చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె (All)
గానం: ఎస్.పి.బాలు, సుశీల
నటీనటులు: శోభన్ బాబు, జయప్రద, జయసుధ, చంద్రకళ,శరత్ బాబు
మాటలు: సముద్రాల జూనియర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.విశ్వనాధ్
నిర్మాత: డి.వి.ఎస్.రాజు
విడుదల తేది: 1977
పల్లవి:
చిలకపచ్చని చీరలోనా... చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
చిట్టమ్మి... నీ మీద ఒట్టమ్మి...హహహహహహ
చిలకపచ్చని చీరలోనా... చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... హహహహహహహా
చిలకపచ్చని చీరలోనా....
చరణం: 1
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
సిగ్గులన్ని మూటగట్టీ నీ బుగ్గ మీదా దాచుకో
నా పెదవులు నిన్నడిగితే... ముడుపుగా ఇచ్చుకో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చే ఆ ఘడియకై... ఎన్నెన్ని ఎదురుచూపులో
ఇచ్చిన ఆ వేళలో... ఎన్నెన్ని తీపి మెరుపులో
చిలకపచ్చని చీరలోనా చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్విందా.. చిటికేసి పిలిచిందా
ఎందుకని... ఓరబ్బి ఎవరికని... లరలరలరలరలర
చిలకపచ్చని చీరలోనా....
చరణం: 2
చల్లని నీ రూపమే... నా కళ్ళలోనీ కాటుకా
చల్లని నీ రూపమే... నా కళ్ళలోనీ కాటుకా
పచ్చని నా పరువమే... నీ దోసిట కానుక
నీ కాటుక కన్నులే... నా కలలకు పొదరిల్లు
నీ కాటుక కన్నులే... నా కలలకు పొదరిల్లు
వేసేను ఆ కలలే... విడిపోని మూడుముళ్ళు
చిలకపచ్చని చీరలోనా... చిగురుమెత్తని పడుచుదనం
చిరునవ్వు నవ్వింది.. చిటికేసి పిలిచింది
ఎందుకని... ఓరబ్బి ఎవరికని...
ఇందుకని... చిట్టమ్మి ఇందుకేనని
****** ******* ******
చిత్రం: జీవిత నౌక (1977)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: సినారె
గానం: సుశీల
పల్లవి:
వేయి దీపాలు నాలోన వెలిగితే
అది ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
అది ఏ రాగం.. ఆ అనురాగం..
చరణం: 1
ఈ చీకటి కన్నుల వాకిలిలో.. ఓ.. వెలుగుల ముగ్గులు వేసేదెపుడో
ఆ వెలుగుల మంగళవేదికపై.. నా వేణులోలుని చూసేదెపుడో
చూడలేని నీ కన్నులకూ.. ఎదురుచూపైనా ఉందొకటి
చూడగలిగే నా కన్నులకు.. చుట్టూ ఉన్నది పెనుచీకటి..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..
చరణం: 2
సుడివడిపోయే జీవితనౌక.. కడలితీరం చేరేదెపుడో
కలగా తోచే ఆశారేఖ.. నిజమై ఎదురై నిలిచేదెపుడో
వేచి ఉన్న నీ హృదయంలో.. రేపటి ఉదయం మెరిసింది
వేగిపోయే నా గుండెలో.. గతమే స్మృతిగా మిగిలింది..
వేయి దీపాలు నాలోన వెలిగితే
ఏ రూపం.. నీ ప్రతిరూపం
కోటి రాగాలు నా గొంతు పలికితే
ఏ రాగం.. ఆ అనురాగం..
No comments
Post a Comment