Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sankranti (2005)





చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
నటీనటులు: వెంకటేష్ , శ్రీకాంత్ , శివబాలజి, శర్వానంద్, ఆర్తి అగర్వాల్, స్నేహ, సంగీత, 
దర్శకత్వం: ముప్పలనేని శివ
నిర్మాత: ఆర్. బి.చౌదరి
విడుదల తేది: 18.02.2005



Songs List:



ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: ఉదిత్ నారాయణ్, సదన సర్గం 

ఎలా వచ్చెనమ్మా గులాబీల వాన 





అందాల శ్రీమతికి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: హరిహరన్, శ్రేయా ఘోషల్

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు
నీ నవ్వే తేనే జల్లులే మీరుంటే స్వర్గమేనులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

చిరుగాలికి ఏదో పాపం సందేహం
మనవెంటే ఉంటూ మన కబుర్లు వింటుంది
ఏంటో ఈ కాలం నిలబడదే నిమషం
నీవెళ్లి రానా అని పరుగులు తీస్తోంది
వినలేదా మల్లెలు కోసం పలికే ఆ తుమ్మెద రాగం
వింటుంటే తెలియని దాహం మొదలైంది ఇపుడే కొంచం
అదే సుమా నీకు నాకు వేసెను తియ్యని బంధం
ఆ కథలే మరిచిపోనులే ఊరించే జ్ఞాపకాలులే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట

పొద్దెరగని ప్రణయం కోరింది హృదయం
నీ లేత పెదవే ఉసికొలిపే ఈ సమయం
హద్దెరగని సరసం తగదన్నది ప్రాయం
శృతి మించిపోతే రుచిలేనిది శృంగారం
విరజాజుల పరుగులకైనా కరునిస్తావని అనుకున్నా
అలకన్నది క్షణమైనా మురిపిస్తే వశమై పోనా
వేల వేల చుక్కల్లోన జాబిల్లివి నువ్వేనమ్మా
జాబిలికే వెలుగు సూర్యుడే
నువు లేని బ్రతుకు శూన్యమే

అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
అందాల శ్రీమతికి చెప్పలేని అలకంట
మనసార లాలిస్తే చంటిపాప తానంట
శ్రీవారికి ఈ సరసాలు పన్నిటితో జలకాలు
నీ చూపులో మురిపాలు నీతో ఇలా జగడాలు
ఏనాడు సరదాకైన నొప్పించరా మీరు




అడే పాడే పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్ 
గానం: కార్తీక్, చిత్ర 


అడే పాడే 



ఆశ ఆశగా పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల 
గానం: యస్.పి.బాలు 


ఆశ ఆశగా 



చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: భాస్కరభట్ల రవికుమార్
గానం: శంకర్ మహదేవన్ , సుజాత

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం - హేయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం 

చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

మోజు పిట్ట కన్నె కొట్టు మోజు తీరా ముద్దె పెట్టు 
చెమ్మచెక్క ఆటాడిస్తాలే 
మాటలింక కట్టే పెట్టు కాట్టేస్తే కందేటట్టు 
వేటగాడి ఊపే చూస్తాలే 
దేదె చుమ్మా బెంగాలీ బొమ్మ ఏకంగా అల్లడిస్తాలే 
రా రా రాజా నేనే నీ రోజా ఉ అంటే వొళ్ళోకోస్తాలే... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం హొయ్ 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
తీరుస్తానులే తిమ్మిరి కొంచం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 

హే ప ప ప పాలపిట్టా పైటే పట్టు వద్దంటే నీమీదోట్టు
వరసంగా పిండే ఇస్తాలే లే లే
గిలి గిలిగా విన్నెటట్టు కౌగిట్లో జున్నే పెట్టు 
జజ్జన్నక జమ ఇస్తాలే 
హె.హె తయ్య రయ్య అరే తస్సదియ్య 
వాటంగా ఒళ్ళొకోస్తాలే... 
హే... రావే పిల్ల నా తుగో జిల్లా 
వయ్యారం తాళం తీస్తాలే 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం హోయ్... 
అయితే ఎక్కు మరి పందిరి మంచం 
సిద్ధంగుందిలే గుడుగుడు గుంజం 

హేయ్... చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్ 
చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందోయ్ 
వద్దు వద్దయో ఆ దూకుడోద్దయో 
నా బుజ్జి కన్నయో ఇది లేత ఒళ్ళయో 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం హొయ్ 
అయితే ఎక్కు మరీ పందిరి మంచం 
త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం




డోలి డోలి పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: శంకర్ మహదేవన్, ఎస్.ఎ. రాజ్ కుమార్, చిత్ర, కల్పన 

డోలి డోలి



(పెళ్లి పాట - I) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

పెళ్లి పాట - I




చక్కని మా అన్నయ్యకు (పెళ్లి పాట - II) పాట సాహిత్యం

 
చిత్రం: సంక్రాంతి (2005)
సంగీతం: ఎస్.ఎ. రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. యస్.మూర్తి
గానం: పార్థసారథి, మురళి

చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ 
వచ్చింది ఇంటికి తన జంట గూటికి 
చిరినవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ 
నిలుచుంది వాకిట ఈ మందార మాలిక 
సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా 
నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా 
పొంగే ఆనందం తెచ్చే సంతోషం 
మాలోగిలి నిండెనే 
వధువే బంగారం వరుడే తనసర్వం 
ఇది నూరేళ్ళ బంధమే

No comments

Most Recent

Default