Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Ninne Premistha (2000)





చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, శ్రీకాంత్, సౌందర్య
దర్శకత్వం: ఆర్.ఆర్.షిండే
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 14.09.2000



Songs List:



ఒక దేవత వెలిసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: డా౹౹ వెనిగళ్ల రాంబాబు
గానం: యస్.పి.బాలు

పల్లవి:
ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా 
సౌందర్యాలే చిందే యామినిలా 
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా 
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం:  1
విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మ
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం 
ఒదిగింది నీలోనే అందని స్వర్గం 
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మునుముందుకు వచ్చేనే చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని 

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం:  2
రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగపోసి
పూయించా నీ  జడకోసం 
రోజు ఉపవాసంగా హృదయం నైవేద్యంగా 
భూజించా నీ జతకోసం 
నీరెండకు నీవెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలుపుకు హారతులిస్తా
ఇన్నాల్లు అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని 

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా 
సౌందర్యాలే చిందే యామినిలా 
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నాతో అంది ఇలా 
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నా కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే



ప్రేమా ఎందుకని నేనంటే పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: ఈ. యస్. మూర్తి
గానం: రాజేష్ , చిత్ర

పల్లవి:
ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది 

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

చరణం: 1
పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటే చెరిగేలా ఆ కంటి చూపు
వేకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమున సిగ్గులు చల్లే నా చెలి మందారం
ఎంత చేరువై వుంటే అంత సంబరం

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు

చరణం: 2
ఏటిలో తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతోంది
కంటికి కునుకంటూ రాను పొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటూంది
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం
వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు
ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుంది తీయని బంధం
శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది 

ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావు



కోయిల పాట బాగుందా పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం:  చిత్ర, యస్.పి.బాలు

పల్లవి:
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా 
కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా 

అందమైన మల్లె బాల బాగుందా
అల్లి బిల్లి మేఘమాల బాగుందా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా 

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా 

చరణం: 1
అప్పుడెప్పుడో గున్నమామి తోటలో
అట్లతద్ది ఊయలూగినట్లుగా
ఇప్పుడెందుకో అర్థరాత్రి వేళలో
గుర్తుకొస్తోంది కొత్త కొత్తగా
నిదురించిన ఎద నదిలో
అల లెగిసిన అలజడిగా
తీపితీపి చేదు ఇదా లేతపూల ఉగాది ఇదా
చిలకమ్మా చెప్పమ్మ చిరుగాలి చెప్పమ్మా 

కోయిల పాట బాగుందా కొమ్మలసడి బాగుందా
పున్నమితోట బాగుందా వెన్నెల సిరి బాగుందా 

చరణం: 2
మబ్బుచాటులో ఉన్న వెన్నెలమ్మకి
బుగ్గచుక్కలాగా ఉన్న తారక
కొబ్బరాకుతో అల్లుకున్న బొమ్మకి
పెళ్లి చుక్కపెట్టినట్టు వుందిగా
కలలు కనే కన్నులలో
కునుకెరుగని కలవరమా
రేయిలోని పలవరమా హాయిలోని పరవశమా
చిలకమ్మా చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది
అందమైన మల్లెబాల బాగుంది
అల్లి బిల్లి మేఘమాల బాగుంది
చిలకమ్మా బాగుంది చిరుగాలి బాగుంది 

కోయిల పాట బాగుంది కొమ్మల సడి బాగుంది
పున్నమితోట బాగుంది వెన్నెలసిరి బాగుంది



గుడిగంటలు మ్రోగినవేళ పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: గంటాడి కృష్ణ
గానం: చిత్ర

పల్లవి:
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది
గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది

శ్రీ రంగనాధ స్వామి వెంట దేవేరి తరలి వచ్చెనంట
ఆ జంట చూడముచ్చటంట వెయ్యైన కళ్ళు చాలవంట

చరణం: 1
నా చిరునవ్వయి నువ్వే ఉండాలి - ఉండాలి
నా కనుపాపకు రెప్పయి వుండాలి - ఉండాలి ఉండాలి
చెలి గుండెలపై నిద్దుర పోవాలి - పోవాలి
ఇరు మనసుల్లో ప్రేమే ఎదగాలి - ఎదగాలి ఎదగాలి
నా చెలి అందెల సవ్వడి నేనై
నా చెలి చూపుల వెన్నెల నేనై
చెలి పాదాల పారాణల్లే అంటుకు తిరగాలి
నుదుటి బొట్టై నాలో నువ్వు ఏకమవ్వాలి

చరణం: 2
వెచ్చని ఊహకు ఊపిరి పోయాలి - పోయాలి
నెచ్చెలి పమిటికి చెంగును కావాలి - కావాలి
కమ్మని కలలకు రంగులు పూయాలి - పూయాలి
నా చిరునామా నువ్వే కావాలి  - కావాలి కావాలి
తుమ్మెద నంటని తేనెవు నువ్వయి
కమ్మని కోకిల పాటవు నువ్వయి
చీకటిలో చిరుదివ్వెవు నువ్వయి  వెలుగులు పంచాలి
వీడని నీ నీడను నేనై నిన్ను చేరాలి

గుడిగంటలు మ్రోగినవేళ మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ తెగ తొందర పెడుతోంది
ఆ దేవుని పూజకు నువ్వొస్తే
నా దేవిని చూడగ నేనొస్తే
అది ప్రేమకు శ్రీకారం

గుడిగంటలు మ్రోగినవేళ 
మది సంబర పడుతోంది
తొలి సంధ్యల వెలుగులవేళ 
తెగ తొందర పెడుతోంది



ప్రేమలేఖ రాసెను పాట సాహిత్యం

 
పల్లవి:
ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని
గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం 

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని

చరణం: 1
కనులకు తెలియని ఇదివరకెరుగని
చలినే చూడాలని
ఊహల దారుల ఆశలు వెదికెను
ఆమెను చేరాలని
ఎదసడి నాతోనే చెప్పకపోదా
ప్రియసఖి పేరేమిటో
కదిలే కాలాలు తెలుపక పోవా
చిరునామా ఏమిటో
చెలి కోసం పిలిచే ప్రాణం పలికే
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం 

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని

చరణం: 2
కవితలు చాలని సరిగమ లెరుగని
ప్రేమే నా పాటని
రెక్కలు తొడిగిన చిగురాశలతో
కబురే పంపాలని
కదిలే మేఘాన్ని పిలిచి చెప్పనా
మదిలో భావాలని
ఎగసే కెరటాన్ని అడిగిచూడనా
ప్రేమకు లోతెంతని
చిరుగాలుల్లో ప్రియరాగం పలికే
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం 

ప్రేమలేఖ రాసెను నా మనసే ఎపుడొస్తావని
కనులు తెరచి కలలే కంటున్నా నిను చూడాలని


గుండె చాటు గుసగుస నిన్నే చేరుతుందని
అందమైన ఊహాలోకం అందుతుందని
వెన్నెలమ్మ చిరునవ్వుల్లా నిన్నురమ్మని
ఎదురు చూసి పలికెను హృదయం
ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం 
ప్రేమకు స్వాగతం ప్రేమకు స్వాగతం 




ఒక దేవత వెలసింది పాట సాహిత్యం

 
చిత్రం: నిన్నే ప్రేమిస్తా (2000)
సంగీతం: ఎస్.ఏ. రాజ్ కుమార్
సాహిత్యం: డా౹౹ వెనిగళ్ల రాంబాబు
గానం: చిత్ర

పల్లవి:
ఒక దేవత వెలసింది నీ కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా 
సౌందర్యాలే చిందే యామినిలా 
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నీతో అంది ఇలా 
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం: 1
విరిసె వెన్నెల్లోన మెరిసె కన్నుల్లోన నీనీడే చూసానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే తన మదిలో అమృతవర్షం 
నీలోనే ఉందమ్మా అందని స్వర్గం 
ప్వరలించే హృదయం తో రాగం తీసి
నీకుంకమ తిలకంతో పవిటే రాసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని 

ఒక దేవత వెలసింది నీ కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

చరణం: 2
కళ్ళకు కనులే విందు కాటుక సిగ్గులు విందు
కాబోయే కళ్యాణం లో 
తనలో సగమే నీది నీలో సర్వం తనది
అనురాగం మీ ఇద్దరిది
ఆ తార తోరణమే మల్లెల హారం 
చేరాలి మురిపాల సాగర తీరం 
అలరించే మీ జంట వలపుల పంట 
శుభామంటూ దీవించే గుడిలో గంట 
చెప్పాలి తనతో నీవే నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోని శ్రావణిలా 
సౌందర్యాలే చిందే యామినిలా 
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తు అంటూ నీతో అంది ఇలా 
నిన్నే ప్రేమిస్తానని

ఒక దేవత వెలసింది నీ కోసమె
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే

No comments

Most Recent

Default