చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ నటీనటులు: నారాయణరావు, మాధవి, చిరంజీవి దర్శకత్వం: ఈరంకి శర్మ నిర్మాత: చలసాని గోపి విడుదల తేది: 01.03.1979
Songs List:
ఏమండీ ఏమనుకోకండి పాట సాహిత్యం
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల ఎమండీ యేమనుకోకండీ ఆకుచాటు మొగ్గనూ రేకు విడని పువ్వునూ అనుభవం లేనిదాననూ ఏంచేయను ఏంచేయను ॥ఏమండీ॥ గుండె దడదడమంటోందీ గొంతు కెండుకు పోతోంది చేతులాడ కున్నవీ చెమటలు పోస్తున్నవీ జీవితంలో ఏమీ యెరగను కాగితంలో యేం రాయనూ మహారాజ రాజశ్రీ సత్యం.... కాబోయే శ్రీవారూ కావాలని కోరారూ మబ్బునే బతిమాలనా హంసను వెతుకాడనా రాయబారులు యెవరూ లేరు సాహస మన్నది అసలేలేదు ఏం చేయనూ ఏం చేయనూ ॥ ఏమండీ॥ ఎంత సొగసరి మావారూ ఇంతగా ననువలచారూ మిధిల కొచ్చిన రాముడై మధుర కొచ్చిన కృష్ణుడై నేడు వాకిట వేంచేశాడే హారతైనా యివ్వలేదే ఎం చేయనూ ఎం చేయనూ ॥ ఏమండీ॥
హే బేబీ కానీ కానీ కైపులోన పాట సాహిత్యం
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్. విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, రమోల హేబేబి కాని కాని కైపులోన తేలనీ ఇలాగే తేలి ఆడనీ కాని కాని కాని కాని ఇలాంటి రేయిరాదు హాయిరాదు రాదనీ తెలారు ఆడి అలవనీ కాని కాని కాని కాని ఉన్నవయసూ... - ఊఁ ఊరుకోదు..........- నిజమా ఊరుకుంటే ఉండిపోదు.... - అబ్బా మరీ మనసు మనసు అనకు - వలపులోన పడకు హద్దు గీసుకోకు ఆశ అణచుకోకు అనుభవించు ఉన్నదానిని కాని కాని కానీ. మిగుల నీకు రేపు ఉందని కాని కాని కానీ పగలూ రేయీ - ఆఁ తలపులేదు - ఓహో మొదలు తుదీ అసలులేదు - ఆఁ లేదు నీది నాది లేదు నీతి జాతి లేదు వెనక చూపులేదు ముందు ఆపులేదు మనిషి పశువు కాడు కాడనీ కాని కాని కానీ గతము నెమరు వేయరాదనీ కాని కాని కానీ
ఇంత మంచివాడివైతే పాట సాహిత్యం
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: ఎల్.ఆర్.ఈశ్వరి, జి.ఆనంద్ యింత మంచోడివైతే బావా బావా బావా పనికిరావు దేనికీ యింతో అంతో గడుసుదనం వుండాలి పురుషుడికి మగపురుషుడికీ యింతో అంతో గడుసుదనం వుండాలి అల్లరంటే నీ కసలు నచ్చదేమి ఆడపిల్లకది శానా యిష్టం కిస్మీ కిస్మి NOT NOW మరి when? పెళ్ళి కావాలీ పెదవి కలవాలి అంతవరకు దూరంగా వుండాలి అయ్యయ్యయ్య కన్నెపిల్ల పక్కనున్నా కన్నెత్తి చూడవు తప్పు తప్పు తప్పు పైటకొంగు జారేస్తే పక్క కెళ్ళి పోతావు అదే వొప్పు చొప్పు కాలుకాస్త తగిలిస్తే సారి సారి అంటావు కన్ను కోడితే నలకేదో పడ్డదంటావు పోనీ ఊదమని దగ్గరొస్తే వణికి వణికి పోతావు లేక వొడిసి పట్టుకోనా ? అబ్బో ఆమాత్రం కూడానా నా వయసు వన్ నైన్ నీ వయసు టూవన్నూ కాదు నైంటీన్, ట్వంటీవన్ యస్సూ మన ఈడు మనజోడు నీతోడు ఫైను అందుకనీ అందుకనే నన్ను చేసుకో వైఫు యింక చూసుకో లైఫు జాగుచేస్తే నా వయసు అవుతుంది నైనువన్నూ పోనీ అప్పుడైన వోపికుంటే నేను నిన్ను కాదన్నూ నువ్వు కాదన్నా నేను వదలనూ నువ్వు వదిలావా నేను బతకనూ
అందాల రాముడు పాట సాహిత్యం
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు, వాణీ జయరాం అందాలరాముడు సీతను కౌగిట పొదిగిన శుభదిన మీనాడు అందాల సీతను రాముడు కౌగిట పొదిగిన శుభదిన మీనాడూ శ్రీ శ్రీరాము డేలిందీ అయోధ్యనైతే మా శ్రీవారు యేలేది నా జీవితం ఆ సీత కదిపింది శివధనుస్సు నయితే నా ఈ సీత కదిపింది నా మనసునే వాల్మీకి రాసింది తొలి కావ్యమయితే మన వలపే దాని తొలి భాష్యమూ లేదు వనవాసం మనది సహవాసం ప్రతిరోజు పట్టాభి షేకం ప్రతిరోజు పట్టాభిషేకం రాజ్యాలు భోగాలు వలదని ఆ సీతా ఈ పార్వతె పుట్టింది నా కోసమే తెల్లని మంచంటి చల్లని స్వామికై నే తపస్సునే చేశాను ఈ జన్మలో ఆ శివుడు మన్మధుని మసి చేసినాడు నీ ప్రియుడు నేడు బ్రతికించుతాడు నువ్వే నా వరము - నేనే నీ సగము మనజీవితాలే ఆదర్శమూ మన జీవితాలే ఆదర్శమూ
కన్నువంటిది ఆడది పాట సాహిత్యం
చిత్రం: కుక్క కాటుకు చెప్పుదెబ్బ (1979) సంగీతం: ఎమ్.ఎస్.విశ్వనాథన్ సాహిత్యం: ఆత్రేయ గానం: యస్.పి.బాలు కన్నువంటిది ఆడదీ కన్నీరామెకు తప్పనిదీ తనువున యెక్కడ దెబ్బతగిలినా కన్నే యేడ్చేది మనలో యెవ్వరు తప్పు చేసినా స్త్రీకే శిక్ష పడేది - స్త్రీకే శిక్ష పడేది తప్పటడుగులు మాన్పించీ తప్పువొప్పులు నేర్పించారూ తలుపుచాటూ తల్లిచాటూ దాటకుండా పెంచారూ కనురెప్పలుగా కాపాడారు కంటిని ముల్లు కాటేస్తే ముల్లుకే కంటిని అర్పిస్తారా ఇదేమి న్యాయం ఇదేమి న్యాయం సీతా అహల్యలున్నారూ ఈ కలికాలంలోనూ తాము చేయని నేరములకు శిక్షలింకా పడుతున్నారు రాముడు యేడీ అహల్యకు భూదేవేదీ సీతమ్మకు కన్నతల్లివున్నా మరలా కడుపులోకి వెళ్ళేదెలా
No comments
Post a Comment