చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి నటీనటులు: బాలకృష్ణ , భానుప్రియ దర్శకత్వం: ఎ. కోదండ రామిరెడ్డి నిర్మాత: నందమూరి హరికృష్ణ విడుదల తేది: 11.05.1988
Songs List:
నీవు విసరకు వల పాట సాహిత్యం
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పల్లవి: నీవు విసరకు వల నీకు పండదు కల అరటి చెట్టుకు గెల పండితేనే కళ పాల పిట్టా ఈల పాడుకోవాల ముచ్చట్లే మొదలు పెట్టుకోవాల పండు చేతి కందగానే పట్టెమంచ మేసినట్టు పలవరింత మొదలా చరణం: 1 అందంలో మందారం అరవిచ్చే సాయంత్రం కురిసింది చలిగా వెన్నెలా తనువిచ్చే తాంబూలం పండించే శృంగారం అడిగింది ఎదలో కోయిలా ఊహల్లో తొలి ఉయ్యాలా ఊపింది నన్నీవేళ చీరకట్టు చూడగానే చిలిపి వయసు తొలి సలపరింత సెగలా చరణం: 2 గాజుల్లో సంగీతం మోజుల్లో సావాసం పలికింది కసిగా మద్దెలా నడుముల్లో తారంగం నడిచొచ్చే వయ్యారం వణికింది ఒడిలో వీణలా రగిలేటి చలిరాగాలా రేపేటి తడి తాళాలా కంటి రెప్ప కొట్టగానే కలికి సొగసు ఒడి చేరి పొడుపు కథలా
పెద్ద పెద్ద కళ్ళదానా పాట సాహిత్యం
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల పల్లవి: పెద్ద పెద్ద కళ్ళదానా - దా... దా... వంకర టింకర నడుము దానా అబ్బదా... అబ్బదా కళ్యాణవేళ కౌగిళ్ళ లీల పాలు పండు పంచుకుందామా దండా దిండు మార్చుకుందామా ఆంధ్రాలోకే అందగాడా..రా..రా... దెబ్బకు దెబ్బ తీసిపోరా అబ్బరా..అబ్బరా... తలుపేసివస్తా తాంబూలమిస్తా మంచం కంచం పంచుకుందామా మంచి చెడ్డ తేల్చుకుందామా చరణం: 1 పెళ్ళికి పందిళ్ళు పచ్చగ ఉన్నయి మెత్తగ చెక్కిళ్ళు కొట్టు మల్లెల మంత్రాలు చల్లిన మంచాల మాపటి లంచాలు పెట్టు నా కేమో శోభనం మా మామా తద్దినం ఈ దినమే ఇద్దరం మొదలెడదాం కాపురం నా సొంతం ఇది నా పెళ్లాం ఓ మొగుడా ఇక నీ యిష్టం మామా చీమా దోమా జీవిత భీమా చేసుకో చరణం: 2 మాయల పిచ్చోడు మామకు మంచోడు మేయరు వచ్చాడు చూడు ఊళ్లో దద్దమ్మ ఇంట్లో వాజమ్మ పెళ్లికి వచ్చాడు తోడు ఈ యేడే ఇద్దరం పై యేడే ముగ్గురం ఒకటయ్యే ఈదుదాం సంసారం సాగరం నీ బాజా ఇక వాయిస్తా నా రోజా నీకిచ్చేస్తా రాణీ వాణీ వేణీ రాత్రికి బోణీ చేసుకో
వన్డే క్రికెట్ సండే టికెట్ పాట సాహిత్యం
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి పల్లవి: వన్డే క్రికెట్ సండే టికెట్ మనసే వికెట్ వయసే టులెట్ ఆడాలి కసితీరా జోరుగా మనసుకి సుఖం మన్మధుడి మతం కలయిక నిజం కౌగిలికి శుభం నా సగం నీవుగా మారేవంటే మజాగా నా పదం నీదిగా చూపిస్తాలే తడాఖా చరణం: 1 సిక్సోక్లాకవుతుంటే సెక్సీగా సిక్సర్లే పూబంతి ఔటవుతున్నా నేబంతులాడెయ్యనా Repeat it - Repeat it. Repeat it - Repeat it. ఏకదం తొక్కినా ఏకదంత ముపాస్మహే ఏరిథమ్ వాడినా సంగమం యుగేయుగే చరణం: 2 బ్రేకంటూ నువ్వొస్తే నే షేకై పోతుంటే నాషోకు నీదవుతుంటే నీసొంతమే అవ్వనా Repeat it - Repeat it Repeat it - Repeat it ఏ సగం తాకినా చుంబనాల సెంచరే ఏ సుఖం అందినా బౌండరీ అదే అదే
ఓయమ్మో ఇది ఎవ్వరే పాట సాహిత్యం
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి పల్లవి: ఓయమ్మో ఇది ఎవ్వరే నా గుడిసె కట్టనివ్వదు ఓయమ్మో ఇది ఎవ్వరే తాటాకు కప్ప నివ్వదు ఓయబ్బో ఈడెవ్వడే వంగితే వాటేస్తడూ ఓయబ్బో నా గోడకే సున్నాలు కొట్టేస్తడూ కట్టుకో బోతుంటే కొత్త పెళ్ళాం పెట్టుకో బోతుంటే కొత్త కాపురం ఎవడడ్డమొస్తాడు ఎదురైతే ఛస్తాడు మోగనీ జోరుగా ముద్దు మద్దెల చరణం: 1 ఎగదీసి కట్టిందిరో అరకోకనీ బిగిరైకని దాని పోకడే చూడాలిరా కర్రెత్తు కొచ్చాడురో మహాకిర్రుగా బలెకుర్రడూ వాడి తాకిడే చూడాలిరా వటేస్తుంటే వయ్యారాలే ఉయ్యాలూగే ఊపుల్లోన నా జోరు చూపించిన చాలంటున్న సరసాలాడే అందలన్ని సందేళల్లో నీ పేరు రాసివ్వన నా మడిసే తోడుండగా పూరి గుడిసేలే అందము ఈ కలిసే జోడుండగా లేత వయసే ఆనందము ఎవడబ్బ సొమ్మంట, దమ్ముంటే రమ్మంటా వాయిస్తా నీడొక్క డోలు కీర్తన ||ఓయమ్మో!|| చరణం: 2 ఇక సాగబోదమ్మడూ ఈ దోపిడీ ఇలాగారడీ పాతరోజులే మారాయిలే ఇక చెల్లదో పిల్లడూ వెట్టి చాకిరీ కండ తిమ్మిరీ కొత్త ఊపులే వచ్చాయిలే అరె జాబిలమ్మ చుక్కల్లమ్మ వచ్చేముందే నచ్చేదంట అరె కౌగిల్లే పట్టేయన అహ తొలికోడమ్మ కూసే ముందే నడిరేయమ్మ అడిగిందంట సందిల్లతో ఇవ్వన నా కసినే కవ్వించుకో దాని కొసరే నువ్వందుకో నా సొగసే సోలించుకో దాని వడ్డీ చెల్లించుకో మా తాత మనవడ్ని నీతైన మగవాడ్ని నీ బుర్ర పాడిస్తా రామకీర్తన
వెన్నెళ్లు కాసింది పాట సాహిత్యం
చిత్రం: తిరగబడ్డ తెలుగుబిడ్డ (1988) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి పల్లవి: వెన్నెళ్లు కాసింది రేయమ్మా రేయమ్మా నన్నల్లుకోమంది హాయమ్మా హాయమ్మా కౌగిలికన్నా గాఢంగా ముద్దుల కన్నా దాహంగా మెత్తగ హత్తుకు పోవమ్మా... ఓయమ్మా...హాయమ్మా వెన్నెళ్లు కాసింది రేయమ్మా రేయమ్మా నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా చరణం: 1 అల్లరి చేసే తిమ్మిరి యీడు నీజత నే కోరితే, ఒడినే చేరితే అందిన కొద్ది ఆగక రేగే నీతొలి సయ్యాటతో చలి సుడి రేగితే అందని పొందని అందపు అంచులు చూశాలే చక్కర ముద్దుల వుక్కిరి బిక్కిరి అయ్యాలో చలిగాలిలో మరి వలపెందుకో నిన్ను జత చేసి శృతిమించి పోయే చుక్కా చుక్కా చెమ్మా చెక్కా లాడేవేళల్లో ఓ.... వెన్నెళ్లు కాసినది రేయమ్మా రేయమ్మా నన్నల్లుకోమంది హాయమ్మా హాయమ్మా చరణం: 2 ముందుకు వస్తే ముద్దులు సాగే ఈ కసి కవ్వింపులో కసి పరువాలలో వద్దకు వస్తే వత్తిడిరేగే ఈ విరి పొదరిళ్ళలో బిగికౌగిళ్ళలో చుక్కలు చూడని చక్కని జింకలు వేదించే వంపులు చాటున సొంపుల వీణలు మ్రోగించే రాగాలలో కలిసి ఉయ్యాలలే కలిసి ఊగాలి నూరేళ్ళదాకా దోచెముద్దు దాచెబుగ్గ దొరికె వేళల్లో ఓ..... వెన్నెల్లు కాసింది రేయమ్మా రేయమ్మా నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా కౌగిలి కన్నా గాఢంగా ముద్దుల కన్నా దాహంగా మెత్తగా హత్తుకు పోవమ్మా ఓయమ్మా హాయమ్మా వెన్నెళ్లు కాసింది రేయమ్మా రేయమ్మా నన్నల్లు కోమంది హాయమ్మా హాయమ్మా
No comments
Post a Comment