Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Naagu (1984)




చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి (All)
గానం: యస్.పి.బాలు, పి.సుశీల (All)
నటీనటులు: చిరంజీవి, రాధ
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
నిర్మాణం: ఏ.వి.యమ్ ప్రొడక్షన్స్
విడుదల తేది: 11.10.1984



Songs List:



మంచోడు అనుకున్నా పాట సాహిత్యం

 
చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి :
మంచోడు అనుకున్నా అయ్యో రామా
గిచ్చాడే  మెత్తగా కృష్ణా రామా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
దించాడే కిందికి చందామామా
దించాడే కిందికి చందామామా

అరే.. మంచోడ్నే లేవే నా  మల్లెలకొమ్మా
ముద్దిస్తే ఏమాయే ముద్దుల గుమ్మా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
ఇచ్చేస్తా నీకే నా చందామామా
అరే.. ఇచ్చేస్తా నీకే నా చందామామా

మంచోడు అనుకున్నా అయ్యో రామా
అరే.. మంచోడ్నే లేవే నా  మల్లెలకొమ్మా

చరణం: 1
తప్పమ్మ అప్పుడే తాకరాదు... తాళిబొట్టు కట్టకుండా తగలరాదు
తప్పమ్మ అప్పుడే తాకరాదు... తాళిబొట్టు కట్టకుండా తగలరాదు

తప్పదే అప్పుడైన తాకకుండా...  అప్పుడైన ఇప్పుడైన తగలకుండా

అందాక ఓర్చుకో బాగుగా.. అందంగా తీరుస్తా కోరికా
అందాక ఓర్చుకునే ఓపికే నాకుంటే ఇన్ని తిప్పలెందుకే ఇందువదన
రామారామా కృష్ణారామా... రామారామా కృష్ణారామా

మంచోడు అనుకున్నా అయ్యో రామా
గిచ్చాడే  మెత్తగా కృష్ణా రామా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
ఇచ్చేస్తా నీకే నా చందామామా
అరే.. ఇచ్చేస్తా నీకే నా చందామామా

చరణం: 2
నీ కంటి చూపుకే నెలలు నిండితే... నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే
నీ కంటి చూపుకే నెలలు నిండితే... నీ ప్రేమ ఘాటుకే పిల్లలు పుడితే
అమ్మనైపోనా అయ్యో రామా.. అమ్మమ్మనై పోనా కృష్ణారామా

నా చూపు దెబ్బకే సొమ్మసిల్లితే... నా చేతి వేడికే చెమ్మగిల్లితే
తాతనైపోనా అయ్యో భామా... ముత్తాతనై పోనా బామ్మా బామ్మ
రామారామా కృష్ణారామా... రామారామా కృష్ణారామా

మంచోడు అనుకున్నా అయ్యో రామా
అరే... మంచోడ్నే లేవే నా  మల్లెలకొమ్మా
పెంచాడే పిల్లాడు నాలో ప్రేమా
పెంచేస్తా ఇంకాస్తా నీలో ప్రేమా
దించాడే కిందికి చందమామా
ఇచ్చేస్తా నీకే నా చందామామా




నన్నంటుకోమాకు చలిగాలి... పాట సాహిత్యం

 
చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, సుశీల

పల్లవి:
నన్నంటుకోమాకు చలిగాలి... హాయ్
నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి..హోయ్..హోయ్..హోయ్
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు పిల్లగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి ఉండ లేక... అమ్మాయి గుండె వేడి అడగాలి

నన్నంటుకోమాకు చలిగాలి... హ..హ..హా
నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి..హోయ్..హోయ్..హోయ్
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి గుండెలోనా అమ్మాయి ఉండలేక ఒదగాలి
నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి

చరణం: 1
చిలిపి వాన దులిపే లేత వలపేదో నా కళ్ళలో
బులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్లలోనా
చిలిపి వాన దులిపే లేత వలపేదో నా కళ్ళలో
బులిపి చూపు నిలిపి చెయ్యి కలిపే కౌగిళ్లలోనా
వానే వయసై తడిసే సొగసును కోరిందిలే కొంగు గొడుగు
కొంగే గొడవై పొంగే వరదను నేనెట్ట ఆపాలి కడకు

జల్లు ఎత్తుపోయింది జంకులన్నీ... ఇల్లు కట్టుకోమంది జంటచేరి
ఉన్న కొంప ముంచింది కొత్త కొంప ఇచ్చింది వానగాలి

చరణం: 2
మెరిసే మబ్బు కురిసే వాన వెలిసేనులే ఇప్పుడే
కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలో..
మెరిసే మబ్బు కురిసే వాన వెలిసేనులే ఇప్పుడే
కలిసే జోడు కలిసే జంట విడిపోదు ఈ జన్మలో..
నేనో మెరుపై నిన్నే ఒరిసిన ఒత్తిల్లలో ఉంది వలపు
నాలో ముసిరే ఎన్నో ముద్దుల సందిళ్లలో ఉంది ఉరుము

జంటలోన పుట్టింది గాలి వానా...
చలిలోన చెలి తోడు నేను లేనా
హోయ్.. చీర కట్టు జారాక నిన్ను కట్టుకోమంది కొంటెగాలి

నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
తగిలిందంటే తడిగాలి...
అబ్బాయి గుండెలోనా అమ్మాయి ఉండలేక ఒదగాలి

నన్నంటుకోమాకు చలిగాలి... నా ప్రేమ పెంచమాకు ప్రేమగాలి
లలల్లాలలల్లల్లలాలలాలా...  లలల్లాలలల్లల్లలాలలాలా





ముక్కు మీద కోపం..పాట సాహిత్యం

 
చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

పల్లవి:
ముక్కు మీద కోపం...అరే..ముట్టుకుంటే తాపం...
అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే ..
ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...

ముద్దుగుమ్మ రూపం...అరే..ముట్టుకుంటే తాపం
కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే...
ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...

ముక్కు మీద కోపం ...ముట్టుకుంటే తాపం...హె..హె..

చరణం: 1
మాపటేల మంచమేసుకుంద్దామంటే...
మల్లెపువ్వు దీపమెట్టుకుంద్దామంటే..
అరే దగ్గరకొచ్చి...అక్కరతీర్చి వెళ్ళరాదా...

చిచ్చులాంటి సిగ్గు అంటుకుంద్దామంటే....
చీకటింట చింత తీర్చుకుంద్దామంటే...
అరే..పక్కకు చేరి పండగ ముద్దు తీర్చరాదా...

కోపాలు లేత లేత కవ్వింతలు...తాపాలు రేపో మాపో రెండితలు...
చలిగాలొచ్చి గిల్లాడు...
సందెపొద్దు కొచ్చిపోవే వెచ్చనమ్మ..గోరువెచ్చనమ్మా..

ముక్కు మీద కోపం ...అరే..ముట్టుకుంటే తాపం...
అరే...కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే...
ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...
ముక్కు మీద కోపం ...అరే..ముట్టుకుంటే తాపం...

చరణం: 2
చందనాల ముద్దులిచ్చుకుంద్దామంటే...
అరే..సన్నజాజి తేనే జల్లుకుంద్దామంటే...
అరే మెత్తగ వచ్చి ..అడిగిందిచ్చి వెళ్లరాదా....

కాస్త ఆగ పొద్దుపుచ్చుకుంద్దామంటే...
కౌగిలింతలిచ్చి పుచ్చుకుంద్దామంటే...
అరే...ఆపరకొద్ది రేగిన దాహం తీర్చరాదా..
అందాలు ముందు పక్క మూడింతలు..
ఆపైన పక్కకొస్తే కొండతలు.....

అలిగాడమ్మ పిల్లాడు...
అల్లరింక ఆపుకోనే సింగారమా..లేత వయ్యారమా...

ముద్దుగుమ్మ రూపం...అరే..ముట్టుకుంటే తాపం
హే...కొంగు మీద కోపాలు కోక మీద చూపిస్తుంటే...
ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...

ముక్కు మీద కోపం ...అరే...ముట్టుకుంటే తాపం..
అత్త మీద కోపాలు దుత్త మీద చూపిస్తుంటే...
ఎట్టాగమ్మ...ఇంకా ఎట్టాగమ్మా...





ఓ చెలీ... నిన్ను చూడగానే పాట సాహిత్యం

 
చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు

ఓ చెలీ... నిన్ను చూడగానే పుట్టేనాకు చలి 




నా ఆట చూపించనా పాట సాహిత్యం

 
చిత్రం: నాగు (1984)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల

నా ఆట చూపించనా నీ ఆట కట్టించన

No comments

Most Recent

Default