Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Hema Hemeelu (1979)




చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
నటీనటులు: నాగేశ్వరరావు, కృష్ణ, విజయ నిర్మల, జరీనా వాహేబ్
దర్శకత్వం: విజయ నిర్మల
నిర్మాత: కృష్ణ ఘట్టమనేని
విడుదల తేది: 23.03.1979



Songs List:



నువ్వంటే నాకెంతో ఇష్టం పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, యస్.పి. శైలజ  

పల్లవి:
నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం
నేనంటే ఎందరికో ఇష్టం

Red Lion Red Lion... Reach us to Red Lion 

చరణం: 1
జూ... జూ... లలలా...ల...
జూ... జూ...

నీ పేరంటే... ఎందరికో... భయం
నీ తోడుంటే... నాకేమో ప్రియం
నీ పేరంటే... ఎందరికో... భయం
నీ తోడుంటే... నాకేమో ప్రియం

నీ మాటే మధురసం... నీ నడకే పాదరసం
నీ మాటే మధురసం..హహ..హా... నీ నడకే పాదరసం

మధురసం కోరుకుంటే... మరేమి పరవాలేదు
పాదరసం తాగావంటే... ప్రాణానికే నష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం

నువ్వంటే నాకెంతో ఇష్టం... Is it?
జువ్ జువ్వునలాగే నీ చూపంటే మరీ మరీ ఇష్టం
నువ్వంటే నాకెంతో ఇష్టం

Red Lion Red Lion... Reach us to Red Lion 

చరణం: 2
పా..పప... లలలా...లల...
పా... పప...

నీ సొగసంటే... ఎందరికో.. నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా

నీ సొగసంటే... ఎందరికో... నిషా.. అది చూస్తుంటే... నాకేమో తమాషా

నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ
నీ పరువం నాగిని... అది నీతోనే ఆగనీ

మాటలతో కవ్విస్తే... మనసు ఊరుకోదు
తాపం మరింత పెరిగితే... తట్టుకోవడం కష్టం

నువ్వంటే నాకెంతో ఇష్టం
జువ్ జువ్వునలాగే నీ చూపంటే.. మరీ మరీ ఇష్టం

నేనంటే ఎందరికో ఇష్టం
నన్నెదిరించే మొనగాడంటే నాకెంతో ఇష్టం
నువ్వంటే నాకెంతో... ఇష్టం... 




ఏ ఊరు?... నీదే ఊరు? పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
ఏ ఊరు?... నీదే ఊరు?
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ

ఆకాశంలో ఉన్న చందమామని
నీ కోసం దిగివచ్చిన మేనమామని
ఆకాశంలో ఉన్న చందమామనీ
నీ కోసం దిగివచ్చిన మేనమామనీ
వరస కలుపుకొందామా.. సరసమాడుకొందామా

ఏ ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ అందగాడా
మా ఊరు వచ్చావు సందకాడ

లు లు లూ..లు లు లూ..
హా..హే..లు లు లూ..
హా..హా..లు లు లు.. 

చరణం: 1
నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నీలిమబ్బు కోక చుడతా.. తోక చుక్క రైక పెడతా
నాపేన చంద్రహారం నీకు చేయిస్తా
ఏమిస్తావూ? ఊ..ఊహూఊ..నన్నేం చేస్తావు?

మీ ఊళ్ళో చుక్కలు దులిపి... మా ఊళ్ళో గుక్కలు తడిపి
మీ ఊల్లో చుక్కలు దులిపి... మా ఊల్లో గుక్కలు తడిపి
ప్రేమిస్తే.. పెగ్గుకటి ఇస్తా..  ముద్దొస్తే.... ముద్దర వేస్తా..

పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..
పడుచందం పందిరివేస్తా..పందిట్లో విందులు చేస్తా..

ఏ..ఊరు..నీదే ఊరు..
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ

లు లు లూ.. లులుల్లూ లు లు లూ
లు లు లూ..లులుల్లూ లు లు లూ
హా..హే..ఆ..హే..లు లు లూ... 

చరణం: 2
మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
మల్లెలతో అల్లరి పెడతా... వెన్నెలతో ఆవిరి పడతా
అందాల ఆగ్రహారం నీకు రాసిస్తా..
ఏం చేస్తావో? ఉహు..హూ..హూ.... నన్నేం చేస్తావో?

నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
నింగిలాగ నేలకి వంగి..నీరులాగ మబ్బున దాగి
గెలిపిస్తే... ఉరుమై వస్తా..జడిపిస్తే... పిడుగైపోతా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా
వరదొస్తే వంతెన వేస్తా.. సరదాగా సంకెల వేస్తా

ఏ..ఊరు..నీదే ఊరు
ఏ ఊరు..ఏ వాడ..అందగాడా
మా ఊరు వచ్చావు సందెకాడ




అవ్వాయ్ చువ్వాయ్ పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

కోరస్:
సిలకా, సిలకా గోరింకా
సిలకా నవ్వితే నెలవంక
సిలకా సిలకా గోరింకా
గోరింక నొక్కితే నెలవంక

పల్లవి:
అవ్వాయ్ చువ్వాయ్ అమ్మాయి పెళ్ళికి
కూకూ సన్నాయి పాడే కోయిలలున్నాయి
ఆడే నెనుళ్ళున్నాయి ..
అందాల చందాల అబ్బాయి పెళ్ళికి మంత్రాలున్నాయి.
సిట్టమంత్రాలున్నాయి మేళతాళాలున్నాయి
అందాల గందాలు చిలకాల
చెలిగాలి కతగాడు వొణకాల
నాకళ్ళ ఆ కళ్ళు పెరగాల
చెలివొళ్ళు పరవళ్ళు తిరగాల
ఎప్పుడొచ్చాడమ్మ మబ్బుల్లో సూరీడు
ఆ వాడి చూపుల్లో తారాడగా
నావాడి చూపల్లో తారాడగా
ఎన్నడొచ్చిందమ్మ నింగిలో చుక్క
కన్నెచెక్కిలి నన్నె ముద్దాడగా
నాకన్నె చెక్కిలి నన్నె ముద్దాడగా
నడుమెక్కడంటూ నన్నడుగుతుంటే
జడకేమి చెప్పాల పూల జడకేమి చెప్పాల
ఒడిసి పట్టే చేతి ఒడుపెక్కడుందో
నడుమక్కడేనని చెప్పాల విప్పిచెప్పాల
.మసక పడ్డావేశ మనసెక్కడంటూ
నేనేడ వెతకాల నేనెవరినడగాల
తెల్లచీర కట్టి మల్లెపూలూ పెట్టి
పిల్లదొస్తే దాన్ని అడగాల పిల్ల అలగాల.....




నీ కోలకళ్ళకి నీరాజనాలు పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

పల్లవి:
నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు
ఈ కోపతాపాలకు ఆ తీపి శాపాలకు
ఈ కోపతాపాలకు ఆ తీపి శాపాలకు
అందించనా నీకు హరిచందనాలు?

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు 

చరణం: 1
కోటేరులాంటి ఆ కొస ముక్కు... 
ప్రొద్దు నిద్దర లేచినట్టు ఆ బొట్టు
మిసమిసలు పసిగట్టి కసిపట్టి బుసకొట్టే.
పగడెత్తు పైటున్న ఆ చీరకట్టు

జిగినీల జాకెట్టు సొగసైన లాకెట్టు
జిగినీల జాకెట్టు.హో .సొగసైన లాకెట్టు... 

విడిచి పెడితే బెట్టు... నా మీద ఒట్టు 

నీ కొంటె కవితకి నీరాజనాలు
ఆ వాడి చూపుకు అభివందనాలు
ఈ ఆపసోపాలకు.ఆ విరహ తాపాలకు
ఈ ఆపసోపాలకు ఆ విరహ తాపాలకు 
అందించనా నేను సుస్వాగతాలు? 

నీ కొంటె కవితకి... నీరాజనాలు
ఆ వాడి చూపుకు... అభివందనాలు 

చరణం: 2
నీ వలపే ...ఉసి గొలుపు... 
నా చెలిమే చేయి కలుపు
పొలిమేరలో పిలుపు... 
పులకింతలే రేపు...

జడలోని మల్లికలు జవరాలి అల్లికలు
చలి పెంచే కోరికలు జాబిలితో కలయికలు

ఈ ఆరుబయటా అందాల అల్లరులు
ఈ పూట నాలో పలికించే కిన్నెరలు
కలిసిపోనా ఏరు నీరై నేనింక నీవై నీవింక నేనై...

నీ కోలకళ్ళకి నీరాజనాలు
ఆ వాలు చూపుకు అభివందనాలు




అందాల శిల్పం కదిలింది నీలో పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలు, పి.సుశీల 

అందాల శిల్పం కదిలింది నీలో
శృంగార దీపం వెలిగింది నాలో
అనురాగం గీతం పలికింది నీలో
మధురా బృందావని వెలిసింది నాలో

నీ నీల నయనాలు నాలోని గగనాలు
నీ చూపులే వలపు సూర్యోదయాలు
నీ పారాణి చరణాలు ముద్దాడు చరణాలు
నా పాట పలవి నీ లేత పెదవి
నీ కవితలో నే కల్పనై
నీ యువతకే ఆలాపనై
నీ మమత నా మధుమాసమే
నా ఎడదలో సుమగీతమై
సరవశించనీ ఈ క్షణం
పరిమళించనీ అనుదినం ....

నీ వొంపులో హంపి శిల్పాల నాట్యాలు
నా వయసులో కలికి చంద్రాతపాలు
నీ రేరాణి కిరణాలు తారాడు తరుణాన
స్రతరేయి పున్నమి పులకింత నీవే.....
నా ఊపిరే నీ వేణువె
ప్రాణమై
నా బ్రతుకే నీ పద రేణువై
నీ నాదమే నీ దాని నె
జలదరించనీ జవ్వనం
సంగమించనీ జీవనం ....




చార్మీనార్ కాడ పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలు, ఆనంద్ 

చార్మీనార్ కాడ
మోగింది డోలువెబ్బ....
గోలుకొండ అదిరి పెట్టింది గావు బొబ్బ
ఓహ్ ఐశబాష్
ఐరబ్బా మనకు షరా మామూలు
ఎవరికి వారే హేమా హేమీలు
తీగమీద పిల్లుంటే పిల్ల మీద కళ్ళుంటే
ఆ కళ్ళల్లో మగత పొరలు కమ్ముతుంటే
తను ఒళ్ళు మరచి ఆడ మగా ఊగుతుంటే
పట్ట పగలైనా కోటి చుక్కలను పొడిపిస్తాను
ఆ చుక్కలు కనపడకుండా చక్రమడ్డువేస్తాను॥

మబ్బుల్లో కోట ఉంటే 
కోటకే కొమ్ములుంటే
ఆ కొమ్మల్లో ముత్యాల గూర్తుంటే
ఆ గూటిలో వజ్రాల చిలకుంటే -
అది పట్టుకుందామనీ -
అది పట్టుకుందామనీ - పై పైకి ఎగబాకితే
చిలక ఎగిరిపోంతుది -
చెయ్యి మిగిలిపోతుంది ....




పున్నమి వెన్నెల ప్రేమించిందీ పాట సాహిత్యం

 
చిత్రం: హేమా హేమీలు (1979)
సంగీతం: రమేశ్ నాయుడు
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ 
గానం: యస్.పి.బాలు

పున్నమి వెన్నెల ప్రేమించిందీ
జాబిలి చల్లని దేవుడని
ఆ చల్లని జాబిలి నల్లని హువు
ఎన్నటికీ కాకూడదని
దీవిస్తున్నా వెన్నెలనీ ॥
పున్నమి వెన్నెల ప్రేమించిందీ
జాబిలి చల్లని దేవుడని
ఆ చల్లని జాబిలి నల్లని రాహువు
అయినాడొక పున్నమినాడు
ఆ దీవెన ఎవరిదనీ....
తారలు పొదిగిన బీటానికై
దాగి ఉన్నదొక త్రాచు
ఆ త్రాచు పడగ తన నీడని నమ్మే
పసి పాపను కాచేదెవరు...!
మసి పూసిన మనషితో చూస్తే
తెలుపే నలుపుగ కనబడుతుందీ
జాబిలి రాహువు పోరాటంలో
వెన్నెల బ్రతుకే బలి అవుతుందీ....
రవినే మింగిన రాక్షస రాహువు
వెన్నెల చెలికాడవుతాడా....?
కాటేసే కరినాగు కోరలో
గరళం కాక పాలుంటుందా....?
వెన్నెల బ్రతుకును చీకటి చేసిన
అమావాస్యకూ హృదయం వుందా
చీకటి ముసుగున చేసే మోసం
పగటి వెలుగులో బ్రద్దలు కాదా....?


No comments

Most Recent

Default