Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Nuvvu Vastavani (2000)





చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
నటీనటులు: నాగార్జున, సిమ్రాన్
దర్శకత్వం: వి.ఆర్.ప్రతాప్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
విడుదల తేది: 05.04.2000



Songs List:



పాటల పల్లకివై పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: ఎస్.పి.బాలు

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి



కొమ్మ కొమ్మా విన్నావమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: ఇ. ఎస్. మూర్తి
గానం: హరిహరన్, చిత్ర

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది

విన్నానమ్మా తియ్యని వేణువు
రమ్మని పిలుపులనీ
చూశానమ్మా స్వాగతమంటు
తెరిచిన తలుపులనీ

పగలూ రాత్రి అంటూ తేడా లేనే లేని
పసి పాప నవ్వులని చూడనీ
తోడు నీడ నువ్వై నాతో నడిచే నీకు
ఏనాటి ఋణముందో అడగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదవనీ
కానుకైన స్నేహాన్ని గుండె లోన దాచుకొనీ
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలనీ
కోరుకుంటానమ్మా  దేవుళ్ళని

కొమ్మ కొమ్మా విన్నావమ్మ
కోయిల వస్తుంది
విన్నానమ్మా తియ్యని వేణువు
రమ్మని పిలుపులని

ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే
ఏ పూలు తేవాలి పూజకీ
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే
ఇంకేమి కావాలి జన్మకీ

మచ్చలేని చంద్రుడినీ మాట రాక చూస్తున్నా
వరస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇకెప్పుడు ఒంటరిననీ అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేననీ

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేల్లి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది

విన్నానమ్మా తియ్యని వేణువు
రమ్మని పిలుపులనీ
చూశానమ్మా స్వాగతమంటు
తెరిచిన తలుపులనీ



కలలోనైన కలగనలేదే పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: ఎస్.పి.బాలు

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
కలలోనైన కలగనలేదే నువు వస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువ్వొస్తావని

ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి
ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల
నదిలో ముంచుతున్నది

ఓహొ... ఓహొ...హే...హే....

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని

చిన్ని పెదవిపైన పుట్టుమచ్చ కానా
చిందుతున్న నవ్వులలోన స్నానాలాడనా
కన్నె గుండెపైన పచ్చబొట్టు కానా
మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందనా

జానకి నీడే రాముని మేడ
నీ జారిన పైట నే కోరిన కోట

తెలుగు భాషలోని వేలపదములు కరగుతున్నవి
నా వలపు భాషలోన చెలియ పదమే 
మిగిలి ఉన్నది

ఓహొ...ఓహొ....

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని


కాళిదాసు నేనై కవిత రాసుకోనా
కాలిగోటి అంచులపైన హృదయం ఉంచనా
భామదాసు నేనై ప్రేమ కోసుకోనా
బంతిపూల హారాలేసి ఆరాదించనా

నాచెలి నామం తారక మంత్రం
చక్కని రూపం జక్కన శిల్పం
వందకోట్ల చందమామలోకటై వెలుగుతుండగా
ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ

ఓహొ...ఓహొ...

కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని
మెలుకువలోనైన అనుకోలేదే నువు వస్తావని
ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి
ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి

ప్రేమపైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది
నను కమ్మనైన అమృతాల
నదిలో ముంచుతున్నది

హే...హే.....హే...హే....



మేఘమై నేను వచ్చాను పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: పోతుల రవికిరణ్
గానం: రాజేష్ కృష్ణన్ , సుజాత మోహన్

పల్లవి:
మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురే పంపను
ఎన్నటికి నిన్ను చేరెదను

ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికానూ

నిన్ను వలచీ అన్ని మరచీ
కలతపడి నిలుచున్నా
నిన్ను తలచీ కనులు తెరచీ కలలోనే వున్నా
పాట నే విన్నదీ మాటే రాకున్నదీ
వేరె ధ్యాసన్నదీ లేనే లేకున్నదీ

ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికానూ

నిను చూడనీ కనులేలనీ
కలవరించే హృదయం
నిను వీడనీ నీ నీడల సాగిందీ బంధం
ప్రేమ భదన్నదీ ఎంత తియ్యనైనదీ
ఎండమవన్నదీ సెలయేరైనదీ

ఓ ప్రియా... ఓ ప్రియా...

మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను
మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను
ఎవరితో కబురే పంపను
ఎన్నటికి నిన్ను చేరెదను

ఓ ప్రియా... ఓ ప్రియా...



రైలుబండి నడిపేది పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: చంద్రబోస్
గానం: శంకర్ మహదేవన్

రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే
తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిట్

అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై 

రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు
ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు

క్యాషే ఉంటే ఫేస్ కు విలువస్తుంది
నోటే ఉంటే మాటకు బలమొస్తుంది
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది 
బైకు ఉంటే అమ్మాయే బీటే వేస్తుంది
నీకు సైకిలుంటే ఆ పిల్లే సైడయ్ పోతుంది

రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

ఏ భాష తెలియని డబ్బు
అబద్దాన్ని పలికిస్తుంది
అరెరరె..ఏ భాష తెలియని డబ్బు
అబద్దాన్ని పలికిస్తుంది

ఏ పార్టీకి చెందని డబ్బు
ప్రభుత్వాన్ని పడగొడుతుంది
డాలర్లయినా రష్యన్ రూబ్బులైనా
డబ్బుంటేనే మనిషికి ఖానా ఫీనా

చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో
చేతినిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో
ఊరినిండా చుట్టాలే అమ్మో చిట్టమ్మో

రైలుబండి నడిపేది పచ్చజెండాలే
బ్రతుకుబండిని నడిపేది పచ్చనోటులే

తళ తళ తళ మెరిసే నోటు తీర్చును లోటు
పెళ పెళ పెళ లాడే నోటు పెంచును వెయిట్

అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై 
అరె బోల్ మేరే భాయ్ ఈ నోట్ కి జై
అరె బోల్ మేరే భాయ్ నా మాటకి జై




పాటల పల్లకివై (Female Version) పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: చిత్ర

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

నీలాల కనుపాప లోకాన్ని చూస్తుంది
తనరూపు తానెపుడూ చూపించలేనంది
అద్దంలా మెరిసే ఒక హృదయం కావాలి
ఆ మదిలో వెలుగే తన రూపం చూపాలి
రెప్పల వెనక ప్రతి స్వప్నం కలలొలికిస్తుంది
రెప్పలు తెరిచే మెలుకువలో కల నిదురిస్తుంది
ఆ కలల జాడ కళ్ళు ఎవరినడగాలి

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి

పాదాల్ని నడిపించే ప్రాణాల రూపేది
ఊహల్ని కదిలించే భావాల ఉనికేది
వెన్నల దారమా జాబిల్లిని చేర్చుమా
కోయిల గానమా నీ గూటిని చూపుమా
ఏ నిముషంలో నీ రాగం నా మది తాకింది
తనలో నన్నే కరిగించి పయనిస్తూ ఉంది
ఆ రాగమెపుడు నాకు ఎదురుపడుతుంది

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడ వెతకాలి
నీతోడు లేనిదే శ్వాసకి శ్వాస ఆడదే
నువ్వే చేరుకోనిదే గుండెకి సందడుండదే
నీ కోసమే అన్వేషణ
నీ రూపు రేఖలేవో ఎవరినడగాలి 

పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి
కంటికి కనపడవేం నిన్నెక్కడవెతకాలి



నీవే దేవునివి పాట సాహిత్యం

 
చిత్రం: నువ్వు వస్తావని (2000)
సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: సుజాత మోహన్

నీవే దేవునివి నల్లనయ్య
కాని నీకెపుడు వేదనలే ఎందుకయ్యా
నీదే విశ్వమణి అందురయ్య
అయినా నీవెపుడు ఒంటారివే చల్లనయ్య

లోకం ఆపదలు తీర్చినావు 
కాని నీవే ఆపధలు మోసినావు
ఎన్నో బధలను ఓర్చినావు
 అయినా మోముపైన నవ్వు నీవు చెరగనీవు

నీవే దేవునివి నల్లనయ్య
కాని నీకెపుడు వేదనలే ఎందుకయ్యా

1 comment

TELUGU VELUGU said...

కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లె రా రామ్మనది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని
పగలు రాత్రి అంటూ తేడా లేనే లేని పసి పాప నవ్వుల్ని చూడనీ
తోడు నీడ నువ్వై నాతో నడిచే నీకు ఏనాటి ఋణముందో అదగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదలని
కానుకైన స్నేహాన్ని గుండెలోన దాచుకొని
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలని కోరుకుంటానమ్మా దేవుళ్ళని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
ఇదుగో నువ్వే అంటూ ప్రేమే ఎదురై వస్తే ఏ పూలు తేవాలి పూజకి
నీతో జతగా ఉండే వారమే నువ్వే ఇస్తే ఇంకేమి కావాలి జన్మకి
మచ్చలేని చంద్రుడిని మాటరాక చూస్తున్న
వరస కానీ బంధువుని చొరవచేసి అంటున్నా
ఇంకెప్పుడూ ఒంటరినని అనరాదనీ
నేకు సొంతం అంటే నేనేనని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుంది
వస్తు వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది
ఏవమ్మా మరుమల్లి తోరణాలు కడతావా
చిలకమ్మా ఎదురేగి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లె రా రామ్మనది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులని
చుసానమ్మా స్వాగతమంటూ తెరిచినా తలుపులని

Most Recent

Default