చిత్రం: బేవార్స్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: హేమచంద్ర, దివ్య
నటీనటులు: హర్షిత , రాజేంద్రప్రసాద్, సంజోష్
దర్శకత్వం: రమేష్ చెప్పల
నిర్మాత: పొన్నాల చందు
విడుదల తేది: 12.10.2018
ప్రేమ చిటికెలు వేసే క్షణం
ప్రతి గుండె గలగల కోలాహలం
హాయి పిలుపులు తాకే క్షణం
ప్రతి రోజు మిల మిల బృందావనం
చీకట్లనే వదిలించేయగా
సంతోషమే వెలుగై వాలగా
పెదవంచు ప్రమిదల్లో నవ్వు కిలకిల
కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా
కాలమంత ఆగదా ఆనంద కేళి
గంతులేసి ఆడగా
తారా జువ్వల్లాగా
ఈ మనసు ఎగిరెనీ వేళా
తారలు దివ్వెల్లాగా ధగధగ
దారంత మెరిసెను చాలా
హే... ఊహలోనే ఉండిపోతే
వెళ్ళిపోదా జీవితం
చేతులారా అందుకుంటే
అంతులేని సంబరం
అరె ఎటుగాలి వీస్తుంటే అటువైపుగా
వెళ్ళిపోతే ఏముంది సరికొత్తగా
అనుకున్న దారుల్లో అడుగేయగా
అసలైన గెలుపొచ్చి ముద్దాడదా..
హే హే.. కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా
హే కాలమంత ఆగదా ఆనంద కేళి
గంతులేసి ఆడగా
అనురాగం అల్లరి చేసేయ్
అనుబంధం చిందులు వేసేయ్
సరదాలకి తలపుల తీసేయ్
నడి రేయికి రంగులు పూసేయ్
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
హే చీకటేళ దీపమల్లె
వచ్చిపోవే వెన్నెలా
తళుకులీనె సొగసుతోటి
లాగుతావే నన్నిలా
నీలోనే కళకళలు చూడాలనీ
నీ చెంత చేరాను కావాలనీ
ఆ వెన్నముద్దల్లే వెలగాలనీ
నీకిచ్చుకున్నాను నా మనసునీ
హే హే కాంతి పూల పండగా దీపావళి
కంటి పాప నిండుగా
కాలమంత ఆగదా ఆనంద కేళి
గంతులేసి ఆడగా
నీ చుట్టూ భూచక్రంలా
తిరిగానే నిజమా కాదా
విరజిమ్మే నవ్వులు చూస్తే
ఎదగూటికి పున్నమి రాదా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
పండగ పండగ పండగ పండగ
దీపావళి పండగా
చిత్రం: బేవార్స్ (2018)
సంగీతం: సునీల్ కశ్యప్
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
గానం: హేమచంద్ర, దివ్య
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను
శవమల్లే మిగిలానమ్మా
నా ఇంట నువ్వుంటే మాయమ్మే ఉందంటూ
ప్రతి రోజు మురిసేనమ్మా..! ఆఆ...
ఏ జన్మలో పాపమే నేను చేశానో
ఈ శిక్షే వేశావమ్మా...
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను...
శవమల్లే మిగిలానమ్మా
ఓఓ ఓఓ ఓఓఓ...
పొద్దున్నే పొద్దల్లే నువ్ నాకు ఎదురైతే
అదృష్టం నాదనుకున్నా
సాయంత్రం వేళల్లో నా బ్రతుకు నీడల్లో
నా దీపం నీవనుకున్నా
నా వెలుగంతా తీసుకెళ్లి ఏ చీకట్లో కలిపేశావే
నా ఆశల్ని మోసుకెళ్లి ఏ చితిలోన కాల్చేశావే
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను...
శవమల్లే మిగిలానమ్మా
లోకంలో నేనింకా ఏకాకినైనట్టు
శూన్యంలో ఉన్నానమ్మా
చిరుగాలిలో ఊగే ఏ చిగురు కొమ్మైనా
నీలాగే తోచేనమ్మా...
నీ నిశ్శబ్దం నా గుండెల్లో...
జలపాతమయ్యిందమ్మా
ఆ నీలి ఆకాశంలో ఏ నక్షత్రం అయ్యావమ్మా...
తల్లీ తల్లీ నా చిట్టి తల్లి
నా ప్రాణాలే పోయాయమ్మా
నువ్వే లేని లోకాల నేను
శవమల్లే మిగిలానమ్మా
No comments
Post a Comment