ళలో నా నవ్వులే ముగ్గులోకలిపా
మనసే నీవై
తనువేనేనై
శృతిలో ఉంటే
అహహహ పతిగా ఓకే
అహహహ
చిట పట చేమంతుల్లో కట్టు బొట్టు
గల్లంతుల్లో హద్దులు దాటి

అల్లరి చేసి ముద్దే దోస్తుంటే
యమ్మహో యమ్మహో యమ్మహా
ఎప్పుడో ఎక్కడో అమ్మహా
ఏ కాశీలోనో సిగ్గు ఎగ్గూ ఒగ్గేసాకే
ఒల్లోకొచ్చా ఏమ్చేస్తావో చేసేసేయ్యి మావ
యమ్మహో యమ్మహో యమ్మహా
కమ్మహా కొట్టనా చుమ్మాహా
ఏ గంగల్లోనో గుట్టు మట్టు కలిపేసాకే
కౌగిళ్లిచ్చా ఏమిస్తా ఓ ఇచ్చేసెయ్యి భామ
యమ్మహో యమ్మహో యమ్మహా
విందులే అందుకో కమ్మహా
యమ్మహో

యమ్మహో
యమ్మహా
యమ్మహో
యమ్మహో
యమ్మహా




అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: మనో , చిత్ర

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా

కోరస్:
గొల్లవాడే గొల్లపిల్లవాడే
పాలవాడే మీకు ఈడు జోడే

పాలుగారే బుగ్గా మొగ్గా పిండేస్తా
మల్లె పూలల్లోని సోకు నీకు దండేస్తా
పాలే పంచి పక్కంగాను తోడేస్తా
నువ్వు పాలిస్తుంటే పండుచెండు విందిస్తా
రాగాల రాస లీలల్లో రగడ
నీకేర రాతిరేలల్లో మగడా
పాలరాతి మందిరం
పంచదార పంజరం
నా గోల వేసెటి ఈలలుతో  నీ వెన్న జున్ను వేడెక్కిస్తా

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్

మణిక్యాల మెడలోన మారాజ
నీకు అందిస్తున్నా స్త్రీ రోజా
వోణి కొద్ది బోణి కొట్టే పూబోణి
నీకు రాసిస్తాలే మల్లెల్లోని మాగాణి
యుద్దాలు చేసుకుందామా చలిలో
అందాలు పూసుకుంటాలే జతలో
వలపు కోట వాయణం
వయసు కోరు శోభనం
నీతోటి కొలువున్న వేళలలో
ఈ రోజా పూజా రాజా నీకే

అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మా
వచ్చాడే చీర దొంగ తీర్చాడే సిగ్గు బెంగ
సందేళ్ళ సామిరంగ చందమమల్లే హొయ్ హొయ్ హోయ్
అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఏదారి కాయాలంట గోదారి ఈ దాలంట
వయ్యారి పాలపిట్ట పాడుతుంటే హాయ్ హాయ్ హోయ్
తగులుతున్న తాకిడి
మొగళి తేనె దోపిడి
నా సోకు వేసింది మారాకు
అట్టైతె నాదే నీ నాజూకు




సింగరాయకొండకాడా.. పాట సాహిత్యం

 
చిత్రం: కొండపల్లి రాజా (1993)
సంగీతం: యమ్. యమ్. కీరవాణి
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.పి,బాలు, మాల్గాడి శుభ 

ఆ.... ఆ....హా...
ఆ.... ఆ....హా...

సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా
ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో...
దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా
తడాఖా..
సింగరాయకొండకాడా..ఆ..ఆడ దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడ సోకుమాడా

ఎగబడి దిగబడి కలబడి పొరబడి పెట్టేసుకో..ఓ
నా లేత ఈడు ఉంగరం ఇక చూసుకోరా సంభరం
గిజగిజ వయసుల గిలగిలసొగసులు వడ్జించుకో..ఓ
అల్లారుముద్దు అగడం అందాల మీది మీగడం
నెరనెర జాననోయ్ తుళి పరువపు వీణనోయ్
వీణవైతే మీటనా జానవైతే దాటనా
ఇది తాగిన జంట ససేమిరా సడేమియా సరోజా
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా

ఆ.... ఆ....హా...

కుతుకుడు ఉతుకుడు వెతుకుడు చెడుగుడు
ఆడేసుకో..చెడుగుడు చెడుగుడు చెడుగుడు
నీ రేవు కోరి వేగిరం నా నావకున్న లంగరం
పిడికెడు నడుముల చిటికెడు తలుకులు
తోడేసుకో..
చెయ్యి జారుతుంది పావురం
పట్టుకో..
బేజారుచేస్తే నిబ్బరం
చిమ చిమ చీకటోయ్ ఇవి చిటపట చిందులోయ్
పెగ్గులాగా జారనా.. అగ్గిలాగే మారనా..
ఇవి కౌగిలి దాడి ఖజూరహో మజాలహో ఖలేజా
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా
ఊబరాల గిత్తరో... ఒంగవోలు గింజరో...
దీన్ని కొమ్ముల దాడి హడాహుడి తడేమియా
తడాఖా..
సింగరాయకొండకాడా..ఆ..ఆడా దిబ్బకాడా
రంకెలేసే అబ్బదూడా..ఆ..ఆడా సోకుమాడా..

No comments

Most Recent

Default