చిత్రం: కవచం (2018)
సంగీతం: ఎస్.ఎస్.థమన్
సాహిత్యం:చంద్రబోస్
గానం: రఘు దిక్సిత్
నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జద
దర్శకత్వం: శ్రీనివాస మామిళ్ల
నిర్మాత: నవీన్ చౌదరి
విడుదల తేది: 07.12.2018
నా అడుగే పడితే ఆయుధం
మొదలవుతుంది అనునిత్యం
అని అనవసరంగా బిల్డప్ ఇవ్వను బ్రో
నే చిటికే వేస్తే భూగోళం
వెళ్ళిపోతుంది పాతాళం
అని అక్కర్లేని బిల్డప్ ఇవ్వను బ్రో
అరె వెరీ వెరీ స్పెషల్ గా
వేరే పవర్స్ ఏవీ లేవంట
హే చాలా చాలా చాలా సింపుల్ గా
లైఫ్ ని గడుపుతానే
అరె నాలా నేనే ఉంటా ఇలాగ
నచ్చిందేదో అంతా నిజంగా
చేయాల్సింది చేస్తా ఇష్టంగా
వెనకడుగేయనే
డెడికేషన్ వద్దురా
డెటెర్మినషన్ వద్దురా
చేసే పనిమీద నీకు లవ్ ఉంటే చాలురా
అటెన్షన్ వద్దురా కాన్సంట్రేషన్ వద్దురా
నీ పేరే నీ ప్రొఫెషన్ అయిపోతే అంతే చాలురా
ఇది ఫిలాసఫీ కానే కాదంట
ఫ్రీగా ఇచ్చే లెక్చర్ కాదంట
నే ఫాలో అయ్యే రూటే ఇదంట
నచ్చితే నడవరా
బెడ్రూమ్ లో అద్దమే
నా బెస్ట్ ఫ్రెండ్ రా
నా ఫీలింగ్స్ అన్నిటిని
తాను నాలా ఫీల్ అవుతుంది రా
యుద్ధంలో శత్రువే
నా బెస్ట్ గైడ్ రా
గెలిచేందుకు ఫైర్ ని పెంచి
ఇన్స్పైరే చేస్తాడు రా
ఇది సైకాలజీ థియరీ కాదంట
మెంటాలజీ స్టడీ కాదంట
నా ఐడియాలజీ ఇదే లెమ్మంటా
నమ్మితే నమ్మరా
No comments
Post a Comment