చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: చలం, విజయ లలిత, విజయ నిర్మల కథ, స్క్రీన్ ప్లే: రాజశ్రీ దర్శకత్వం: పెండ్యాల నాగాంజనేయులు నిర్మాత: టి.మోహన్ రావు విడుదల తేది: 01.19.1972
Songs List:
నీ పాపం పండెను నేడు పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నమ్మినవారికి నమ్మక ద్రోహం చేసినందుకు శిక్ష ఎప్పటికప్పుడు తప్పుడులెక్కలు రాసినందుకీ శిక్ష నీ డొక్క చించి నే డోలు కట్టి వాయించుటే నా దీక్ష నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము దెబ్బకు దెబ్బ చెల్లిస్తాను చూసుకో నా దమ్ము తలపొగరంతా తగ్గేదాక దులుపుతాను నీ దుమ్ము నీకోసమే నేనీ దినం ఎత్తేను ఈ అవతారం నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట యముణ్ణి నేను నీ కరక్టు మొగుణ్ణి నేను యా
రాజా పిలుపు నాదేనురా పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.జానకి రాజా పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీ వెంట ఉంటానురా నిను వీడి పోలేనురా నీ ముందు నే నిలిచినా చేరుకోలేనురా ఏ చోట నేనున్నా నీకోసమే నేనురా మరుజన్మలోనైనా నీదాననౌతానురా ఈ బంధము అనుబంధము కడలేని కథరా దొర పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా కరిగిన కల నేనురా రాజా కదలని శిలనైతిరా ఈ బంధము అనుబంధము కడలేని కథరా దొర
బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బల్లెమ్మ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు హేయ్ బుడిగీ (నవ్వు) బుడిగీ, బుడిగి, నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మా మాటాడు చిలకమ్మా నీకూ నాకూ జోడీ రాశాడు ఆ బ్రహ్మ నవ్వుల లోనా పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మ నువ్వేనే నా రాణి నీమీద ఒట్టమ్మా ఏయ్ అలా చూస్తావేం? ఎలా ఉంది వొళ్ళు కావాలా ? నోర్ముయ్ ఛీఫో నోటితోనూ పొమ్మంటున్నా చూపు నన్నే రమ్మంటుంది కన్నెపొగరు వద్దంటున్నా మనసు నన్నే కావాలంటుంది ఈ కోపం ఈ పంతం అంతానాటకం ఏయ్ మీదపడ్తావేం ఒంటరిదాన్ననా వెంటపడ్తున్నావే ? నన్నే పట్టుకుంటావా? నీకెన్ని గుండెలు ? ఛీ ఫో గుండెలోనా గాలమేసీ ఒడుపుగానూ దోచావునన్ను అడుగుదాటి కదలనీను నీడలాగా ఉంటాను నేను నీ అలక నా పులక పెనవేసుకోవాలి హేయ్ నీకూ నాకూ జోడీ రాశాడు ఆ బ్రహ్మ
కురిసింది వాన నా గుండెలోన పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, పి. సుశీల కురిసింది వాన నా గుండెలోన నీ చూపులే జల్లుగా కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా ముసిరే మేఘాలు కొసరే రాగాలు కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను తొలకరి వయసు గడసరి మనసు నీ జత కోరేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను అల్లరి చేసే ఆశలు నాలో పల్లవి పాడేను చలిగాలి వీచే గిలిగింత దోచే కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా ఉరకలు వేసే ఉహలు నాలో గుసగుస లాడేను కథలను తెలిపే కాటుక కనులు కైపులు రేపెను ఉరకలు వేసే ఊహలు నాలో గుస గుస లాడేను బిగువు ఇంకేలా దరికి రావేలా కురిసింది వాన నా గుండె లోనా నీ చూపులే జల్లుగా
హోయ్ డియ్యారే టింగు రంగ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: యస్.పి.బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి హోయ్ డియ్యారె టింగురంగా చూసూకోమావాఁ ఢీ కొడతా నీతోనేనూ కాసుకోమావాఁ హోయ్ ఏస్తా ఎత్తుకు పై యెత్తు సేత్తా సూడు నినుసిత్తు సూపిత్తాను గమ్మత్తు ఒదిలిస్తాను నీ మత్తు ఏసాలెన్నో ఏ సేవోయ్ మోసాలెన్నో చేసావోయ్ తాడిని ఎక్కేవాడుంటే ఆ తలదన్నేవాడున్నాడు కప్పను మింగే పాముంటే ఆ పామును తన్నే గ్రద్దుంది ఎలుగును మూసే సీకటివుంది నవ్వుని మించే ఏడుపు ఉంది ఆ.... ఓడలు బళ్లు అవుతాయి బళ్ళే ఓడలు అవుతాయి బొమ్మే బొరుసైపోతుంది ఆ.... బొరుసే బొమ్మైపోతుంది డియ్యారే టింగురంగా చూసుకోమా.. ఢీకొడతానీతోనేను కాసుకోమావాఁ సిరులే స్వర్గం అనుకున్నావు నరకమదేనని మరిసావు ఓ.......... చెమ్మిని తిమ్మిని చేస్తాము తిమ్మిని బమ్మిని చేస్తాము మంచికి మేమూ జే కొడతాము వంచనకే నామాలు పెడతాము డియ్యారే టింగురంగా నీకు జేజేలు ఢీకొడతా నీతోనేను నీకు నామాలే అహ మూడునామాలే అహ పంగనామాలే అహ పంగనామాలే అహ పంగనామాలే అహ మూడునామా లే అహ పంగనామాలే
జిందాబాద్ స్వతంత్ర భారత జిందాబాద్ పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: రాజశ్రీ గానం: జిందాబాద్ స్వతంత్ర భారత జిందాబాద్
అమ్మ అన్నది ఒక కమ్మని మాట పాట సాహిత్యం
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరథి గానం: యస్.పి.బాలు, పి.సుశీల పల్లవి: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 1 దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు దేవుడే లేడనే మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకూ ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది - ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 2 అమ్మంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా.. అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట చరణం: 3 అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే అంగడిలో దొరకనది అమ్మ ఒక్కటే అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కటే అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా... మమతలమూట
No comments
Post a Comment