Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

K. Raghava (Producer)



తెలుగు చలన చిత్రసీమలో ఓ శకం ముగిసింది. ప్రముఖ నిర్మాత కె. రాఘవ (105) నిన్న రాత్రి (31.07.2018) కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఘవ 1913లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని కోటిపల్లిలో జన్మించారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. సినిమా రంగానికి ‘కష్టేఫలి’ అనే మాట బాగా వర్తిస్తుందనడానికి రాఘవనే నిదర్శనం. బీదరికం కారణంగా తన 9 వ ఏట ఇంట్లోంచి పారిపోయి దొంగల బండి ఎక్కి కలకత్తా చేరుకున్నారు. కలకత్తాలో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు రాఘవ. ఆ తర్వాత ముంబైలో కొద్దికాలం ఫిల్మ్ ప్రోసెసింగ్ యూనిట్ లో వర్క్ చేశారు. విజయవాడ మారుతీ టాకీస్ లో కస్తూరి శివరావు దగ్గరా పనిచేశారు. చెన్నపట్నం చేరి కెమెరా ట్రాలీ బోయ్ గా, స్టంట్స్ నేర్చుకుని  స్టంట్ మాస్టర్ గా మారారు 'పాతాళ భైరవి' సినిమాకు స్టంట్ మాస్టర్ గా వ్యవహరిస్తూ సినిమాలకు మౌత్ పబ్లిసిటీ చేసే వ్యక్తిగా కూడా పనిచేశారు డూప్ గా కూడా చేశారు… బతకడం కోసం రకరకాల పనులు చేస్తూ… చివరకు ప్రొడక్షన్ మేనేజర్ అవతారం ఎత్తారు, వివిధ ప్రాంతాల్లో పనిచేయడం వల్ల తొమ్మిది భాషలు తెలిసిన కారణంగా ఎంజిఎం వారికి  'టార్జాన్ గోస్ టు ఇండియా' చిత్రానికి ప్రొడక్షన్ మేనేజర్ గా విదేశాల్లో షూటింగ్ నిర్వహించే సామర్ధ్యం ఏర్పరుచుకున్నారు. వారు ఇచ్చిన పది లక్షల రూపాయల పారితోషకంతో  'సుఖ దుఃఖాలు' చిత్రానికి ఒక నిర్మాత అయ్యారు,  ఆ తర్వాత మిత్రుల సహకారంతో ‘జగత్ కిలాడీలు, జగత్ జంత్రీలు, జగత్ జెట్టీలు’ సినిమాలు నిర్మించారు.

తరువాత ప్రతాప్ ఆర్ట్స్ బ్యానర్ నెలకొల్పి. ఎస్.వి.రంగారావుతో ఉన్న పరిచయం ఉపయోగించుకొని   ‘తాతా మనవడు’ చిత్రాన్ని నిర్మిస్తూ  దాసరి నారాయణరావుకు దర్శకుడిగా తొలి అవకాశం కల్పించారు, ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’తో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేశారు. ఈ సినిమాలో చిత్రకధా రచయిత , మాటల రచయితగా కొనసాగే గొల్లపూడి మారుతీ రావుని నటునిగా పరిచయం చేశారు. దాసరి నారాయణరావు,  కోడి రామకృష్ణ ఇద్దరూ శతాధిక చిత్రాల దర్శకులు కావడం గొప్ప విశేషం. ‘సంసారం సాగరం’, ‘చదువు-సంస్కారం’, ‘తూర్పు-పడమర’, ‘అంతులేని వింత కథ’, ‘ఈ ప్రశ్నకు బదులేదీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను రాఘవ నిర్మించారు. ఆయన తెలుగుతో పాటు తమిళంలో ‘మైనర్ మా పిళ్ళై’, హిందీలో ‘ఇత్నీ సీ బాత్’ సినిమాలను కె. రాఘవ నిర్మించారు. సినిమా రంగానికి కొత్తవారిని పరిచయం చేయడంలో ముందుండే వారు.దాదాపు 30 చిత్రాలను ప్రొడ్యూస్ చేశారు, అంతేకాదు ఆయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు కూడా. కె. రాఘవ కు 2009లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డును అందించింది.


No comments

Most Recent

Default