Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Premalu Pellillu (1974)






చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
నటీనటులు: నాగేశ్వరరావు, జయలలిత, శారద
దర్శకత్వం: వి.మధుసూదనరావు
నిర్మాత: డి.భాస్కరరావు
విడుదల తేది: 15.01.1974



Songs List:



చిలికి చిలికి పాట సాహిత్యం

 
చిత్రం: ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  రామకృష్ణ, సుశీల

పల్లవి:
చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు... పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

హే.. ఓహో.. అహహా.. హా.. అ..
ఆహా.. హా.. ఆ.. ఒహోహో.. ఓ..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం: 1
పొంగే కెరటం.. తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది
పొంగే కెరటం తీరం కోసం.. పరుగులు తీస్తుంది..ఈ..
పూచే కుసుమం.. తుమ్మెద కోసం.. దారులు కాస్తుంది

అందమంతా.. జంట కోసం...
అందమంతా జంట కోసం.. ఆరాట పడుతుంది..ఈ..
ఆరాట పడుతుంది

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి అవుతుంది..

చరణం: 2
తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది
తుంటరి పెదవి.. జంటను కోరి.. తొందర చేస్తుంది..ఈ..
దాచిన తేనెలు దోచే దాక.. ఓపనంటుంది

రోజు రోజు.. కొత్త మోజు..
రోజు రోజు.. కొత్త మోజు.. రుచులేవో ఇస్తుంది..ఈ..
రుచులేవో ఇస్తుంది..

చిలికి చిలికి చిలిపి వయసు.. వలపు వాన అవుతుంది..ఈ..
వలచి వలచి చెలియ మనసు.. పూల పల్లకి అవుతుంది..ఈ..
పూల పల్లకి ఔతుంది..

హే.. ఏహే.. ఒహోహో.. ఓ..
ఆ.. ఆహహా.. హాహహా.. ఆహహా.. హాహహా..





మనసులు మురిసే పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  రామకృష్ణ, సుశీల

పల్లవి:
మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ.. వేళ యిది....  ఆ.. వేళ యిది

చరణం: 1
లలలల ....లల లాలల... లలలల ....లల లాలల
లలలల ....లల లాలల.. లలలల ....లల లాలల

తెలిమబ్బు జంట గగనాల వెంట జత జేరుతున్నది
హృదయాలు రెండు యీ తీరమందు పెనవేసుకున్నవి

సెలయేటి జంట ఆ కోనలందు కలబోసుకున్నది... 
పరువాలు రెండు ఒక దారివెంట పయనించుచున్నవి

నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది  
నీలాల నీ కళ్ళలో...  నీ రూపమే వున్నది
ఆశలే .. పెంచుకో ... మోజులే ... పంచుకో

మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది... పువ్వై విరిసే వేళ యిది

చరణం: 2
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో.. ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం
ఈ అంద చందాలలో ఈ ప్రేమ బంధాలలో... ఉయ్యాల లూగిందిలే నేడు నా జీవితం

నా సొగసులన్నిఈ నాటినుండి నీ సొంతమాయెలే
మన జంట చూసి ఈ లోకమంత పులకించి పోవులే

నిండైన మన ప్రేమలు నిలిచేను కలకాలము
తోడుగా....నీడగా...జోడుగా...సాగిపో

మనసులు మురిసే సమయమిది.. తనువులు మరిచే తరుణమిది
నీ కౌగిలిలో యవ్వనమంతా పువ్వై విరిసే వేళ యిది
ఆ... వేళ యిది ఆ... వేళ యిది...  పువ్వై విరిసే వేళ యిది 



మనసులేని దేవుడు.. పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: ఆత్రేయ
గానం: వి.రామకృష్ణ, సుశీల

పల్లవి:
మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే... కనులకెందుకో నీరిచ్చాడు..
కనులకెందుకో నీరిచ్చాడు
మనసులేని దేవుడు... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 1
మనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరము
మనిషికీ.. దైవానికీ ఏనాటి నుంచో వైరము
వీడి కోరిక వాడు తీర్చడు... వాడి దారికి వీడు వెళ్లడు....
వాడి దారికి వీడు వెళ్లడు
మనసులేని దేవుడు... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 2
ప్రేమనేది ఉన్నదా.. అది మానవులకే ఉన్నదా ?
ప్రేమనేది ఉన్నదా ?..  అది మానవులకే ఉన్నదా ?
హృదయముంటే తప్పదా.. అది బ్రతుకు కన్నా గొప్పదా..
అది బ్రతుకు కన్నా గొప్పదా......
మనసులేని దేవుడు ... మనిషి కెందుకో మనసిచ్చాడు

చరణం: 3
ఏమిటో ఈ ప్రేమ తత్వం ?...  ఎక్కడుందో మానవత్వం
ఏమిటో ఈ ప్రేమ తత్వం?... ఎక్కడుందో మానవత్వం
ఏది సత్యం.. ఏది నిత్యం..  ఏది సత్యం.. ఏది నిత్యం
చివరికంతా శూన్యం.. శూన్యం..
చివరికంతా శూన్యం.. శూన్యం....

మనసులేని దేవుడు.. మనిషి కెందుకో మనసిచ్చాడు
మనసు మనసును వంచన చేస్తే... కనులకెందుకో నీరిచ్చాడు
కనులకెందుకో నీరిచ్చాడు ... కనులకెందుకో నీరిచ్చాడు




ఎవరున్నారు పాపా పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి
గానం: సుశీల

ఎవరున్నారు పాపా మీ
కెవరున్నారు ?
చీకటి కమ్మిన కళ్లున్నాయి
ఆ కళ్ళలో కావలసినన్ని కన్నీళ్లున్నాయి

||ఎవరున్నారు||

చరణం: 1
కన్నతల్లి వెళిపోయింది బంధాలన్నీ తెంచుకొని
తనను తానే వంచించుకొని ఉన్న తండ్రి పడివున్నాడు 
మనసున చేదునింపుకొని తనను తానే చంపుకొని
ఈ ఇంటిలోన నేనొక ఇల్లాలినైనా
మీ తల్లిని కాలేనమ్మా కన్నతల్లిని

చరణం: 2
ఉదయించే కిరణాలై ఎదుగుతున్న పాపలు మీరు
ముసిరే పొగమంచులోన మసకేసి పోతున్నారు
ఏ యింటనైనా ఈ కలతలు వన్నా 
ముందు బలి అయ్యేది పిల్లలే
ఏ పాపమెరుగనిపాపర్లే  

||ఎవరున్నారు||





ఎవరు నీవు పాట సాహిత్యం

 
చిత్రం:  ప్రేమలు పెళ్ళిళ్ళు (1974)
సంగీతం:  ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం:  డా॥ సి. నారాయణరెడ్డి
గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

నేనని వేరే లేనేలేనని...
నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ
మీకెలా తెలిపేదీ..

చరణం: 1
నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదుర పోయిన మనసును లేపి.. మనిషిని చేసిన మమతవు నీవో
నిదురేరాని కనులను కమ్మని.. కలలతో నింపిన కరుణవు నీవో

పూజకు తెచ్చిన పూవును నేను ఊ... ఊ... ఊ...
పూజకు తెచ్చిన పూవును నేను.. సేవకు వచ్చిన చెలిమిని నేను
వసివాడే ఆ పసిపాపలకై..
వసివాడే ఆ పసిపాపలకై.. దేవుడు పంపిన దాసిని నేను

నేనని వేరే లేనేలేనని ఎలా తెలిపేదీ.. మీకెలా తెలిపేదీ..
ఎవరు నీవు నీ రూపమేది ..
ఏమని పిలిచేదీ.. నిన్నేమని పిలిచేదీ

చరణం: 2
చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు..
చేదుగ మారిన జీవితమందున.. తీపిన చూపిన తేనెవు నీవు

వడగాడ్పులలో వడలిన తీగకు..చిగురులు తొడిగిన చినుకే మీరు
చిగురులు తొడిగిన చినుకే మీరు...

కోరిక లేక కోవెలలోన.. వెలుగై కరిగే దీపం నీవు
దీపంలోని తాపం తెలిసి..
దీపంలోని తాపం తెలిసి.. ధన్యను చేసే దైవం మీరు
దైవం మీరు..
అహా హా అహా హా.. ఓహోహో ఓహోహో..
ఊహూహూ ఊహూహూ..


No comments

Most Recent

Default