చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా నటీనటులు: కృష్ణ, కాంచన, బేబి శ్రీదేవి దర్శకత్వం: జి.వి.ఆర్.శేషగిరిరావు నిర్మాణం: మోడరన్ థియేటర్స్ 110 వ చిత్రం విడుదల తేది: 16.10.1971
సూపర్ స్టార్ కృష్ణ గారితో బేబీ శ్రీదేవి నటించిన సినిమాలు:
1. మా నాన్న నిర్దోషి (1970) - బేబీ శ్రీదేవి 2. విధి విలాసం (1970) - బేబీ శ్రీదేవి 3. అగ్నిపరీక్ష (1970) ) - బేబీ శ్రీదేవి 4. అత్తలు కోడళ్లు (1971) - బేబీ శ్రీదేవి 5. నేనూ మనిషినే (1971) - బేబీ శ్రీదేవి 6. రాజమహల్ (1972) - కుమారి శ్రీదేవి 7. మేనకోడలు (1972) - కుమారి శ్రీదేవి 8. మల్లమ్మ కథ (1973) - బేబీ శ్రీదేవి 9. మమత (1973) - బేబీ శ్రీదేవి 10. మీనా (1973) - బేబీ శ్రీదేవి 11. కొత్తకాపురం (1975) - బేబీ శ్రీదేవి 12 దేవుడులాంటి మనిషి (1975) - కుమారి శ్రీదేవి (1972 లో రిలీజ్ అయిన సినిమాల్లో కుమారి శ్రీదేవి అని టైటిల్స్ లో ఉంది, కానీ 1973 లో రిలీజైన మల్లమ్మ కథ, మమత, మీనా సినిమాలో, 1975 లో రిలీజైన కొత్తకాపురం సినిమాల్లో మాత్రం బేబీ శ్రీదేవి అని ఉంది, అంటే బహుశా ఈ సినిమాలు రిలీజ్ ఆలస్యం అయ్యుంటుంది)
Songs List:
ఏది ఇలలోన అసలైన న్యాయం పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు పల్లవి: ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం మనిషి పగబూని చేసేది నేరం ఎపుడు దిగిపోని పెనుపాప భారం ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం చరణం: 1 కాలమే నిన్ను కవ్వించెనేమో కోపమే నిన్ను శాసించనేమో కాలమే నిన్ను కవ్వించెనేమో కోపమే నిన్ను శాసించెనేమో శిక్ష విధియించు నీ చేతితోనే కక్ష సాధించ విధి వ్రాసెనేమో మనసు పొరలందు పెరిగే కళంకం కడిగినా మాసిపోలేని పంతం మనిషి పగబూని చేసేది నేరం ఎపుడు దిగిపోని పెనుపాపభారం ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం చరణం: 2 గమ్యమే లేని పెనుకాన లోన కళ్ళు పొరగమ్మి పొరబారినావా గమ్యమే లేని పెనుకాన లోన కళ్ళు పొరగమ్మి పొరబారినావా అచట లేదోయి ఏ కాలి బాట కానరాదోయి ఏ పూల తోట అచట కరిచేను రాకాసి ముళ్ళు అపుడు కురిసేను కన్నీటి జల్లు మనిషి పగబూని చేసేది నేరం ఎపుడు దిగిపోని పెనుపాపభారం ఏది ఇలలోన అసలైన న్యాయం తేల్చగలిగేది కనరాని దైవం తేల్చగలిగేది కనరాని దైవం తేల్చగలిగేది కనరాని దైవం
చూసెనులే నా కనులే పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: చూసెనులే నా కనులే చూడని వింతా చూడగనే ఝల్లుమనే నా మనసంతా దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని చూసెనులే నా కనులే చూడని వింతా చూడగనే ఝల్లుమనే నా మనసంతా దోచిన ఆ చూపులనే దాచుకుంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని.. చరణం: 1 పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు కానరాని ముల్లు ఎదలోన నాటినాడు పువ్వులాగ నవ్వి నా పొంత చేరినాడు కానరాని ముల్లు ఎదలోన నాటినాడు ముళ్ళులేని గులాబిలు ముద్దులొలుకునా ఉరుము లేక మెరుపు లేక వాన కురియునా చూసెనులే నా కనులే చూడని వింతా చూడగనే ఝల్లుమనే నా మనసంతా దోచిన ఆ చూపులనే దాచుకుంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని.. చరణం: 2 కలల మేడలోన నను ఖైదు చేసినాడు కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు కలల మేడలోన నను ఖైదు చేసినాడు కాలు కదపకుండా ఒక కట్టె వేసినాడు కలల కన్న మధురమైన కాంక్షలుండునా వలపులోన ఖైదుకన్న తలుపులుండునా చూసెనులే నా కనులే చూడని వింతా చూడగనే ఝల్లుమనే నా మనసంతా దోచిన ఆ చూపులనే దాచుకుంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని.. చరణం: 3 విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే విరహమెంత బరువో నీ వింత నవ్వు తెలిపే కలలు ఎంత చురుకో నీ కంటి ఎరుపు తెలిపే విరహ రాత్రి రేపు మాపు కరగకుండునా వేచి యున్న వేగు పూలు విరియకుండునా చూసెనులే నా కనులే చూడని వింతా చూడగనే ఝల్లుమనే నా మనసంతా దోచిన ఆ దొర ఎవడో కాచుకుంటిని వేచి వేచి వీలులేక వేగిపోతిని..
చిన్నారి వరహాల చిట్టి పొట్టి పాప పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల చిన్నారి వరహాల చిట్టి పొట్టి పాప
ముద్దులు చిలికే గొబ్బెమ్మ పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: డా॥ సి.నారాయణరెడ్డి గానం: యస్.పి.బాలు, పి.సుశీల ముద్దులు చిలికే గొబ్బెమ్మ
అరె ఎలా దెబ్బ కొట్టావో పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: కొసరాజు గానం: పిఠాపురం, జమునారాణి అరె ఎలా దెబ్బ కొట్టావో
పాలరాతి మందిరాన పాట సాహిత్యం
చిత్రం: నేనూ మనిషినే (1971) సంగీతం: వేదా సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: యస్.పి. బాలు, పి.సుశీల పల్లవి: పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం... చరణం: 1 రతనాల కోట ఉంది రాచకన్నె లేదు రంగైన తోట ఉంది రామచిలుక లేదు ఆ రాచ కన్నెవు నీవై అలరిస్తే అందం నా రామచిలుకవు నీవై నవ్వితే అందం పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం... పాలరాతి మందిరానా పడతిబోమ్మ అందం... చరణం: 2 కన్నెమనసు ఏనాడూ సన్నజాజి తీగ... తోడు లేని మరునాడూ.. వాడి పోవు కాదా ఆ తీగకు పందిరి నీవై అందుకుంటే అందం... ఆ కన్నెకు తోడుగ నిలిచి అల్లుకుంటే అందం... పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం అనురాగ గీతిలోన అచ్చ తెలుగు అందం పాలరాతి మందిరాన పడతిబోమ్మ అందం... చరణం: 3 నీ సోగకన్నుల పైనా బాస చేసినాను నిండు మనసు కోవెలలోనా నిన్ను దాచినాను... ఇరువురిని ఏకం చేసే ఈ రాగబంధం ... ఎన్నెన్ని జన్మలకైనా చెరిగి పోని అందం... చెలుని వలపు నింపుకున్న చెలియ బ్రతుకు అందం... అనురాగ గీతిలోనా అచ్చ తెలుగు అందం..లా.ల.లా..ల
No comments
Post a Comment