చిత్రం: చాణక్య చంద్రగుప్త (1977)
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు , పి.సుశీల
నటీనటులు: యన్. టి.రామారావు, ఏ.ఎన్. ఆర్, శివాజీ గణేషన్, జయప్రద, మంజుల, ఎస్.వరలక్ష్మి
నిర్మాత, దర్శకత్వం: యన్. టి.రామారావు
విడుదల తేది: 25.08.1977
పల్లవి:
హ..హ..హ..హ..హ
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో
పలికెనులే.. హృదయాలే..
పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో
చరణం: 1
వసంతాలు దోసిట దూసి.. విసిరేను నీ ముంగిలిలో
తారలనే దివ్వెలు చేసి.. వెలిగింతు నీ కన్నులలో
నీవే నా జీవనాడిగా...ఆ..ఆ
నీవే నా జీవనాడిగా.. ఎగిసేను గగనాల అంచులలో..
ఓ..ఓ.. విరియునులే ఆ గగనాలే.. నీ వెన్నెల కౌగిలిలో.. ఓ..ఓ..ఓ
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ
చరణం: 2
ఉరికే సెలయేరులన్నీ... వొదిగిపోవు నీ నడకలలో
ఉరిమే మేఘా..ఆ.ఆ లన్నీ.. ఉలికి పడును నీ పలుకులలో
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ..ఆ
నీవే నా పుణ్యమూర్తిగా..ఆ.. ధ్యానించు నా మధుర భావనలో..
ఓ..ఓ.. మెరియునులే ఆ భావనలే.. ఇరు మేనుల అల్లికలో..ఓ..ఓ
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ
ఆ..ఆ.. పలికెనులే.. హృదయాలే..
తొలివలుపుల కలయికలో.. ఓ..ఓ..ఓ..
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..
చిరునవ్వుల తొలకరిలో.. సిరిమల్లెల చినుకులలో..ఓ
****** ******* ******
చిత్రం: చాణక్య - చంద్రగుప్త (1977)
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
ఎవరో అతడెవరో...??
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ ఆ చంద్రుడు ఎవరో..ఓ..ఓ..ఓ
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో..
ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో..
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో..
ఈ రాచ తోటలో ఓ..ఓ. వున్నాడో..
ఏ..రతనాల కోటలో కొలువున్నాడో..
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ
చరణం: 1
పదములలో నా..ఆ.. హృదయమున్నదో
హృదయమే తడబడీ అడుగిడుతున్నదో..
పదములలో నా..ఆ.. హృదయమున్నదో
హృదయమే తడబడీ అడుగిడుతున్నదో..
ఏ..పున్నమికై..ఈ కలువ వున్నదో..
ఏ..పున్నమికై.. ఈ..కలువ వున్నదో..
ఏ..రేని పూజకు ఈ చెలువ ఉన్నదో..
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ
ఆ చంద్రుడు ఎవరో..
ఎవరో..ఓ..ఓ..ఓ..ఆ చంద్రుడు ఎవరో..
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో..
చరణం: 2
మనసు గీసినది కనరానీ రూపం
కనులు అల్లినది అనుకోని గీతం మూ..మూ..మూ..మూ
మనసు గీసినది కనరానీ రూపం
కనులు అల్లినది అనుకోని గీతం
చంద్ర..
తీయనీ ఏ తలపో..ఓ..ఓ..ఓ..ఈ కలవరింత..
తెలియని ఏ వలపో..ఓ..ఓ..ఓ.ఈ పులకరింతా
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ.. ఆ చంద్రుడు ఎవరో..
ఆ వీర చంద్రుడు ఎవరో..ఎవరో..
ఎవరో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ
No comments
Post a Comment