చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ నటీనటులు: నాగార్జున, విజయశాంతి, జీవితరాజశేఖర్ దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు నిర్మాత: కె.మురారి విడుదల తేది: 19.08.1988
Songs List:
నా గొంతు శ్రుతిలోన పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి.బాలు, చిత్ర పల్లవి: నా గొంతు శ్రుతిలోన నా గుండె లయలోన ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఆ... నా గొంతు శ్రుతిలోన నా గుండె లయలోన ఆడవే పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఆ... నా గొంతు శ్రుతిలోన ఆ... నా గుండె లయలోన చరణం: 1 ఒక మాట పది మాటలై అది పాట కావాలని ఒక జన్మ పది జన్మలై అనుబంధమవ్వాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని అన్నిటా ఒక మమతే పండాలని అది దండలో దారమై ఉండాలని కడలిలో అలలుగా కడ లేని కలలుగా నిలిచిపోవాలని అడవే - పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఆ... నా గొంతు శ్రుతిలోన ఆ... నా గుండె లయలోన చరణం: 2 ప్రతి రోజు నువు సూర్యుడై నన్ను నిదుర లేపాలని ప్రతి రేయి పసి పాపనై నీ ఒడిని చేరాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని కోరికే ఒక జన్మ కావాలని అది తీరకే మరు జన్మ రావాలని తలపులే రెక్కలుగా వెలుగులే దిక్కులుగా ఎగిరి పోవాలని పాడవే - పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మలా ఆ... నా గొంతు శ్రుతిలోన ఆ... నా గుండె లయలోన పాడవే - పాడవే కోయిల పాడుతూ పరవశించు జన్మ జన్మలా తననే తననాన తననే తననాన
నీ చరణం కమలం పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు అవి ఎదలో పూచిన చాలు ఏడేడు జన్మాలు... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు అవి ఎదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం చరణం: 1 మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపుల సంధ్యారాగాలు మువ్వలు పలికే మూగతనంలో మోమున మోహన రాగాలు కన్నులు పలికే కలికితనంలో చూపుల సంధ్యారాగాలు అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు అంగ అంగమున అందచందములు ఒంపు ఒంపున హంపి శిల్పములు ఎదుటే నిలిచిన చాలు ఆరారు కాలాలు... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం చరణం: 2 జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు జతులే పలికే జాణతనంలో జారే పైటల కెరటాలు శృతులే కలిసే రాగతనంలో పల్లవించిన పరువాలు అడుగుఅడుగునా రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు అడుగుఅడుగునా రంగవల్లికలు పెదవి అడుగున రాగమాలికలు ఎదురై పిలిచిన చాలు.... నీ మౌన గీతాలు.... నీ చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం నీ పాదాలే రస వేదాలు నను కరిగించే నవ నాదాలు అవి ఎదలో ఉంచిన చాలు ఏడేడు జన్మాలు...
అదిరింది మావ పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: అదిరింది మావ అదిరిందిరో ముదిరింది ప్రేమ ముదిరిందిరో ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిరో అదిరింది పిల్లా అదిరిందిలే కుదిరింది పెళ్లి కుదిరిందిలే ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిలే చరణం: 1 ఆకులిస్తా పోకలిస్తా కొరికి చూడు ఒక్కసారి ఆశలన్నీ వరస పెట్టి తన్నుకొచ్చి గిల్లుతాయి బుగ్గ మీద పంటిగాటు పడుతుంది ప్రతిసారి సిగ్గుచీర తొలగిపోయి నలుగుతుంది తొలిసారి మాపటేల మేలుకున్న కళ్ళ ఎరుపు తెల్లవారి మావ గొప్ప ఊరికంతా చాటుతుంది మరీ మరీ ఒకసారి కసి పుడితే మరుసారి మతి చెడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిలే అదిరింది పిల్లా అదిరిందిలే కుదిరింది పెళ్లి కుదిరిందిలే ఉడుకుబుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిలే వలపు జోరు తేలాలిలే చరణం: 2 పూలపక్క ముళ్ళలాగ మారుతుంది ఎప్పుడంట కూలుకున్న కౌగిలింత సడలిపోతే తప్పదంట మొదటి రేయి పెట్టుబడికి గిట్టుబాటు ఎప్పుడంట మూడు నాళ్ళ ముచ్చటంతా డస్సి పొతే గిట్టదంట రేయి రేయి మొదటి రేయి కావాలంటే ఎట్టాగంట సూరీడొచ్చి తలుపు తడితే తీయకుంటే చాలంట తొలి రేయి గిలి పుడితే తుది రేయి కలబడితే వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిలే అదిరింది మావ అదిరిందిరో ముదిరింది ప్రేమ ముదిరిందిరో ఉడుకుపుట్టి ఇన్ని నాళ్ళు ఉగ్గబట్టి ఉండబట్టి వయసు పోరు తీరాలిరో వలపు జోరు తేలాలిరో
అరెరే దడబెట్టి పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, పి. సుశీల పల్లవి: అరెరే దడబెట్టి పోతుంది కొంటె ఈడు దాని గొడవేదో మెల్లగా అడిగి చూడు అరెరే ఉడుకెత్తిపోతుంది దుడుకు ఈడు దాని వేడెంతో మెత్తగా తాకి చూడు సైగ చేసెను లేత సోకు సోకు కాదది పూల బాకు సైగ చేసెను లేత సోకు సోకు కాదది పూల బాకు సయ్యంటూ కవ్వించే ఊహల్లో ఉరుకు అరెరే దడబెట్టి పోతుంది కొంటె ఈడు దాని గొడవేదో మెల్లగా అడిగి చూడు చరణం: 1 బరువెక్కిన వయ్యారం వంగుతోంది పురివిప్పిన యవ్వనమే చెంగుమంది ఎరుపెక్కిన చురుకుతనం చుర్రుమంది బిరుసెక్కిన కుర్రతనం సర్రుమంది ఒడిదుడుకులు ఓపలేని వయసులో కుడిఎడమలు కానుకోని దురుసులో ఒడిదుడుకులు ఓపలేని వయసులో కుడిఎడమలు కానుకోని దురుసులో సుడి తిరుగుతు వడివడిగా దూకుతున్న సందళ్ళో అరెరే దడబెట్టి పోతుంది కొంటె ఈడు దాని గొడవేదో మెల్లగా అడిగి చూడు అరెరే ఉడుకెత్తిపోతుంది దుడుకు ఈడు దాని వేడెంతో మెత్తగా తాకి చూడు చరణం: 2 పొగరెక్కిన పైర గాలి దుండగీడు పదిలంగా పైట కొంగు ఉండనీడు పదునెక్కిన కోరికతో పంతమాడు పడగెత్తిన పడుచుతనం అంతుచూడు అంచు దాటి పొంగుతోంది అల్లరి కంచె దాటి తుళ్ళుతోంది మరీ మరీ అంచు దాటి పొంగుతోంది అల్లరి కంచె దాటి తుళ్ళుతోంది మరీ మరీ ఆరాలి ఆరాటం అదుముకునే కౌగిల్లో అరెరే దడబెట్టి పోతుంది కొంటె ఈడు దాని గొడవేదో మెల్లగా అడిగి చూడు అరెరే ఉడుకెత్తిపోతుంది దుడుకు ఈడు దాని వేడెంతో మెత్తగా తాకి చూడు
చిలకపచ్చ తోటలో పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, చిత్ర పల్లవి: చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల తెలుగు పాట పాడవే తీయగా హాయిగా కుకు కుకు కు కు కుకు కుకు కు కు చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల తెలుగు పాట పాడవే తీయగా హాయిగా కుకు కుకు కు కు కుకు కుకు కు కు చరణం: 1 వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట వలపులా పిలిచే పాట వరదలా పొంగే పాట అరుదైన వరదయ్య బిరుదైన క్షేత్రయ్య గోపాలా మువ్వ గోపాలా అని మురిసేటి తెలుగింటి పాట అని మురిసేటి తెలుగింటి పాట కుకు కుకు కు కు కుకు కుకు కు కు చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల తెలుగు పాట పాడవే తీయగా హాయిగా కుకు కుకు కు కు కుకు కుకు కు కు చరణం: 2 తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట తెలుగులో తేనెల తేట వెతలలో వెన్నెల బాట రామయ్య భక్తుడై త్యాగయ్య బ్రహ్మమై శ్రీరామ రారా రఘు రామా అని పిలిచేటి తెలుగింటి పాట అని పిలిచేటి తెలుగింటి పాట కుకు కుకు కు కు కుకు కుకు కు కు చిలకపచ్చ తోటలో చిలిపి కోయిల తెలుగు పాట పాడవే తీయగా హాయిగా కుకు కుకు కు కు కుకు కుకు కు కు
ఎవరిని అడగాలి పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: సిరివెన్నెల గానం: యస్.పి. బాలు, సుశీల పల్లవి: ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి నా ఊపిరి కదలిక తీసుకొని నా గుండెల సవ్వడి అందుకొని పలుకులు నేర్చిన రా చిలుకా నా పిలుపును వినలేదు ఎందుకని ఎవరిని అడగాలి చెప్పవే చిరుగాలి చరణం: 1 పచ్చని ఆశల రా చిలక వెచ్చని వలపుల గోరింక ముచ్చటగా జత కలిశాక ఆ కనువిందుని చూశాక కన్నుకుట్టిన కాలం కక్ష కట్టింది వలలు వేచి చిలకను వడిసి పట్టింది వేటగాడి తో వెడలిన చిలక వెనకకు రాదింకా దాటలేని ఎడబాటు ఎడారిన మిగెలెను గోరింక జంట విడిన ఈ వంటరి బ్రతుకుకు అర్థం లేదింకా ఆ వడిలో కను మూయాలని కడసారి కబురు అందించాలని ఎవరిని అడగాలి ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి అడగవే చిరుగాలి నా మాటకు తానే అర్థమని నా మనసుకు తానే అర్థమని తెలిసే అడిగెను గోరింక నా బదులను తనమనసే తెలుపుననీ ఏమని చెప్పాలి అడగవే చిరుగాలి చరణం: 2 తప్పని బంధం చుట్టుకొని నిప్పుల శరమై గుచ్చుకొని ఉచ్చుల ఉరిలో చిక్కుకొని విల విల లాడెను చిలక అని వేదన సెగలో వేదవతిగ ఈ బ్రతుకు రగులుతున్న అగ్ని పరీక్షల జనకిగా జ్వాలలో దిగుతున్నా రాముని కొరకై తిరిగి పుట్టగా ఎన్ని జన్మలైనా ఒకటే కడసారి కోరిక గోరింక నమ్మితే చాలిక ఇంకేమని చెప్పాలి
రాలుగాయి పిల్లదానికి పాట సాహిత్యం
చిత్రం: జానకి రాముడు (1988) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: యస్.పి. బాలు, సుశీల పల్లవి: రాలుగాయి పిల్లదానికి రవ్వలాంటి మొగుడొస్తే రాత్రిలేదు పగలు లేదు భామ భామ నా సత్యభామ అగడాల పిలగాడికి అనుకోని ఊపొస్తే ఆగమన్న ఆగలేడు రంగ రంగ నా పూల రంగా చరణం: 1 పూలదండ పడ్డదింక పుస్తే ఎందుకంటాడు హోయ్ ముద్దులిచ్చుకున్న పొద్దే మంచి ముహూర్తమంటాడు హోయ్ హోయ్ హోయ్ హోయ్ కౌగిల్లే మూడు ముళ్లు కట్టి గేయమంటాది కళ్ళతోటి చెప్పుకుందే పెళ్లి మంత్ర మంటాది అన్నందుకే ఉడుకు పుడుతున్నాది ఉడుకుపుట్టేందుకే ఊపు వస్తున్నాది అగడాల పిలగాడికి అనుకోని ఊపొస్తే ఆగమన్న ఆగలేడు రంగ రంగ నా పూల రంగా అరె రాలుగాయి పిల్లదానికి రవ్వలాంటి మొగుడొస్తే రాత్రిలేదు పగలు లేదు భామ భామ నా సత్యభామ చరణం: 2 ముట్టనట్టే ఉంటాడు ముగ్గులోకి దించుతాడు సిగ్గుపడే లోగానే చిలిపి పని చేస్తాడు హే హే హే సిగ్గు సిగ్గు అంటూనే ముగ్గులోకి వస్తాది మొగ్గ ఇచ్చుకోవాలని ఎంత మోజు పడతాదో పడ్డందుకే గుబులు పుడుతున్నాది గుబులు పుడుతున్నదే బిగువు కానున్నది రాలుగాయి పిల్లదానికి రవ్వలాంటి మొగుడొస్తే రాత్రిలేదు పగలు లేదు భామ భామ నా సత్యభామ అగడాల పిలగాడికి అనుకోని ఊపొస్తే ఆగమన్న ఆగలేడు రంగ రంగ నా పూల రంగా అరె భామ భామ నా సత్యభామ రంగ రంగ నా పూల రంగా
No comments
Post a Comment