Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Shailaja Reddy Alludu (2018)




చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
నటీనటులు: అక్కినేని నాగచైతన్య, అనుఇమాన్యుయేల్
దర్శకత్వం: మారుతి దాసరి
నిర్మాతలు: ఎస్.రాధాకృష్ణ, ఎస్. నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్
విడుదల తేది: 13.09.2018



Songs List:



అను బేబీ పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: అనుదీప్ దేవ్

బేబీ.. బేబీ.. బేబీ.. బేబీ..బేబీ.. బేబీ..
అను బేబీ సరే ఆగవే
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె  జాను  మేరె సోనియె
విసుగొచ్చిన మేరీ కోమ్ లా అలా మండకే

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం 

అను బేబీ సరే ఆగవే
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె  జాను  మేరె సోనియె
సుతిమెత్తని సురకత్తిలా శివమెత్తకే

ఈగోని ఇంధనమల్లె వాడలమ్మ భామా
నీ గోల్ రీచ్  అవుతావమ్మా 
తగ్గుంటే తప్పేం లేదు నెగ్గేస్తావే గుమ్మా 
పది మంది గుండెల్లో ప్రేమా

ఓ మెట్టు దిగిరావే…
పాప  జాలీ టార్చర్ ఏ 
ఫైరింగ్ కేరింగ్ ప్యాకేజే  ప్రేమా

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం 

అను బేబీ సరే ఆగవే
అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే
మేరె  జాను మేరె సోనియె
సుతిమెత్తని సురకత్తిలా శివమెత్తకే

పక్కోడు పడ్డాడంటే పైకే లేపాలమ్మ
చెయ్యేస్తే తప్పేం లేదమ్మా

ఓ కొంత  పంచే ఇస్తే రెట్టింపయ్యేనమ్మ
సాయాలు వ్యర్థం కావమ్మా..
కారాలు నూరేలా  గుచ్చి గుచ్చి చూసిన
నాకేదో అవుతుందే పిల్ల రాయిల్లా

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం

ఆ మహిషాసుర మర్దినే నువ్వా
ఆపర కాళిలా నువ్వు మారక
నాపాలి మహంకాళి శాంతి శాంతి ఓం





శైలజరెడ్డి అల్లుడు చూడే పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: శ్యాం కాసర్ల 
గానం: సత్యవతి (మంగ్లీ)

ఛమ్ ఛమ్ బల్ బరి జాతరే చూడే
బమ్‌చిక్ బమ్ బలిపోతాయ్యాడే
ప్రేమా పంతం నడుమన వీడే నలిగిపోతుండే
ఈ పోరడు హల్వా అయితుండే

తిప్పలు మస్తుగా బడ్డా
కొప్పులు రెండు కలువవు బిడ్డా
ఇంతటి కష్టం పడక
ఢిల్లీకి రాజవ్వచ్చుర కొడక

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

శాసనమే తన మాట
నీ అత్త శివగామి బయట
పంతం కూతురు ఎదుట
టామ్ అండ్ జెర్రీ ఆట

అమ్మకు అచ్చు జిరాక్సు
ఈ బొమ్మకు పిచ్చి పీక్సు
బద్దలు కానీ బాక్సు
వద్దనే మాటకు ఫిక్సు

అత్తను చూస్తే నిప్పుల కుండ
కూతురు చూస్తే కత్తుల దండ
ఈ ఇద్దరూ సల్లగుండ

పచ్చటి గడ్డి భగ్గున మండ
పట్టిన పట్టు వద్దనకుండ
ఏ ఒక్కరు తగ్గకుండ
బాబు నీ నెత్తిమీదేస్తే బండ
పడ్డవురా నువ్వు లేవకుండ

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్

ఆ రైలు పట్టాలోలే
పక్కన్నే ఉంటారు వీళ్లే 
మెళ్లోనే వేస్తారు నగలే 
ఒళ్లంత చూస్తే ఇగోలే
కలిసుందాం రా సినిమా 
కలిసే చూస్తారమ్మ
అటు ఇటు అచ్చు బొమ్మా 
ఎన్నడు కలవవులేమ్మా

కట్టిన బట్ట పెట్టిన బొట్టు దగ్గర ఉండి
ఎక్కే బండి అన్నింట్ల అమ్మ సెలక్షన్
కడుపున పుట్టి అట్టకు మట్టి
పెరిగిన కుట్టి మాటలబట్టి
కట్టయ్యె ఉన్న కనెక్షన్
బాబు మట్టయ్యిపోయే ఎఫెక్షన్ 
నువ్వు తట్టుకోరా ఎమోషన్

అంటుకుపోతే ఆంటికి కోపం
బిగుసుకుపోతే బ్యూటికి కోపం
సన్ ఇన్ లానే సాండ్‌విచ్ పాపం
ఇరుక్కు పోయిండే
ఈ పోరడు మెషీన్ల చెరుకయిండే

శైలజరెడ్డి అల్లుడు చూడే
యే యే యే హోయ్



ఎగిరేగిరే వచ్చేసానే పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: కృష్ణ కాంత్
గానం: సిద్ శ్రీరామ్, లిప్సిక

ఏ ఊరు ఏ దారి ఏ దూరమైనా
నేరాన చేసేసి ఏ నేరమైనా
గదులు ఆపేనా నదులు ఆపేనా
నేను దాటేయనా చాటేయనా ప్రేమనీ...

ఎగిరేగిరే వచ్చేసానే నిన్నే కోరి
అడిగడిగే ఆనందాలే నన్నే చేరే

ఎదురు చూపే ఆపే
వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే
మిన్నంటే నా ఆరాటాలే

ఎగిరేగిరే వచ్చేసానే… నిన్నే కోరి
కోరస్: కలహపు దేశాన కలలను చూసారా

అడిగడిగే ఆనందాలే… నన్నే చేరే
కోరస్: పరువపు వేశాన పరుగులు తీసారా

నువ్వుంటే నవ్వుల్లో ఉన్నట్టే
నీతోనే నేనున్నా లేనట్టే
కోపాలే వే రానే రా వే

నే చూపలేన నీకోసం
ఈ చేతిలోన ఆకాశం
తెలియనే యే తెలియదే
ఇష్టమంటే ఇదే అని

ఓ ఓ, ఎగిరేగిరే వచ్చేసానే… నిన్నే కోరి
కోరస్: కలహపు దేశాన కలలను చూసారా

అడిగడిగే ఆనందాలే… నన్నే చేరే
కోరస్: పరువపు వేశాన పరుగులు తీసారా

ఎదురుచూపే ఆపే
వెన్నంటే నీ తోడుంటాలే
హృదయమాపే చూపే
మిన్నంటే నా ఆరాటాలే

ఎగిరేగిరే వచ్చేసానే… నిన్నే కోరి
కోరస్: కలహపు దేశాన కలలను చూసారా

అడిగడిగే ఆనందాలే… నన్నే చేరే
కోరస్: పరువపు వేశాన పరుగులు తీసారా





గోల్డ్ రంగు పిల్ల పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: శ్రీమణి
గానం: అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్ర, మోహన భోగరాజు, హరిప్రియ

పోరి పోరి సత్యభామ
దుమ్ము దులిపి వెళ్లేనంట
విచ్చుకున్న మాట వచ్చి గుచ్చేనంట
కిట్ట మూర్తీకింకా మొదలు కొంటె తంటా

గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా
సౌండే చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా
హే పిల్ల వెళ్ళిపోకే అల్లా
ఈ వేళా చెయ్యమంది గోల
ఆ బంగారు చేపల్లే
వయ్యారం ఒంపేసి జారితే ఎళ్ళ

మాట వినవె పిల్ల
చూపావే ప్రేమ చాలా
మరి ఇంతలోనే నీకీ అలకెలా

మాట వినవె పిల్ల
చేస్తావే అంత గోల
మరి ఇంతలోనే నీకీ తగువేల

పంచెకట్టు పక్కనెట్టి
పంచులన్నీ మూట గట్టి
కంచెలన్నీ తెంచుకున్న
కొంటె కృష్ణుడే
సత్య భామనేరి కోరి వచ్చినాడే

కళ్ళ కున్న కాజల్ కూడా
కబురులాడెనంటా
కాలాల్లోని కళలు మొత్తం
నీకు చెప్పమంటా
చేతికున్న గాజులు కూడా
ఊసులాడేనంటా
గుడిసెలోని గొడవ మాత్రం
నీకు చూపమంతా

కాలికున్న పట్టి కూడా పలుకుతుందిగా
వెంట వెంట రాకు అంటూ తిట్టుతుందిగా
చంటి పాపాయి నే చూడు
ఎక్కిళ్ళు పెట్టైనా ఏదోటి చెబుతుందిలే

అంత ఈజీ గా మేమేంటో
చెప్పేసే వీలుంటే
మాకింత ఫాలోయింగ్ ఉండదే

మాట వినవె పిల్ల
నువ్వు మాట వినవె పిల్ల
దాచేయకు మాటలిల్ల మధుబాల

మాట వినవె పిల్ల
చేస్తావే అంత గోల
మరి ఇంతలోనే నీకీ తగువేల

గోల్డ్ రంగు పిల్ల గుండె దోచుకుంది ఇల్లా
సౌండే చెయ్యకుండా అడుగుపెట్టి వచ్చేనిల్లా
హే పిల్ల వెళ్ళిపోకే అల్లా
ఈ వేళా చెయ్యమంది గోల
ఆ బంగారు చేపల్లే
వయ్యారం ఒంపేసి జారితే ఎళ్ళ

మాట వినవె పిల్ల
నువ్వు మాట వినవె పిల్ల
మాట్టాడవెందుకు నాలా నాలుగురిలా
దాయాల చంటి పిల్ల
చేస్తావే గారమిళ్ళ
మరి అంతలోనే దూరం అవ్వాలా



పెళ్లి పందిరి పిలిచింది పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: విజయ్ యేసుదాస్

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగ కనరండి
కోడి పందెం కాదండి
జోడు బంధం చూడండి

హే ఇద్దర్ని ఒకటి చేసే మండపాన
అందరికందరు బంధువులండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందర వందర్లెందుకండీ

మనువు కథ ఇలా మొదలైంది
మనసులను అదే కలుపుతుంది
నడుమ తలా తేరి తొలగునండి
వరస కలుపుతూ పలకరండి

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగ కనరండి

తాళిబొట్టై మెడలోన
కాలిమెట్టై చరనాన
ఏనాడు విడవను బందిఖానా
అతడు నిను అడిగెను కదా
వెయ్యేళ్ల వరమే వరుడు కానీ
వెతికి నిను కలిసెను కదా
నీ తలపులే పూల జడగా
వెన్నే వంచుతుంటే
ఇంపైన దొరసాని
అతిధి కల ఒంపేమి కాదు అని
పెళ్లీడు కరువు ఇది అని
అంటారే అందాల అలివేణి

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగ కనరండి

పాణిగ్రహణం జరిపించి
సప్తపదిగా నడిపించే
పెద్దరికమన్నది పదవిగాని
పరువు చెడుపని కాదని
శ్రీహరి కి వధువు ని
కాళ్ళు కరిగి దారపోస్తే ఘనతని

ఈ ఇద్దరినీ దీవించుపని నీ పుణ్యమండి
యధార్థమిది అండి తధాస్తు అని నోరారా పలకండి
ముహూర్త బలమండి మమతలను ముడిపడనీయండి

పెళ్లి పందిరి పిలిచింది
కళ్ళ విందుగ కనరండి
కోడి పందెం కాదండి
జోడు బంధం చూడండి

హే ఇద్దర్ని ఒకటి చేసే మండపాన
అందరికందరు బంధువులండి
హే మంగళ వాద్యం మోగే ముహూర్తాన
చిందర వందర్లెందుకండీ

మనువు కథ ఇలా మొదలైంది
మనసులను అదే కలుపుతుంది
నడుమ తలా తేరి తొలగునండి
వరస కలుపుతూ పలకరండి




తను వెతికిన పాట సాహిత్యం

 
చిత్రం: శైలజారెడ్డి అల్లుడు (2018)
సంగీతం: గోపీసుందర్
సాహిత్యం: సిరివెన్నెల
గానం: సత్య యామిని

తను వెతికిన తగు జత నువ్వేనని
కను తెరువని మనసుకి తెలుసా అని
బదులడిగిన పిలుపది నీదేనని
తెరమరుగున గల మది విందా అని

వెలుగేదో కనిపించేలా నిన్నే గుర్తించేలా
చుట్టూకమ్మే రేయో మాయో మొత్తం తిరగాలి
ఒట్టు అంటూ నమ్మించే నీ స్నేహం కావాలి

తను వెతికిన తగు జత నువ్వేనని
కను తెరువని మనసుకి తెలుసా అని
బదులడిగిన పిలుపది నిదేనని
తెరమరుగున గల మది విందా అని

ఉరికే అల్లరి ఉడికే ఆవిరి
ఎవరు నాసరి లేరను వైఖరి
పొగరనుకో తగదనుకో సహజగుణాలివి
కలగనుకో వరమనుకో వరకట్నాలివి
వడుపుగవరస కలిపి
మహాశయా మఘువనేలుకో...

నిను కలవక గడవదు కద కాలము
నిను కలవక నిలువదు కద ప్రాణము

కన్నె కళ్యాణికి కళ్ళెము వెయ్యవ
అతిగారానికి అణుకువ నేర్పవ
కసురుకొనే కనుబొమలో కలహం ఓడని
బిడియపడే ఓటమిలో గెలుపును చూడని
చెలియక చెలిమి కలిపి తలప తడిమి తడిమి తెలుసుకో

అదుపెరుగని దివిగంగని నేనట
అతిశయమున ఎగసిన మది నాదటా
వడుపెరిగిన శివుడవు నీవేనట
జడముడులతొ నిలుపగ నను నీ జత

పనిమాల బ్రతిమాలావ ప్రేమ పలకవదేల
నువ్వే నువ్వే నువ్వే నువ్వే కావాలంటున్నా
పట్టు విడుపు లేనేలేని పంతం ఇంకానా


No comments

Most Recent

Default