చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ నటీనటులు: తాళ్లూరి రమేశ్వరి, చంద్రమోహన్ మాటలు: జంధ్యాల కథ ,దర్శకత్వం: కె.విశ్వనాధ్ నిర్మాతలు: మురారి-నాయుడు విడుదల తేది: 1978
Songs List:
చాలు చాలు ఈ విరసాలు పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గానం: జి. ఆనంద్ , విజయలక్ష్మి శర్మ చాలు .... చాలు …... ఈ విరసాలు మేలు .…... మేలు .... నీ సరసాలు కంటిచూపులా బాకులు- నీ కళ్లా కలువరేకులు చాలు ... చాలు .... ఈ విరసాలు మనసున మసిలే దొకరితో - నువ్వు నువ్వు మాట్లాడేదింకొకరితో మేలు మేలు... నీ సరసాలు పదుగురితో నీ వలపు నేను పంచుకోలేను వదిలిపెడితే చాలును బతికిపోతాను కాదు .... కాదు .... పొమ్మంటే చేదు.... చేదు....నీ వలపంటే వాదులాడను ఇంక నీ దరికే రాను మేలు.... మేలు .... నీ సరసాలు చాలు …... చాలు .... ఈ విరసాలు
కొక్కొరోకో కోరుకో పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల కొక్కొరోకో ..... కొక్కొరోకో కోడికూత పెట్టింది - ఈడు పూత పట్టింది ఎందుకో తెలుసుకో - ఇప్పుడే కలుసుకో కోరుకో ఏం కావాలో కోరుకో అమ్మబాబో పల్లె నిదరలేచింది - పిల్ల ఎదర నిలిచింది అమ్మబాబో అందితే తీసుకో - ఏమైనా చేసుకో కోరుకో ఏం కావాలో కోరుకో గుజనాల రైకతొడిగి-గుత్తంగా సొంపులన్నీ గుచ్చెతే రాశిపోసి, గునా, గునా - హెయ్ గునా, గునా నువ్వు నడిచొస్తుంటే ఆ రాలు గింజల్నే, నే కోడి పుంజల్లే ఏరుకుంటానే - నిన్ను ఏలుకుంటానే కోరుకో ఏం కావాలో కోరుకో వనరైన పాగా చుట్టి వలెవాటు పంచెగట్టి కసరెక్కి కస్సుమంటూ కసా, పిసా - హెయ్ కసా, పిసా నువ్వు కదిలొస్తుంటే నీ రాకతో సోకు మారాకు వేస్తుంటే ఇచ్చుకుంటాలే - ఇచ్చి పుచ్చుకుంటాలే కోరుకొ ఏం కావాలో కోరుకో మాగాణి చేనుకాడ నాటేసే నన్ను చూడ కాటేసే కళ్ళతోన - కరా, కరా- హెయ్ కరా, కరా నువు నమిలేస్తుంటే గోదారి గట్టుమీద, గోరింట చెట్టుకింద కొమరాల కొప్పుతోన ఘుమా, ఘుమా - హేయ్ ఘుమా, ఘుమా నువు బుసకొడుతుంటే ఆ వాడి చూపుల్లో - నీ వేడి చూస్తుంటే ఓడిపోతాలే నీలో ఒదిగి పోతా లే కోరుకో ఏం కావాలో కోరుకో
మావిచిగురు తినగానే పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి గానం: యస్.పి.బాలు, పి.సుశీల మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!! ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల.. అ ఆ..తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల!! తారాటల..సయ్యాటల.. సయ్యాటల..తారాటల.. వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?? వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు?? బింకాలు.. బిడియాలు.. పొంకాలు..పోడుములు.. ఏమో..ఎవ్వరిదోగానీ ఈ విరి?? గడసరి!! ఆ..ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. కోవిల పలికేనా?? ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల.. ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల.. ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల.. ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో.. ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో!! పలకరింతలో.. పులకరింతలో పలకరింతలో.. పులకరింతలో ఏమో..ఏమగునోగానీ ఈ కథ..మన కథ!! మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా?? కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా? ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని!! మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ.. కోవిల పలికేనా??
నువ్విట్టా నేనిట్టా కూకుంటే పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: యస్.పి.బాలు, పి.సుశీల నువ్విట్టా, నేనిట్టా, కూకుంటే ఇంకెట్టా తెల్లారిపోయేదెట్టా - ఈ ఉడుకు చల్లారిపోయే దెట్టా నీకిట్టా, నాకిట్టా రాసుంటే ఇంకెట్టా ఈ ఊపు ఆపేదెట్టా నీ దుడుకీ కాసేపు ఓ పేదెట్టా సిటికంత నవ్వంట - సిలికింత పువ్వంట ఆ పువ్వు కోసుకుంటే ఆపేది ఎవ్వరంట సీకట్లో సింగారం సిటికేసే యవ్వారం నీ పొగరంతా ఆణిగేదెట్టా- ఈ పొగరాని సెగలే తంటా మసకేస్తే మనసంట - మనసైతే వరసంట ఈ గడియ గడిపేదెట్టా - ఆ గడియ తీసేదెట్టా ఆగడియా రానీకు- నన్నిడిసీ పోమాకు తొలిపొద్దు పొడిచిందంటే చలి తీరిపోతే ఎట్టా - ఎట్టా
పదే పదే పాడుతున్నా పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే డైలాగ్: ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు చరణం: 1 చిలకమ్మా ఎగిరిపోయే గోరింకను విడిచి గోరింక కన్నీరింక వగచె ఇది తలచి ఆమనులే వేసవులె తే ఎవరిని అడగాలి దీవెనలే శాపాలై తే ఎందుకు బ్రతకాలి మనసన్నది చెయ్యని పాపం మనసివ్వడమే ఒక నేరం మనిషైనా, మాకైనా అనుభవమొకటే చరణం: 2 రామలీల ప్రేమజ్వాల రగలిన బ్రతుకేలే రాలుపూత బంగరుసీత మిగిలిన వలపేలేపదే పదే పాడుతున్నా సత్యం : పదే.... పదే..... పాడుతున్నా పాడినపాటే అది బ్రకుకో పాటో నాకే తెలియదు పాడుతువుంటే డైలాగ్; ఇది అనగనగా కథకాదు- అందమైన జీవితం కన్నెవయసు చిలకమ్మ, వెన్నమనసు గోరింక కలసి కట్టుకున్న కలలగూడు ఒకనాడు మనసుపడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడు చూపులకే ఊపిరిపోసి చీకటి కొలిచాడు ఎడారిలో కోయిలవున్నా ఆ దారినరాదు వసంతం మనిషైనా, మాకైనా అనుభవ మొకటే
సీతాలు సింగారం.. పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి. మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: ఎస్.పి. బాలు, సుశీల సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం.. సీతామాలచ్చిమంటే శ్రీలచ్చిమవతారం.. సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం సీతామాలచ్చిమంటే.. శ్రీలచ్చిమవతారం మనసున్న మందారం.. మనిషంతా బంగారం.. బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం మనసున్న మందారం.. మనిషంతా బంగారం.. బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం.. సీతాలు సింగారం..ఊమ్మ్... కూసంత నవ్విందంటే పున్నమి కావాల... ఐతే నవ్వనులే..ఏ..ఏ కాసంత చూసిందంటే కడలే పొంగాల... ఇక చూడనులే ..ఏ.. ఏ కూసంత నవ్విందంటే పున్నమి కావాల.. కాసంత చూసిందంటే కడలే పొంగాల.. ఎండితెర మీద పుత్తడి బొమ్మ ఎలగాల ఎదగాల ఆ ఎదుగు బొదుగు ఎలుగు కన్నుల ఎన్నెల కాయాల.. నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల... ఆ.. సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం బంగారు కొండయ్యంటే ..భగవంతుడవతారం మనసున్న మందారం... లలల్లలా..లాలాలాలా..లలలాలా.. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను.. ఐతే నేనే వస్తాలే.. ఏ.. ఏ చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను.. ఎగిరొస్తాలే.. ఏ.. ఏ.. దాగుడు మూతలు ఆడావంటే దగ్గరకే రాను చక్కలిగింతలు పెట్టావంటే చుక్కై పోతాను గుండె గుడిలోన దివ్వెవు నువ్వై వెలిగి... వెలిగించాల నీ వెలుగుకు నీడై.. బ్రతుకున తోడై.. ఉండిపోవాలా నువ్వంటుంటే.. నేవింటుంటే.. నూరేళ్ళు నిండాల.. ఆ.. సీతాలు సింగారం.. మాలచ్చి బంగారం బంగారు కొండయ్యంటే.. భగవంతుడవతారం.. లలలాల..లలలా..లలలా...
ఏ పాట నే పాడను పాట సాహిత్యం
చిత్రం: సీతామాలక్ష్మి (1978) సంగీతం: కె.వి.మహదేవన్ సాహిత్యం: వేటూరి గానం: పి.సుశీల అలలు కదిలినా పాటే ఆకు మెదిలినా పాటే కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను బ్రతుకే పాటైన పసివాడను ఏ పాట నే పాడను... ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు ఏలుకుంటే పాట మేలుకుంటే పాట పాడుకుంటే పాట మా దేవుడు శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఆ సుప్రభాతాలు ఆ భక్తిగీతాలు పాడకుంటే మేలుకోడు మమ్మేలుకోడు ఏ పాట నే పాడను... తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికీ తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల పాల కన్నా తీపి పాపాయికీ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరసనయన దశరథ తనయ లాలీ రామలాలీ మేఘశ్యామ లాలీ తామరసనయన దశరథ తనయ లాలీ ఆ.ఆఆ.. ఆ రామలాలికి ఆ ప్రేమగీతికి రాముడైన పాప ఇల్లాలికి... ఈ లాలికీ ఏ పాట నే పాడనూ బ్రతుకే పాటైన పసివాడనూ ఏ పాట నే పాడనూ చేరువై హృదయాలు దూరమైతే పాట జంట బాసిన గువ్వ ఒంటి బ్రతుకే పాట ఎందుకో ఎందుకో... నా మీద అలిగాడు చెలికాడు ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు ఎదురు చూసిన చూపు చుక్కలైనా రాడు నిదురకాచిన కంట కల అయిన కాలేడు గారాలు నీరాయే తీరాలు వేరాయే మనసు మీరాలాయే వయసేటి పాలాయే ఎందుకో ఎందుకో నా మీద అలిగాడు చెలికాడు కలలు చెదిరినా పాటే కలత చెందినా పాటే ఏ పాట నే పాడనూ...
No comments
Post a Comment