చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి (All) గానం: యస్.పి. బాలు, సుశీల (All) నటీనటులు: చిరంజీవి, విజయశాంతి, భానుప్రియ దర్శకత్వం: సి. వి.రాజేంద్రన్ నిర్మాత: కె.లక్ష్మీదేవి విడుదల తేది: 18.04.1985
Songs List:
అపుడేనా... అందుకేనా పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె.చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల పల్లవి: అపుడేనా... అందుకేనా అపుడేనా... అందుకేనా అంత తొందరెందుకమ్మా.. ఆగమ్మా ఆగు.. పొద్దుగానివ్వు .. ఆగాలి గాలి కాసేపు అందుకేలే... ఆదుకోవే అంత బెట్టు ఎందుకమ్మ.. పట్టమ్మ పట్టు.. కౌగిలి పట్టు ఒళ్లోనా చోటివ్వు ఓ మాటు అపుడేనా... ఆదుకోవే చరణం: 1 పొద్దేమో పోనంటుంది... పొదరిల్లు రమ్మంటుంది మలి సంధ్య చీకట్లోనా... చలి ఎండ వాకిట్లోనా సిగ్గమ్మ ముగ్గే పెట్టే ముంగిట్లోనా నీ చూపు నిప్పౌతుంది... చూడందే తప్పౌతుంది నడిరేయి గుప్పెట్లోనా... చలి గాలి కుంప్పట్లోనా ఈడమ్మ ముద్దే పెట్టె సందట్లోనా... నీ కన్ను కాటేస్తుంటే... నీ చూపు కవ్విస్తుంటే కౌగిళ్లు పట్టేస్తోంటే... ఒళ్లు ఒళ్లు వాటేసిందమ్మా వెచ్చని ఒడిలో... నీలోని విచ్చల విడిగా రేగేటి చిక్కని చలిలో... నీ జంట చక్కిలి గిలిగా సాగాలి నువ్వూ నేను.. కమ్ముకోవే అంటుంటే... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. అపుడేనా... ఆదుకోవే చరణం: 2 మోమాటం వద్దంటుంది... ఆరాటం ముద్దంటుంది ఈ పట్టు తేనెల్లోనే నా పుట్టే మునిగిందమ్మా ఏమిచ్చి నీ కుట్టిటిట్టి కుట్టుకోను సాయంతం ఝుమ్మంటుంది... సావాసం రమ్మంటుంది నీ పైట చెంగుల్లోనా... ఆ చాటు పొంగుల్లోనా నేనెట్ట తెపరిల్లి తేరుకోను... వయ్యారం వోణీలేసి... వయసేమో బోణి చేసి నీతోనే రాజీ చేసి... నిన్నూ నన్నూ కలిపెసిందమ్మో ఆ.. అడిగనివ్వు... ఆ కాస్త అడగనిదివ్వు పూబంతి విచ్చిన పువ్వు... నీ నవ్వు నాపై రువ్వు పగబట్టి పగలే నన్ను అల్లుకోవే రమ్మంటే... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... అపుడేనా... అందుకేనా అంత బెట్టు ఎందుకమ్మ.. పట్టమ్మ పట్టు.. కౌగిలి పట్టు ఆగాలి గాలి కాసేపు అపుడేనా... అందుకేనా
రాజాలా వెలుగూ.. పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు పల్లవి: రా రా రా హే రూ..రూ..రూ హా... రాజాలా వెలుగూ మారాజై బ్రతుకూ మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ కొమ్మలోని కొయిలమ్మ పాటా..ఆ..కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ.. పా..పా..పా..హా..ఆ..రూ రూ రూ హే హే హే..ఏ.. రాజాలా వెలుగూ మారాజై బ్రతుకూ చరణం: 1 వెకువల్లే నిద్ర నుంచి నీవు మేలుకో వెన్నలంటి మల్లె పూలు వేడి చేసుకో వేడి వేడి ఊపిరంత వేణువుదుకో వేన వేల రాసలీల ఆడి పాడుకో చెలిమే నీకు ప్రాణం..మమతే నీకు ధ్యానం.. ఈ ప్రేమ సామ్రాజ్యమే ఏలుకో..ఏ దివ్యతీరాలకో సాగిపో.. నవ్వుతున్న యవ్వనాల నందనాలలో..ఓ.. రూ..రూ..రూ... హా..ఏ..ఏ..ఏ..హే..హే..హో..ఓ.. రాజాలా వెలుగూ మారాజై బ్రతుకూ చరణం: 2 చుక్కలాంటి చక్కనమ్మ పక్కనుండిపో పైటలాగ జారిపోనీ పాట పాడుకో జాజిమల్లి జావలీల మత్తు జల్లుకో తీయనయిన జీవితాన్ని తీర్చిదిద్దుకో మనసే నీకు నేస్తం మనిషే నీకు నేస్తం ఆ దైవమే నీవుగా మారిపో ఆ స్వర్గమే నీదిగా చేసుకో మాసిపోనీ మళ్ళీరానీ ఈ ఉగాదిలో..ఓ లలలల..లాలా..లాలా లల..రర ర్ర ర్ర ర్రా..ఆ రూ..రూ..హే..హే.. రాజాలా వెలుగూ మారాజై బ్రతుకూ మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ..లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ.. కొమ్మలోని కొయిలమ్మ పాటా ఆ కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ.. తారా..రా..రా.రా హే..హే..ఏ..ఏ రూ..రూ..రూ హా హా ఆ..
అమ్మగా నాన్నగా పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు అమ్మగా నాన్నగా
ఇరుక్కుపోయావమ్ పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు ఇరుక్కుపోయావమ్మో
నేనే దోషినా పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు నేనే దోషినా
పరువమే ఓ పయణము పాట సాహిత్యం
చిత్రం: చిరంజీవి (1985) సంగీతం: కె. చక్రవర్తి సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు పరువమే ఓ పయణము
No comments
Post a Comment