Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Pataas (2015)




చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
నటీనటులు: కళ్యాణ్ రామ్ , శృతి సోది, సాయికుమార్
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాత: కళ్యాణ్ రామ్
విడుదల తేది: 23.01.2015



Songs List:



అరె ఓ సాంబ (Remix) పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: భువనచంద్ర
గానం: జాస్ప్రీత్ జస్జ్ , దివ్య కార్తీక్

(ఈ పాట బాలకృష్ణ  నటించిన రౌడి ఇన్స్పెక్టర్ (1992)  సినిమా నుండి  రీమిక్స్ చేశారు. పాడినవారు: యస్.పి.బాలు, చిత్ర, సంగీతం: బప్పీ లహరీ )

బందరు లడ్డు తినిపిస్తాను బిస్తరు వేస్తావా
చీరె సారె కొనిపెడతాను చేలో కొస్తావా
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
లవ్వాడదాం చలో రె రాణీ...

అరె ఓ రంబా ఆయారే రేంబో 

అందరిలాగా ఐసై పోయే దానిని కాదయ్యో
మస్కా కొడితే కిస్కా ఇస్తా రౌడీ యస్సయ్యో
వయసు ఉంది వాడి ఉంది తాజా తాజా మోజు ఉంది 
అయినా సరే లొంగను ఛా ఛా

అరె ఓ సాంబ ఆయిరే రంబా

చరణం: 1
ఓ కేడి.. కనకమ్మో
ఓ కేడి కనకమ్మో కవ్వించకే ముద్దు గుమ్మో
షేకించి బ్రేకించి పగ్గాలు వేస్తానే బొమ్మో
ఏదన్నా ఎంతున్నా నేరాలు  రాసుంది కాడా
ఊరంతా చూస్తారు వలవెయ్ కు నీ సోకుమాడ
కమ్మలు పెడతా గాజులు పెడతా ఒల్లోకొస్తే గుడులే కడతా 
నా మాట విని చల్ రె రాణీ...

This is the tribute to Balayya 

చరణం: 2
ఆ లాటిలు.. చూపించి
లాటిలు చూపించి బెదిరించకోయ్ టింగు రంగా
ప్రేమంటూ నీకుంటే దరి చేరనా సుబ్బరంగా
హేయ్ రంగేళి రంగమ్మో ఓ చోటు చూసేసుకుందాం
నీ ప్రేమా నా ప్రేమా వెచ్చంగ కలబోసుకుందాం
చోటు ఉంది స్వీటు ఉంది ఘాటు ఘాటు ప్రేమా ఉంది 
లేటెెందుకిక చల్ రె రాజా




పవరు న్నోడు - పటాసే పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: బి. సుబ్బరాయ శర్మ 
గానం: రంజిత్ & కోరస్ 

పవరు న్నోడు - పటాసే
పొగరున్నోడు - పటాసే
పదునైనోడు - పటాసే
వీడి ఫైరే - పటాసే
డేర్ ఉన్నోడు - పటాసే
డాష్ ఉన్నోడు - పటాసే
డిఫరెంటోడు - పటాసే
వీడి పంచే - పటాసే
వీడు కాస్కో అంటే రిస్కే రో
వీడు లుక్కే ఇస్తే - దౌడే రో
వీడు ఉడికే ఉరికే లావా రో పటాసే 

మాస్  మసాలా వీడే
క్లాస్  ఖులాస వీడే
బాస్ భరోసా వీడే వీడే పటాసే 
దేఖో ఈ పోలీస్ వాలా
పేలే టెన్ తోజండ్ వాలా
క్రైమే ది ఎండ్ అయ్యేలా చేసే పటాసే

లెక్కకు అందని ఒక్కడురో
వీడెంతకి అంతే చిక్కడురో
హే తోపుగాడు వీడురో టాప్ లేపుతాడురో
రఫ్ టఫ్ వీడి టైపు రో
ఎప్పుడు వీడొక ట్విస్టే రో
వీడి ట్విస్ట్ కు మైండే బ్లాస్టే రో
హే వేటగాడు వీడు రో
వీడి సాటి లేడు రో
వాటమైన పోటుగాడు రో
న్యూ ట్రెండ్ కి బ్రాండే వీడే రో
వీడి దెబ్బకు సౌండే గ్రాండే రో
శివకాశి ఆటమ్ బాంబే రో పటాసే

మాస్ ఉమసాలా వీడే
క్లాస్  ఖులాస వీడే
బాస్ భరోసా వీడే వీడే పటాసే



హే ధమ్కీ మారో యారో పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీమణి 
గానం: టిప్పు 

ఆగయా హైదరాబాద్ క నయా నవాబ్
ట్వంటీ ఫోర్ కారట్ ల ఫోర్ ట్వంటీ బాబు
స్టేషన్ ని బ్యాంకులా మార్చేశాడు.
అండర్ కవర్ కాసుల వాడు

క్యా బాత్ హైం మియా

హే ధమ్కీ మారో యారో యారో
దుమ్మే లేపి దున్నేసేయఁరో
కుంభస్థలమే కొట్టావంటే నువ్వే లేరో హీరో

హే మనిషికి ఉందొ డేట్ అఫ్ బర్త్ 
ఉంటుందంట డేట్ అఫ్ డెత్ 
నోట్ కి మాత్రం ఉండదులేరా అల్ టైం ఎక్స్పైరి డేట్  
మీకెంత పవర్ ఉన్న
చస్తే అడిగే దిక్కెవడన్న
నువ్వు కాళీ అయ్యేలోగా
ఖాళి జేబులు నింపేయమన్న

మా దేవుడు నువ్వేనయ్యా 
మాకోసం పుట్టావయ్యా
దండేసి దండం పెట్టి 
హారతులే పట్టేమయ్య

పేరున్నోల్లని ఫేమ్ ఉన్నోల్లని లిస్ట్ వేసేయరా
ఆళ్ళ పేరున ఉన్నవి పోలీసోళ్ళకి ఫిక్స్డ్ ఏసేయరా
కరెన్సీ నోట్ లే కాజేసిస్తే కేసు లు మాఫీ రా
నీ నల్ల సొమ్మే నాకే ఇస్తే
ఫుల్ ఉ గ వైట్ ఐ పోతావురా
డే అండ్ నైట్ డ్యూటీ లు చేస్తే శాలరీ సరిపోదు
ఓ గంట నువ్వే లూటీలు చేస్తే సెటిల్ అయిపోతావులే

మా దేవుడు మా దేవుడు స్వామి
మా దేవుడు నువ్వేనయ్యా మాకోసం పుట్టావయ్యా
నీ పేరున మాలె వేసి తల నీలాలిస్తామయ్యా

హే ఆజా ఆజా ఆజా 
ఇదర్ ఆవో బులెట్ రాజా
హే ఆజా ఆజా దేఖో 
ముజికో కాకినాడ ఖాజా

హే భక్తులం మేమె కానీ మాకిచ్చేది బెత్తెడు భూమి
మేమేలే నీ బినామీ పొంగించే సొమ్ము సునామి

రౌడీ షీటర్ గుండా గళ్ళ షట్టర్ ఉ షట్ డౌన్ ఏ
నేను సెంటర్ వోచి కౌంటర్ పెడితే డబ్బులు డంప్ అవునే
నా లా అండ్ ఆర్డర్ ఉండే ల్యాండ్ నాదై పోవాలి
న సైరెన్ సౌండ్ కి సైడ్ ఏ ఇచ్చి సైట్ ను ఖాళీ
చెయ్యాలి
CM కైనా PM కైనా పదవులు ఐదేళ్లే
హే ప్యాచెస్ ఉంచి పచ్చస్ దాకా పటాస్
మనమెలా

మా వొంట్లో బీపీ నువ్వే 
మా హెడ్ కి జండుబాం వె
మా గ్రౌండ్ కి టెండూల్కర్ 
మా పాలిట పోలీస్ లారీ




ఓసి చిన్నదాన మూతి తిప్పకే పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: శ్రీమణి 
గానం: రాహుల్ నంబియర్

ఓ మై ఓ మై బేబీ నన్నొదిలేసి వెళ్లిపోమాకే
ఓ మై ఓ మై బేబీ జర నవ్వేసి ఓ లూక్కివ్వే

ఓసి చిన్నదాన మూతి తిప్పకే
ప్రేమ వాత పెట్టకే గుండె కోత పెట్టకే
ఓసి కుర్రదాన తుర్రు మనకే
చిర్రు బుర్రు లాడకే కళ్ళు ఎర్ర జెయ్యకే
ఓ చంచాడు జాలి చూపవే
ఓ గుప్పెడు ప్యార్ పంచవే
ఓ గంపెడు ముద్దులు నా ఖాతాలో వెయ్యవే
మిల్లీ మీటరంత చూపు చాలే
సెంటీమీటరంత స్మైల్ చాలే
నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ని కనులకు కాజల్ లా నీ కలలన్నీ చదివేస్తానే
నీ చేతుల గాజుల్లో సవ్వడల్లే ఉంటా
నీ చెవులకి లోలాకై ప్రేమల ఊసులే వినిపిస్తానే
నీ పెదవికి తమలాకై తీపి పంచుతుంటా
కుంచె లాగ నిన్ను బొమ్మ గీస్తా
కంచె లాగ నిన్ను కాపు కాస్తా
ఏ కంచికి చేరని కథనే మనదే చేస్తా
పచ్చబొట్టు లాగ అంటి ఉంటా
గట్టులేని ఒట్టు నేనౌతా
నీ కాలికి మెట్టెను నేనై నడిపించేస్తా

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే

ఓ బేబీ లవ్ మీ అంటూ 
వెంట వెంట నీకై తిరిగాడమ్మ
రఫ్ అండ్ టఫ్ పోలీసోడే 
రోమియోలా మారిపోయెనే
నీకై పడిచస్తున్నాడే 
కేసులన్ని పక్కనెట్టి వస్తున్నాడే
వీడి ఫ్యూచర్ నువ్వేనమ్మా 
బుజ్జగించి ప్రేమ పంచవే

వేసవిలో నీకోసం ప్రేమల వానల మేఘాన్నవుతా
ఈ చలిలో నులి వెచ్చని కౌగిలింత నౌతా
వేకువలో నిను తాకే తొలి కిరాణాన్నై తలుపే తడతా
చీకటిలో నీకోసం జాబిలల్లే వస్తా

పిలుపు కంటే ముందే పలికేస్తా
తలుచుకోక ముందే కనిపిస్తా
కనిపించని నీ ప్రాణానికి ప్రాణాన్నవుతా
ఆగిపోని గుండె చప్పుడంటే  
అలిసిపోని ఊపిరంటు ఉంటే
నీ అశలే శ్వాసగా మారిన నేనేనంటా

పూవులే ఇస్తా పూజలే చేస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే
రాసులే ఇస్తా రాణిలా చూస్తా
నీ బాంఛన్ నన్ను లవ్ చెయ్యవే



టప్ప టపం పాట సాహిత్యం

 
చిత్రం: పటాస్ (2015)
సంగీతం: సాయి కార్తీక్
సాహిత్యం: తైదల బాపు 
గానం: M.L.R. కార్తికేయన్, సుచిత్ర 

టప్ప టపం టప్ప టపం టప్ప టపం
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

పోరి చూస్తే సూపర్ రో
జోరుదారు గున్నదిరో
చాకోబార్ సోకులతోనే సంపెత్తాందిరో
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
ధూమ్  ధామ్  పిల్లోడే
దుమ్ము రేపుతున్నాడే
గన్ ఉ లాంటి చూపులతోనే గుండెను పేల్చడే

మేరె దిల్ దిల్ దిల్ దిల్ లూటీ ఉ గయారే
అరేయ్ చల్ చల్ చల్ ఫుల్ ఐష్ కరోరే
అమ్మడు అందాలే ఫ్రూట్ సలాడే వహ్
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

దిల్ పసందైన పోరి ఫుల్ పటాయించుతాంది
లోటస్ మీది వాటర్ లాగ జారుతున్నదే
దిల్దారు పోరగాడే ఫెవికాల్ లాగ నన్నే
ఫిక్స్ అయి పోయి హగ్స్ ఇచ్చి మిక్స్ ఐపోయాడే
అరేయ్ ఆవకాయ లాగ నన్ను ఊరిస్తున్నవే
అరేయ్ ఆవురావురు అంటూ ఇక ఆగనంటావే
ఎహ్  రా రా రా రావే రాతిరి జాతరకే
ఓకే కే కే ఆడెయ్ కిస్ కబ్బాడే
అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే 
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
హే కమ్మని విందిస్తా ఆజా ఆజా రే

సిండ్రెల్లా సెంటు కొట్టి జాస్మిన్ పూలు పెట్టి
గౌలిగూడ టూరింగ్ టాకీస్ పిక్చర్ వస్తావా
పిక్చర్ కు నీతో వస్తే అల్ లైట్స్ ఆపివేస్తే
టైటిల్స్ ఇంకా పడక ముందే టెంప్ట్ అయిపోతావే
అరేయ్ ఇంటర్వెల్ బాంగ్ నన్ను టెన్షన్ పెట్టొడ్డే
క్లైమాక్స్ లోని సీన్ నువ్వే ముందే చూపొద్దే
3డి డీ డీ డీ ఫిగర్ నువ్వేలే
బాడీ డీ డీ డీ వేడెక్కేస్తున్నాదే 

అమ్మడు వండాలే ఫ్రూట్ సలాడే 
టప్ప టపం టప్ప టపం టప్ప టపం
కమ్మని విందిస్తా ఆజా ఆజా రే
టప్ప టపం టప్ప టపం టప్ప టపం

No comments

Most Recent

Default