చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి నటీనటులు: బాలక్రిష్ణ, యన్.టి.రామారావు, శ్రీదేవి దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: యన్.టి.రామారావు విడుదల తేది: 15.08.1980
Songs List:
ఓ మై డార్లింగ్ పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఓ... ఓ... ఓ... మై డార్లింగ్ అందాలనే అప్పిచ్చుకో కౌగిళ్ళలో కప్పేసుకో ముద్దిచ్చిపో ... మురిపించిపో రెప రెప లాడే వయసే చూస్తున్నా రెప్పలు వేసే తాళం వింటున్నా అవి కలిసి మెలిసి కవ్విస్తుంటే కదం తొక్కనా పదం పాడనా సుమలతా నా ప్రియంతా... కాశ్మీరంలో మందారాలు... తెనుగు తోటతో శృంగారాలు నీలో నాలో విరబూసే నువ్వే నువ్వే నువ్వే నా హీరో గజల గురం నడకే చూస్తున్నా గజ గజ లాడే నడుమే చూస్తున్నా వేలికి వేస్తే కాలికి వేస్తుంటే వయసు పొంగు వరస చూడనా జయసుధ నా ప్రియ సుధా నిమ్మకూరులో నిన్ను చూసినా నిమ్మ తోటలో కన్ను వేసినా రేపూ మాపూ గిలి రేడే నువ్వే నువ్వే నా హీరో
కొంటె కోరికుంది పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఓ లచ్చమ్మో.... కొంటె కోరికుంది చెప్పనా మంట రేగుతుంటే ఆపనా.... కొత్త జోరువుంది చూపనా కొండకోనలన్నీ దాటనా... నిన్ను చూడగానే ఈడువచ్చి గోడదాటి దూకుతుంటే ఓ బాలయ్యో.... కొంటె కోరికుంటే చెప్పకు మంట రేపుతుంటే దాచకు కొత్త జోరు మీద రేగకు కొండలెక్కబోయి జారకు నన్ను చూడగానే ఈడు వచ్చి గోడదాటి దూకుతుంటే చలి చలి నవ్వుల సందడిలో తెలి తెలి మంచులు పడుతుంటే పగ్గమేసినా ఆగనంటుంటే పక్కకొచ్చినా చాలదంటుంటే.... చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పకు ఇప్పుడిప్పుడే కన్ను తెరిచిన కన్నెపిల్లని ఇరవైకన్నా మూడ తక్కువ చిన్నపిల్లని బుగ్గలోన దాచుకున్న - మొగ్గలన్ని దోచుకున్న పులకరింత పూతకొచ్చి – చిలక ముద్దు పెట్టుకుంటే గిలి గిలి గింతల కౌగిలి - గిజ గిజ లాడిని పరువంలో ఈడు జోడుతో గూడుకడుతుంటే- ఇద్దరొకటై ఉలిక్కి పడుతుంటే చెప్పకు చెప్పకు చెప్పకు చెప్పదు చెప్పకు ఎప్పుడెప్పుడా అన్న వయసుకు కొత్తవాడిని ఇప్పుడిప్పుడే అన్న వరసలో కొంటె వాడిని మొదులోని అయ్యకన్న మూడు ఆకు లెక్కు వున్న ఛదువులెన్నో చదివినోణ్ణి -సరిసనున్న అందగాణ్ణి
పప్పులో ఉప్పేసి పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పప్పులో ఉప్పేసి తిరగమాత పెట్టినట్టు గొప్పగా ఉన్నావె పిల్లో నిన్నిడిసి వుండలేను గడియైనా గడపలేను ఘుమ ఘుమ ఘుమ ఘుమ గుమ్మెత్తి పోతుంటే పప్పులో నెయ్యేసి కసాపిసా నమిలినట్టు గొప్పగా వున్నాపురయ్యే గొడవేమో చూడలేను గడియేమో తీయలేను దడ దడ దడ దడ దండెత్తి వస్తుంటే... బిర్రు బిర్రు పేంటు మీద కిర్రు కిర్రు బూటువేసి నువ్వు చరా చరా చరా చరా నడుస్తుంటే తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం అన్నదీ వయసు ఉన్నదా మనసు మనసుంది నీమీద అందగాడా మనసైన మాటుంది సందకాశా తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం ధిగిణతోం అన్నదీ చిన్నది వెళ్ళిరా అన్నది రావుడో దేవుడో వదిలిపెట్టు కుర్రకారు జోరుమీద చిర్రు బుర్రు లాడుకుంటూ గుస గుస గున గున జారుకుంటే తధిగిణతోం తధిగి తోం తధిగిణతోం తధిగిణతోం అశ్వదా సొగసు ఆగదీమనసు… వేళ గాని పాళ గాని తాళమేల వెర్రి మొర్రి ఈలలేసే తాళజాల తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం తధిగిణతోం అన్నదీ చిన్నదీ వెళ్ళిరా అన్నది. రాముడో దేవుడో వదిలిపెట్టు
అసలే చినదాన్ని (జంగ్లా జం జం...) పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల ఆసలే చిన్నదాన్ని కసిగా వున్నదాన్ని అర్ధరాత్రి మేళమైతే సంకురాత్రి తెల్లవారి తాళమేస్తే శివరాత్రి జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా అసలే గడుసువాణ్ణి అందులో గట్టివాణ్ణి ఆరిరాత్రి మేళమైతే - సంకురాత్రి తెల్లవారి తాళమేస్తే శివరాత్రి జంగ్లా జం జం... జంగ్లా జం జం...జంగ్లా జం జం... జా ఇప్పుడు పిల్లా నా కిల్లానా సూశావంటే అంతే తానా అంటే తందానా అనకుంటే గల్లంతే అసలే వేటగాణ్ణి - అందులో నీటుగాణ్ణి ఉరిమే మబ్బై రాకు రాకు రాకు ఉలిక్కి పడతాను తరిమే పిడుగై రాకు రాకు రాకు గతుక్కు మంటాను. ఆతుక్కుపోతాను... వయసొక వాగై పొంగుతువుంటే వాలెయ్యడమే మందు చీటికి మాటికి చిందెయ్యలేనంచే తల్లకిందు అందులో దీటుగాణ్ణి... ఒకటే కసిగా ఆడిపాడమాకు ఒణుక్కు పోతాను వయసే బుసగా పైకి పైకి రాకు రాకు ఒణుక్కు మంటాను చిలక్కి చెబుతాను...
అపూర్వ సహోదరులం పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ అపూర్వ సహోదరులం అనురాగ సుధాఝరులం ఇద్దరు ఇద్దరు కలసిన ఈ ఉదయం సూర్య చంద్రోదయం అమ్మ అనే రెండక్షరాలు అన్నదమ్ముల రూపాలు గంగా యమునా సంగమించిన కౌగిలి గుడిలో దీపాలు అనురాగంలో దేవుడు రాసిన అట్టితెలుగు కీర్తన అన్నా అన్నా అన్నా అనుబంధానికి దేవుడు చేసిన అపురూప కల్పన తమ్ముడు మా తమ్ముడు ఇద్దరు కలిసిన ఈ ఉదయం మమతకు మహోదయం ఇన్నాళ్ళకు ఆ దేవుడు నాకో తీయని వరమిచ్చాడు. నా అన్న వాడు లేడనుకుంటే, అన్నీ తానైవచ్చాడు .. అన్నీ తానైపున్నాడు.. ఇన్నాళ్ళకు ఈ రాముడుకి ఒక తమ్ముడు తోడైవచ్చాడు నా అయోధ్యలో అడవి దారిలో తోడూ నీడై వచ్చాడు. తొలకరి ఆశలు తెచ్చాడు. ఇద్దరు కలిసిన యీ ఉదయం ప్రేమకు హిమాలయం...
రామాయణం పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్ కోరస్ రామాయణం దివ్య ప్రేమాయణం సర్వదీనావనం విత్య పారాయణం రామబ్రహ్మను రాముడెందుకే రావే సీతాభామినీ రాముడికేవే పదితలకాయలు వాడికి తెలుసా రాక్షసమాయలు తలలెన్నుంటేనేం.. రావణా... నీ తలసన్నే వాడుండగా కూలిన ఆ తాటక మారీచులు - నీ కులపోళ్ళని మరిచేవా ముక్కు చెవులూ తెగిన శూర్పణఖ ముద్దుల చెల్లెలు అది మరిచేవా ఆయ్ వదరికే సీతా వదరకే ఆట్టె వదరకే గడువిస్తుంటిని రేపటి వరకు వస్తా రేపొస్తా నీ పని చూస్తా అమ్మా సీతా నీకివియే నా సాష్టాంగ దండ ప్రణామాలు శ్రీరామబంటునే తల్లీ అనవాలుగా అందుకోవే ఆ శ్రీరామ చంద్రుని ముద్రిక నింపకే కన్నీళ్లు తల్లీ ఈ లంక చెర ఎన్నాళ్లు చెరబాప స్వామి రాకా తప్పదు. రావణుడు నేలకూలక తప్పదు. ఎవడురా మర్కట నీవు మతిలేక మా లంకజొచ్చినావు శ్రీరామబంటును నేను మాతల్లి సీతమ్మ జాడ తెలియగపిచ్చినాను ఏమరా ఆ రామకార్యం ఏమురా నీ కోతి దౌత్యం ధర్మమార్గము ననుసరించి స్వామికి సీతమ్మని అప్పగించి శరణు కోరితే నీకు మంచి లేదా మరణ మొకటే నీకు శాస్తి దహనం దహనం లంకాదహసం లంకాపై భవ నాశనం రావణ దర్ప వినాశనం కోరస్: దహనం దహనం లంకాదహసం లంకావైభవ నాశనం రావణ దర్ప వినాశనం రామజయం శ్రీరామ జయం - రామజయం శ్రీరామ్ జయం రామజయం శ్రీరామ జయం రామజయం శ్రీరామ జయం
సీతాకాలం వచ్చింది పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, పి. సుశీల సీతాకాలం వచ్చింది రామా రామా చిమ చిమ లాడింది ప్రేమ ప్రేమ జివ్వు జివ్వు మన్నాది సిగ్గూ నిగ్గూ వద్దు వద్దు అన్నాది హద్దు హద్దు వణక్కు వణక్కు వణక్కు వణక్కు నేనున్నా తోడు సణక్కు గొణక్కు వణక్కు మిణక్కు నేనే నీ గూడు వెచ్చ వెచ్చనీ ముద్దిస్తా ముచ్చటేమిటో ఆడేస్తా అందమైనదీ అందు కోవిది అచ్చ తెలుగులో అడిగేస్తా పులిమీద పుట్రమ్మ వీడు చలిమీద ఉన్నాడు చూడు చలిగాలి వీస్తుంది ఆ చూపులో ఇటు గాలి ఆటు సోకెనా పిలుపులో చినుక్కు చినుక్కు చినుక్కు చినుకులు పడుతుంటే చిరుక్కు చిరుక్కు చూపులు చిటికెలు వేస్తుంటే వయసు వయసునై వాటేస్తా మనసు చాటున చాటేస్తా మంచు కొండలో లేత ఎండలో మంచమేసి చలిమంటేస్తా చెలి చూపు చలి కన్నా వేడి నడిరేయి కూసింది కోడి తెల్లారి పోవాల ఈ చుక్కతో పరువాల ముచ్చట్లు దుప్పట్లలో...
అమ్మో ఇదే మేనకరా పాట సాహిత్యం
చిత్రం: రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (1980) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి గానం: యస్.పి. బాలు, మాధవపెద్ది రమేష్, పి. సుశీల సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక పదనిస నినినిని నినినిని నినినిని నిదరంటూ మనకింక లేదిక అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా జవజవ లాడే జవరాలా జనమందరికీ ప్రియురాలా జవజవ లాడే జవరాలా జనమందరికీ ప్రియురాలా నవనవ లాడే కుర్రోణ్ణి... నీ నడకలు తెలిసిన చిన్నోణ్ణి... ఈడు ఇప్పుడే ఈల వేసినా గోలచేసిరా మైకంలో నీతో ఆడినా జోడు కూడినా కలిసి పాడినా ఆడినా కూడినా పాడినా వస్తదిలే చక్కిలి గిలిగిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి గిలిగిలి హా... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక పదనిస నినినిని నినినిని నినినిని నిదరంటూ మనకింక లేదిక జగమెరిగిన ఓ చినవాడా జనమంతా మెచ్చిన వాడా జగమెరిగిన ఓ చినవాడా జనమంతా మెచ్చిన వాడా సలసలకాగిన చినిదాన్ని నీ చకపక లెరిగిన చినదాన్ని సోకులేప్పుడో పురుడు విప్పిన తెరలకెక్కిన బుల్లెమ్మా సోకులేప్పుడో పురుడు విప్పిన తెరలకెక్కిన బుల్లెమ్మా నిన్ను తాకినా వన్నె సోకినా కలిసి ఊగినా తాకినా సోకినా ఊగినా గంట గిలి చక్కిలి గిలిగిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి గిలిగిలి హా... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా అమ్మమ్మో... అమ్మో ఇది మేనకరా అందానికి తారకరా సరిగమ మమమమ మమమమ మమమమ మల్లెపూలు వేళాయే రాయిక పదనిస నినినిని నినినిని నినినిని నిదరంటూ మనకింక లేదిక
No comments
Post a Comment