Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Mana Voori Pandavulu (1978)



చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కృష్ణంరాజు, చిరంజీవి ,  మురళీమోహన్ , గీత
మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
దర్శకత్వం: బాపు
నిర్మాత: జయకృష్ణ
సినిమాటోగ్రఫీ: బాలుమహేంద్ర
విడుదల తేది: 09.11.1978

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా
త ది న ది న కు ది న
త ది న ది న కు ది న
త ది న ది న కు ది న త క త క త క త క

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా

అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే
అండ పిండ బ్రహ్మాండమంత ఆ శివుడే శివుడే
అనులోన లైగేది అయ్యో నరుడే నరుడే

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా

వేపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
వేపకాయకన్న విషం వెర్రి పుచ్చ కాయరా
పాడు బుద్ది దొరగోరూ పాముకన్న విషమురా
నమ్మించె ధగకోరు నాభికన్న విషమురా
నమ్మించె ధగకోరు నాభికన్న విషమురా
ఇన్ని ఇషాల్ దిగమింగే ఎర్రోడే గొప్పరా

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
కాస్త మందేసి ఆడరో నరుడో నరుడా

కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
కానిపనులు చేసి నోడూ భూమి ఏలుతున్నాడూ
మంచిబుద్దులున్నోల్లు మట్టికరుస్తున్నారూ
నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
శివుడు నిన్నే...నిన్నే బుకాఇంచినోడ్ని చీమైనా కుట్టదే
మతి పోయిన పిచ్చి తల్లి మాటెవరికి పట్టదే
అదే చిత్రం

సిత్రాలు చేయరో శివుడో శివుడా
శివమెత్తి పాడరో నరుడో నరుడా
నువ్ సిందేసి ఆడరో నరుడో నరుడా


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

పిరికి మందు తాగి ఊరు నిదర పోయిందీ
గురక పెడుతూ వాడ నిదరోయిందీ
పిచ్చి గాలి నువ్వు అరవకే
వెర్రి నేల గూడు పెట్టకే
పిచ్చి గాలి నువ్వు అరవకే
వెర్రి నేల గూడు పెట్టకే
ఊరుకో ఊరుకో ఊరుకో ఊరుకో

కండగల మొంచోల్లు కాలిపోతే పోనీ
గాలిలో తమ్ముల్లు కలిసిపోతే పోనీ
కండగల మొంచోల్లు కాలిపోతే పోనీ
గాలిలో తమ్ముల్లు కలిసిపోతే పోనీ
కన్నీరుగా ఏరు పారకే
కన్నీరుగా ఏరు పారకే
నీ హోరుతో మమ్మల్ని లేపకే

పిచ్చి గాలి నువ్వు అరవకే
వెర్రి నేల గూడు పెట్టకే
ఊరుకో ఊరుకో ఊరుకో ఊరుకో

నింగి విరిగి కింద పడనీ మాకేం
మన్ను కుతకుతలాడిపోనీ మాకేం
నింగి విరిగి కింద పడనీ మాకేం
మన్ను కుతకుతలాడిపోనీ మాకేం
సూరీడా ఇక నువ్వు పొడవకూ
సూరించి మా గుండె కడవకూ కడవకూ కడవకూ


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

పాండవులు పాండవులు తుమ్మెదా
హచ్ తుమ్మెదా హచ్ తుమ్మెదా
మన ఊరి పాండవులు తుమ్మెదా
పాండవులు పాండవులు తుమ్మెదా
మన ఊరి పాండవులు తుమ్మెదా

బలమున్న ఓడ్నని మదమెక్కి నోడికి
పాటాలు చెప్తారె తుమ్మెదా
ఆడ్ని పాతి పెట్టేస్తారే తుమ్మెదా
మ ప లా ప మా రి స తుమ్మెదా

చచ్చు పీనుగ వీడు
బతికున్న ఓల్లని చంపుతున్నాడే తుమ్మెదా
చావ చంపుతున్నడే తుమ్మెదా
చచ్చు పీనుగ వీడు
బతికున్న ఓల్లని చంపుతున్నాడే తుమ్మెదా
చావ చంపుతున్నడే తుమ్మెదా
శకున మామే వీడు శకున పక్షి గాడు
శకున మామే వీడు శకున పక్షి గాడు
మోసెయ్ మోసెయ్ తుమ్మెద కనెక్షీన్ తీసెయ్ తీసెయ్ తుమ్మెదా
మ ప ద స మ రి స తుమ్మెదా

పానదవులు పాండవులు తుమ్మెదా
మన ఊరి పండవులు తుమ్మెదా

బక్క చిక్కినవాడు ఒక్కడు అయితే పగతీర్చుకోలేడు తుమ్మెదా
అయ్యో...కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా
అయ్యో...
బక్క చిక్కినవాడు ఒక్కడు అయితే పగతీర్చుకోలేడు తుమ్మెదా
అయ్యో...కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెదా
అన్నదమ్ముల్లాగ అయిదుగురొకటతే
అన్నదమ్ముల్లాగ అయిదుగురొకటతే
టాపు లేపేస్తారె తుమ్మెదా
వీపు సాపు చేసేస్తారే తుమ్మెదా
స రి గా మ ప ద ని స తుమ్మెదా
మ ప ద స మ రి స తుమ్మెదా

దమ్మి చెట్టు మీద దాచిన బానాలు
నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా
అతి నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా
దమ్మి చెట్టు మీద దాచిన బానాలు
నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా
అతి నెమ్మదిగ తెచ్చారె తుమ్మెదా
రిమ్మ రేగిన దొరను గుమ్మన నిలబెట్టి
రిమ్మ రేగిన దొరను గుమ్మన నిలబెట్టి
కుమ్మి పారేస్తారే తుమ్మెదా
వాడ్ని దుమ్మి పాడేస్తారె తుమ్మెదా

పానదవులు పాండవులు తుమ్మెదా
మన ఊరి పండవులు తుమ్మెదా


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

ఒరేయ్ ఒరేయ్ పిచ్చి సన్నాసీ
ఒరేయ్ పిరికి సన్నాసీ
ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి
ఇలా చూడు ఇలా చూడు ఇటు కేసి
ఉన్న ఊరు కన్న తల్లి ఒరేయ్ ఒరేయ్ మరవకురా
నమ్ముకున్న సొంత ఊరు వెన్నులోన పొడవకురా

ఒరేయ్ పిచ్చి సన్నాసీ

మొకం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా
ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా
మొకం మీద కోపంతో ముక్కు కోసుకుంటారా
ఏలు మీద కురుపుందని కాలు కోసుకుంటారా
ఆ వేషం నీ తెలివిని చంపుతుందిరా
ఆ వేషం నీ తెలివిని చంపుతుందిరా
ఆలోచన నీ బలాన్ని పెంచుతుందిరా

ఒరేయ్ కుర్ర సన్నాసీ
చూసుకో ఒక్క సారి నీకేసీ

ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా
ఊరిలోన ప్రతి ఒకరూ నీ సుట్టం నేస్తం రా
ఈ నీరు ఈ గాలి ఈ నేల నీదిరా
ఊరిలోన ప్రతి ఒకరూ నీ సుట్టం నేస్తం రా
ఆసపెట్టుకున్నోల్లను అన్యాయం చేయకురా
ఆసపెట్టుకున్నోల్లను అన్యాయం చేయకురా
అన్యాయం చేసినోల్ల ఆటలు కట్టించరా

మమత తెంచుకున్న ఓడు మనిషి కాడురా
మడిషైతే దేనికైనా దడిచి పోడురా
మమత తెంచుకున్న ఓడు మనిషి కాడురా
మడిషైతే దేనికైనా దడిచి పోడురా
అయిదు వేల్లు కలిసుంటే చేతి దెబ్బ గట్టిదిరా
పిడికిలి బిగి ఇంచరా పిడుగులు కురిపించరా
రా రా రా రా రా రా

ఒరేయ్ పిచ్చి సన్నాసీ


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: కొసరాజు
గానం: జి.ఆనంద్ , యస్.పి.శైలజ

నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా
తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా
నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా
తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా
కొప్పులోని మల్లె పూలు గుమ గుమలాడుతుంటే
చేతినున్న చిట్టి గాజులు ఘల్లు ఘల్లు అంటుంటే
అబ్బబ్బ...హా అబ్బబ్బ నా ఒల్లు జల్లు జల్లు మన్నాదే

నల్ల నల్లని మబ్బుల్లోన లగ్గో పిల్లా
తెల్ల తెల్లని చందా మామ లగ్గో పిల్లా

మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా
మాట మాట కలిసింది లగ్గో మావా
మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా
మాట మాట కలిసింది లగ్గో మావా
సింగపూరు రంగు చిర మెహమాను ఇస్తావా
లక్కవరం తిరనాల్లో ముక్కెర కొని ఇస్తావా
కాపవరం సంత నుండి కడియాలు తెస్తావా

మంచి నీల్ల బావి కాడ లగ్గో మావా
మాట మాట కలిసింది లగ్గో మావా

మోవాకు చీర పెడతా ముక్కు మీదా...ముక్కు మీదా ముద్దెడతా
కాపవరం హోటలు కాడా కాపీ నీల్లు తాగిస్తా
మోవాకు చీర పెడతా ముక్కు మీదా...ముక్కు మీదా ముద్దెడతా
కాపవరం హోటలు కాడా కాపీ నీల్లు తాగిస్తా
దొరగారు మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా
మా దొరగారు సై అంటే సరదాలు తీరుస్తా...చీ పో
నీ దొర పేరు వింటూ ఉంటె ఒల్లు మంటా
సదాలు సరసాలు ఒద్దు పొమ్మంటా...చీ చీ పో
నీ దొర పేరు వింటూ ఉంటె ఒల్లు మంటా
సదాలు సరసాలు ఒద్దు పొమ్మంటా
నువ్వే నా దొరవంటా
నిన్నే నా కల్ల కద్దుకుంటా

అల్ల అల్ల నువ్వంటే సిగ్గో పిల్లా
ఇల్ల ఇల్ల ఎత్తుకుంటా లగ్గో పిల్లా
అల్ల అల్ల నువ్వంటే సిగ్గో పిల్లా
ఇల్ల ఇల్ల ఎత్తుకుంటా లగ్గో పిల్లా
ఓసి లగ్గో పిల్లా లగ్గో పిల్లా


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు

మంచికి చెడ్డకి
మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం
ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం
చీల్చి చెండాడునురా నరసింగం

మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం
ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం
చీల్చి చెండాడునురా నరసింగం

అరన్య వాసం చేసేవాల్లు తిరిగి ఇంటికి వస్తారు
అప్పుడు రాజు శకుని గికుని తుడిచిపెట్టుకొని పోతారు
గడ్డి పరకలి అయిదే అయినా
గట్టిగ పేనితె మోపురా
మోపుతాడుతో కట్టిపడెస్తే మొనగాడైనా బందీరా
మోపుతాడుతో కట్టిపడెస్తే మొనగాడైనా బందీరా

గుప్పిటలోనా ఎన్నాల్లు నిప్పులు నువ్వు మోస్తావు
బోనులోనికి ఎన్నాల్లు పులులను నువ్వు తోస్తావు
కింకరించరా గున్న ఏనుగు
జూలు జులిపెరా పోతు సింగమూ
పంజా విప్పి పైన పడిందో పటా పంచలై పోతారు
కారు మబ్బులే పూయవా
కుండ పోతగా కురవవా
కూకటి వేల్లు కదలవా
కుచ్చిటమంతా వదలదా
నరుడే కదిలి నడటరాజయ్యి నాటయం చేసే ఆ రోజూ
మూడో కన్ను తెరిచాడంటే బూడిద పాలై పోతారు
బూడిద పాలై పోతారు

మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం
ఉండగీడు ఆ హిరన్య కసికుని చెండాడునురా నరసింగం
చీల్చి చెండాడునురా నరసింగం


******  ******  ******


చిత్రం: మనవూరి పాండవులు (1978)
సంగీతం: కె.వి.మహదేవన్
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలు, జి. ఆనంద్ , యమ్.యస్. రామారావు

జండపై కపిరాజూ......
జండపై కపిరాజురా
గండర గండ లేవరా
చేతిలొ ఉన్నది గదరా...
చక చక చక పదరా

జండపై కపిరాజురా
గండర గండ లేవరా
చేతిలొ ఉన్నది గదరా...
చక చక చక పదరా

ధర్మన్న శాంతం అంటాడూ...శాంతం శాంతం శాంతం
భీమన్న తంతాం అంటాడూ...తంతాం తంతాం తంతాం
గాంఢీవి పంతం అంటాడు...పంతం పంతం పంతం
కవలలు రగతం చూస్తారు...రగతం రగతం రగతం
బలానోయిరా బాయీ తమ్ముడా లడాయి మొదలాయె తమ్ముడా
చెంప చెడేల్ అంపించు తమ్ముడా
బలానోయిరా బాయీ తమ్ముడా లడాయి మొదలాయె తమ్ముడా
చెంప చెడేల్ అంపించు తమ్ముడా

జండపై కపిరాజురా
గండర గండ లేవరా
చేతిలొ ఉన్నది గదరా...
చక చక చక పదరా

అయిదుగురికి అయిదు ఊర్లక్కర్లేదూ
ఉన్న ఊరు చల్లగుంటె చాలూ
తొడగొట్టినాను ఆ నాడూ ఆడ్ని
పడగొట్టుతాను ఈ నాడూ
పాసుపతమున్నాది చూడూ ఆడ్ని
పీసు పీసు చేస్తాను నేడూ
అన్నమాటకు సై అంటాం...సై
జాం అంటు చెయ్ యెత్తి జై అంటాం...జై
అన్నమాటకు సై అంటాం
జాం అంటు చెయ్ యెత్తి జై అంటాం
జై కృష్ణ జై జై కృష్ణ
జై కృష్ణ జై జై కృష్ణ
జై కృష్ణ జై జై కృష్ణ
జై కృష్ణ జై జై కృష్ణ
జై కృష్ణ జై జై కృష్ణ
జై కృష్ణ జై జై కృష్ణ




No comments

Most Recent

Default