Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Manchu Pallaki (1982)




చిత్రం: మంచుపల్లకి (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
నటీనటులు: చిరంజీవి, సుహాసిని, రాజేంద్రప్రసాద్ 
మాటలు: యండమూరి వీరేంద్రనాథ్ 
దర్శకత్వం: వంశీ
నిర్మాత: యమ్. ఆర్.ప్రసాదరావు
విడుదల తేది: 19.11.1982



Songs List:



నీ కోసమే మేమందరం పాట సాహిత్యం

 
చిత్రం: మంచుపల్లకి (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: మైలవరపు గోపి 
గానం: యస్.పి.బాలు

పల్లవి:
నీ కోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
మంచి తెస్తావని... మంచి చేస్తావని...

welcome welcome new year
good bye old year
welcome welcome new year
good bye old year

వచ్చే వచ్చే new year .. happy new year
వచ్చే వచ్చే new year .. happy new year
మా చెంత నిలిచి ..కన్నీరు తుడిచి.. సుఖశాంతులివ్వు... తరతత్తత్తర

చరణం: 1
ప్రతి డైరీలోనూ ప్రతి పేజీలోనూ
హాయిగా సాగిపో.. గురుతుగా ఉండిపో..
చల్లగ దీవించూ.. మా కోరిక మన్నించూ
ఈ ఏటికన్న పై ఏడు మిన్న
పోయింది చేదు.. రావాలి తీపి.. హ హ హ హ

హేహేహే..  happy new year...

wish you happy new year
good bye old year
wish you happy new year
good bye old year

కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల తరతత్తత్తరం
నీ కోసమే మేమందరం నీరాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం.. గొప్ప శుభసూచకం..

new year లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల
new year లాలాల లాలలల
లాలలల్ల లాలలల్ల
లాల్లలాల్లలాల్లల లాల్లలాల్లలాల్లల
పా రపప్పప్ప పాపపా
తరత్త తరత్త తరత్త తరత్త...
లాలల్లలలా లాలలలా...
లాలల్లలలా లాలలలా...

చరణం: 2
దొరికింది మాకు సరికొత్త స్నేహం
నేడు నీ రాకతో... నిండు నీ నవ్వుతో
వెన్నెలై సాగిరా.. గుండెలో ఉండిపో..
స్నేహాలు లేక ఏముంది జగతి
స్నేహాలలోనే దాగుంది ప్రగతి..
హ హ హ హ హెహే... యా

నీకోసమే మేమందరం నీ రాకకే ఈ సంబరం
కొత్త సంవత్సరం గొప్ప శుభసూచకం

welcome welcome new year
good bye old year
welcome welcome new year
good bye old year

కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
కొత్తకు ఎపుడూ స్వాగతం పాతకూ వందనం
లాలాలలాల లాలాలలాల లాలాలలాల
తరత్తత్తరం హే యా




మేఘమా దేహమా.. పాట సాహిత్యం

 
చిత్రం: మంచుపల్లకి (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్.జానకి

పల్లవి:
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురిసినా .. కరుగునీ ..
మెరిసినా కురిసినా కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

చరణం: 1
మెరుపులతో పాటు ఉరుములుగా..
దని రిస రిమ దని స దని ప గ
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా..
ఆ.. ఆ.. ఆ.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా..
వేసవిలో మంచు పల్లకిగా..

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం

చరణం: 2
పెనుగాలికి పెళ్ళి చూపు..
పువ్వు రాలిన వేళా కల్యాణం..
అందాకా ఆరాటం .. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ... ఓ.. ఓ.. ఓ.. ఓ..

మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం
మెరిసినా.. కురిసినా .. కరుగు నీ జీవనం
మేఘమా దేహమా .. మెరవకే ఈ క్షణం




పగలు రేయిలో పాట సాహిత్యం

 
చిత్రం: మంచుపల్లకి (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: యస్.పి.బాలు

పగలు రేయిలో 




మనిషే మణిదీపం..పాట సాహిత్యం

 
చిత్రం: మంచుపల్లకి (1982)
సంగీతం: రాజన్-నాగేంద్ర
సాహిత్యం:  శ్రీశ్రీ
గానం: యస్.పి.బాలు

పల్లవి:
మనిషే మణిదీపం.. మనసే నవనీతం
మనిషే మణిదీపం.. మనసే నవనీతం

మనిషే మాణిక్యం.. మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం.. గుండెలో అనుతాపం
మనిషే మాణిక్యం.. మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం.. గుండెలో అనుతాపం

మనిషే మణిదీపం.. మనసే నవనీతం
మనిషే మణిదీపం.. మనసే నవనీతం.. అహా

చరణం: 1
ఈమె పేరే మంచితనం.. ప్రేమ పెంచే సాధు గుణం
ఈమె తీరే స్నేహధనం.. వాడకంతా అభరణం
ఈమె పలుకే.. ముద్దు గులికే.. తేనలొలికే తియదనం..
ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ..

మనిషే మణిదీపం.. అహా.. మనసే నవనీతం.. అహా

మనిషే మాణిక్యం.. మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం.. గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం... మనసే నవనీతం..

చరణం: 2
పెళ్ళి పల్లకి హరివిల్లు.. చుక్కలే అక్షింతలు జల్లు.. హా..
పెళ్ళి పల్లకి హరివిల్లు.. చుక్కలే అక్షింతలు జల్లు
సంధ్య కెంజాయ పారాణి.. లేత మొబ్బులే సాంబ్రాణి
పిల్ల గాలులే ప్రేక్షకులు.. దేవదూతలే రక్షకులు

మనిషే మణిదీపం. అహా.. మనసే నవనీతం.. అహా

మనిషే మాణిక్యం.. మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం.. గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం... మనసే నవనీతం

చరణం: 3
ఏదురు చూచిన తొలి రేయి నుదుట కురులే చెదిరాయి
నిదుర మరిచిన నడి రేయి ప్రియుడి పెదవులు నవ్వాయి
అంతలోనే తెల్లవారి వింత కలలే కరిగాయి

మనిషే మణిదీపం.. అహా.. మనసే నవనీతం.. అహా

మనిషే మాణిక్యం.. మెరిసే వైడుర్యం
కన్నులో అనురాగం.. గుండెలో అనుతాపం
మనిషే మణిదీపం... మనసే నవనీతం

No comments

Most Recent

Default