చిత్రం: టిక్ టిక్ టిక్ (2018)
సంగీతం: డి.ఇమ్మాన్
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: హరిచరణ్
నటీనటులు: జయం రవి, నివేద పేతురాజ్
దర్శకత్వం: శక్తి సుందర రాజన్,
నిర్మాత: నేమిచంద్, ఝబాక్
విడుదల తేది: 22.06.2018
కన్నయ్యా..ఆఆ.. కన్నయ్యా..ఆఆఅ...
కన్నయ్యా..ఆఆ.. కన్నయ్యా..ఆఆఅ...
పసివాణ్ణయ్యా నీకై పరుగే నేర్చా నీకై
పగలే తెచ్చా వెన్నెలనే
మల్లిగ విరిసా నీకై జల్లుగ కురిసా నీకై
మంచుగా మార్చా వేసనివే
హరివిల్లును బైకుగ మార్చేసీ తిరిగేద్దాం
జాబిల్లిని మైకుగ చేసేసీ పాడేద్దాం పాడేద్దాం..
కన్నయ్యా ఆ నా హృదయం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ఉదయం నువ్వేరా ఆఆ.
కన్నయ్యా ఆ నా లోకం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ప్రాణం నువ్వేరా ఆఆ
మింటిని మెరుపులు అన్నీ నీ కన్నుల్లో దాస్తా
కంటికి రెప్పగా నిన్నే కాస్తా
లోకమే ఏకంకానీ గెలుపే నాదిగ చేస్తా
ఓడుతూ గెలుపే నీకే ఇస్తా
సూర్యుని పూల బంతిలా చేసి ఆటే ఆడేయ్
చుక్కలమల్లె తోటలో విరుల సిరులే తోడెయ్
నీ అల్లరి చిల్లరి పల్లవులన్నీ వెల్లువ కావాలి
కన్నయ్యా ఆ నా హృదయం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ఉదయం నువ్వేరా ఆఆ.
కన్నయ్యా ఆ నా లోకం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ప్రాణం నువ్వేరా ఆఆ
ఆటలు నేర్చా నీకై పాటలు నేర్చా నీకై
నువ్వే బతుకై ఉన్నానే ఏఏ..
గువ్వై ఎగిరా నీకై మువ్వై మోగా నీకై
కమ్మని కలలే కన్నానే
అందమైన ఆనందాలన్నీ కొనసాగాలి
గుండె పూవుల ఊయల చేశాలే
నువ్వు ఊగాలి ఊగాలీ
కన్నయ్యా ఆ నా హృదయం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ఉదయం నువ్వేరా ఆఆ.
కన్నయ్యా ఆ నా లోకం నువ్వేగా ఆఅ
కన్నయ్యా ఆ నా ప్రాణం నువ్వేరా ఆఆ
No comments
Post a Comment