చిత్రం: పెళ్లి సంబంధం (2000)
సంగీతం: ఎస్. ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: హరిహరన్, స్వర్ణలత
నటీనటులు: సుమంత్, సాక్షిశివానంద్, సంఘవి
దర్శకత్వం & నిర్మాత: కె.రాఘవేంద్రరావు
విడుదల తేది: 28.07.2000
అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే
అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
ఎల్లుండిచ్చే కౌగిల్లో మెల్లంగా రేపే ఇచ్చే
రేపే ఇచ్చే వత్తిల్లో మొత్తంగా ఈరోజిచ్చే
ఈ రోజిచ్చే అందాలు ఈ పూటే అందించాల
ఈ పోటెత్తేవిరహాలు ఈ నిమిషం ఆపేయాల
ఆలస్యం అయ్యిందంటే ఆగలేనమ్మా
అవకాశం పోయిందంటే మళ్ళీ రాదమ్మ
నీ మోహం పెరిగిపోతే చూడలేనయ్య
వ్యామోహం తీరేకొద్ది తోడుకోవయ్య
నిప్పులాంటి వంపులాడి వప్పుకుంది నేడే
నీళ్లు నువ్వు చల్లిపోతే తగ్గుతుంది వేడే
అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
నీకే గాని కొట్టందే నాకన్ను ఎందుకంట
నిన్నే గాని చుట్టంది నా చీర ఎందుకంట
నువ్వే గాని లాగందే ఈ కొంగు ఎందుకంట
నీతోగానీ జారంది నా కాలు ఎందుకంట
ఏనాడో వచ్చెనమ్మా గోకులాష్టమి
ఈ నాడే వచ్చిందమ్మ సోకులాష్టమి
ఏడాదికొక్కసారి నాగ పంచమి
నా ఈడు కెన్నిసార్లు భోగ పంచమి
పోకిరోడు దుకినాడే పిల్ల పిట్ట గోడే
చిన్నవాడు చేరినాడు చీర చెట్టు నీడే
అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
హ ఉరుమై అది నిన్నే మరల ఆడిగాడే
వేళగాని వేళల్లోన వీలుచుసి నాడే
చోటుగాని చోటులోన ఆటలాడినాడే
అమ్మమ్మ మాయగాడే నా కొంప ముంచినాడే
సందుల్లో తుంచినాడే రంగంలో దించినాడే
No comments
Post a Comment