చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: కృష్ణ , జయప్రద దర్శకత్వం: పి.సాంబశివరావు నిర్మాతలు: సత్యనారాయణ , సూర్యనారాయణ విడుదల తేది: 06.10.1978
Songs List:
అనురాగ దేవత నీవే పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు పల్లవి: అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే చరణం 1: ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ.. ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ.. నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం... అనురాగ దేవత నీవే..ఏ... చరణం 2: నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే.. నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే... నా దేవివై దీవించవే.. నా కోసమే జీవించు నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం... అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే.. అనురాగ దేవత నీవే..
సీతాకోక చిలుకలు పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు సీతాకోక చిలుకలు - స్వాతి వాన చినుకులు తడిమిన కొద్ది తళుకులు పడుచందాల పలుకులు ఈ జీవితం వసంతం - యవ్వనం ప్రేమగీతం ఆరు ఋతువులు - పూల ఋతువులే అన్ని పెదవుల - ప్రేమ మధువులే అనుభవించరా - పదే పదే పదే పదే లైఫనేది ఒక ఛాన్సురా లైఫుకు లైఫు రొమాన్సురా స్వీటీ లందరి బ్యూటీ చూసే డ్యూటీ నీదిరా అది పడుచోళ్ళ నీతిరా రామచిలుకనే తెచ్చుకో - ప్రేమ పలుకులే నేర్చుకో వెచ్చగ మచ్చిక చేసుకో - అచ్చిక బుచ్చిక లాడుకో నీ పులకరింతలే పువ్వులై - ఆ పువ్వులే పడుచు నవ్వులై ఆ నవ్యులే పూలబాటిలే సాగిపో బాటసారీ - చెప్పకోయ్ నీవు సారీ
నీ మాట వింటే పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, సుశీల పల్లవి: నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం చరణం: 1 కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన కలలెన్ని నే కన్నానో.. నాకున్న కన్నులు రెండైనా అలలెన్ని చెలరేగాయో.. ఏరంటి వయసే ఒకటైన కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను కడలేని కడలీ మనసు.. కలిసేటి నది నీ వయసు కలగన్న కలయిక లోనే.. కరగాలి నీవు నేను ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం ఇది రెండు తనువుల ప్రాణం.. ఒకటైన జీవన రాగం నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం చరణం: 2 నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను నీలాల నింగిలో చుక్కా ఏనాడు చెక్కిట పొడిచేను ఆ తారలే తలంబ్రాలై.. ఏ రోజు తలపై కురిసేను తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను తొలి పొంగు కోరికలన్నీ మన కొంగు ముడిపెడుతుంటే ఇల దాటి.. జాబిలి దాటి.. కలవాలి నీవు నేను ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం ఇది కాలమాగిన సమయం.. ఏ లోకమెరుగని ప్రణయం నీ మాట వింటే మదిలో గుడి గంటగా పలికింది నీ జంట ఒంటరి ఎదలో చలిమంటగా రగిలింది ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం ఇది జోడు వీణల రాగం.. హృదయాల కుసుమ పరాగం
విచ్చుకున్నా గుచ్చుకున్నా... పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి. బాలు, సుశీల పల్లవి: విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే చరణం: 1 తలుపు గడియ అన్నది తెరుచుకోనని కౌగిలింత అన్నది కమ్ముకోమని తలుపు గడియ అన్నది తెరుచుకోనని కౌగిలింత అన్నది కమ్ముకోమని కొత్త చీర నలగాలని కోరుకున్నది ఆ.. కొత్త చీర నలగాలని కోరుకున్నది విరిపానుపు చెరగకుంటే.. పరువే కాదన్నది విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే చరణం: 2 వయసు చూస్తే ఆగనన్నది.. మనసు చూస్తే ఆకలన్నది పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది వయసు చూస్తే ఆగనన్నది.. హాయ్.. మనసు చూస్తే ఆకలన్నది పిల్లనడుమే ఊగుతున్నది.. పిల్లగాలి రేగమన్నది అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు అద్దె మొగుననుకోకు... ముద్దుకు తగననుకోకు ముద్దివ్వను పొమ్మనకు... అద్దెకు బకాయి పడకు అద్దెకొచ్చి ముద్దులంటే... అర్ధరాత్రి అల్లరే..అహ..హ.. హద్దు దాటి హద్దుకుంటే ఒళ్ళు కాస్త పచ్చడే.. పచ్చడే విచ్చుకున్నా గుచ్చుకున్నా... ఆ.. మొగలిపువ్వు అందమే... అహా.. నువ్వు కస్సుమన్నా బుస్సుమన్నా మొదటిరాత్రి బంధమే.. బంధమే విచ్చుకున్నా గుచ్చుకున్నా... మొగలిపువ్వు అందమే అహహహహా...
ఆగాలి ఆగాలి పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: బాలు, సుశీల పల్లవి: ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ.... తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు ఆగాలి ఆగాలి అమ్మాయీ గారూ.... తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు తగ్గాలి కాబోయె శ్రీమతి గారు ఆగదింక ఈ గాలి ఈ జోరు చరణం: 1 మాఘమాసం దాకా ఆగలేనూ తాళికట్టే దాక తాళలేను ..ఆహా మాఘమాసం దాకా ఆగలేనూ తాళికట్టే దాక తాళలేను మొహమాట పడకు.. నా మోహం పెంచకు మొహమాట పడకు.. నా మోహం పెంచకు ఈ మోహం ఈ దాహం మోయలేను కలలేకంటూ నిదుర కాయలేను ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు చరణం: 2 కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు మంచు కరిగి పోతోంది ఎండ వేడికి మనసు రగిలిపోతోంది కొండ గాలికి ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు చరణం: 3 మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు ఆ ఆ ... మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు ఆ చూపు చూడకు నా తాపం పెంచకు ఆ చూపు చూడకు నా తాపం పెంచకు ఆ తీపి ఈ తాపం ఓపలేనూ.. ఎదుటే ఉన్న తెరలు తీయలేను ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ లలల లలల లలల తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింక కాలేదు మా వారు ఆగాలి ఆగాలి అమ్మాయిగారూ లలల లలల లలల తగ్గాలి కాబోయె శ్రీమతి గారు అహా ఆగదింక ఈ గాలి ఈ జోరు
అగ్నిని నేను పాట సాహిత్యం
చిత్రం: కుమార రాజా (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, రామకృష్ణ అగ్నిని నేను - సుడిగాలిని నేను అన్నదమ్ములం కలిశాము - ఉన్నదమ్ములే చూపిస్తాం ఆడవిలో సీత కడుపున పుట్టిన కవలలం మేము లవకుశలం అయోధ్య రాముని సీతను కలిపే ఆంజనేయులు వీరాంజనేయులం అన్యాయానికి అధర్మానికి శతృవులం అనురాగానికి అభిమానానికి సేతువులం మంచికి బానిసలం వంచితులకు బంధువులం అగ్నిహోత్రమే భగ భగ మండే ఫాలనేత్రులం కఠిన చిత్తులకు మదోన్మత్తులకు కాళరాత్రులం తల్లి ఋణం తీరుస్తాం - తండ్రి చెఱను విడిపిస్తాం దెబ్బకు దెయ్యం దించేస్తాం - అబ్బకు బిడ్డల మనిపిస్తాం ఇదే మా శపథం ఇదే మా శపథం
No comments
Post a Comment