Home Movie Songs Devotional Songs Folk Songs Chitramala Image Gallery Contact Profiles About

Search Box

Sivaranjani (1978)





చిత్రం: శివరంజని (1978)
సంగీతం:  రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: డా.సి.నారాయణరెడ్డి, దాసం గోపాల కృష్ణ , వేటూరి
గాయకులు: యస్.పి.బాలు, పి.సుశీల,  యస్.పి. శైలజ
నటీనటులు: జయసుధ , మోహన్ బాబు, మురళి మోహన్, హరి ప్రసాద్, శుభాషిని
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
అసోసియేట్ డైరెక్టర్ ; కోడి రామకృష్ణ
నిర్మాత: దాసరి పద్మ
విడుదల తేది: 27.09.1978



Songs List:



అభినవ తారవో పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేష్ నాయుడు
సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి 
గానం: యస్.పి.బాలసుబ్రమణ్యం

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో 
అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసర శింజినీ 
శివరంజని... శివరంజనీ...

అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా

అవి చరణమ్ములా శశికిరణమ్ములా (2)
నా తరుణభావన హరిణమ్ములా

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో 
శివరంజని... శివరంజనీ...

ఆ నయనాలు విరిసిన చాలు 
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు 
అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడిన చాలు
ఆనెన్నడుము ఆడినచాలు 
రవళించును పదకవితా ప్రభందాలు

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో 
శివరంజని... శివరంజనీ...

నీ శ్రంగార లలిత భంగిమలో పొంగిపోదురే ఋషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా...నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ 
నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ
ఆ....ఆ.... ఆ....
నే ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తుడను..
నీ ప్రియభక్తుడను

అభినవ తారవో నా అభిమాన తారవో
అభినవ తారవో 
శివరంజని... శివరంజనీ...





చందమామ వచ్చిందమ్మ పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: పి.సుశీల

చందమామ వచ్చాడమ్మ - తొంగి తొంగి నిను చూశాఢమ్మా 
తలుపు తెరుచుకో పిలుపు అందుకో
ముత్యాల ముంగిటలో కలువ భామ
విడిదొసగి విందుచేయి కలువభామ

వెన్న మిఠాయి తెచ్చాడమ్మా తెచ్చాడమ్మా
సయ్యాటకు పిలిచాడమ్మా పిలిచాడమ్మా
పన్నీరు చల్లవే పాన్పు వేయవే
ముత్యాల ముంగిటలో కలువభామ
విడిదొసగి విందుచేయి కలువభామ
పడక గదికి వెళ్ళాలమ్మా వెళ్ళాలమ్మా
తాంబూలం ఇవ్వాలమ్మా ఇవ్వాలమ్మ
తంతు నడుపుకో చెంత చేరుకో

ముత్యాల ముంగిటలో కలుపభామ
నిడిదొసగి విందుచేయి కలువభామ



జోరుమీదున్నావు తుమ్మెదా పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాల కృష్ణ
గానం: పి.సుశీల

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
ఒత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
ఆ ... ఆ...  ఆ...  ఆ...  ఆ
పక్కవేసుంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా
నీ ఒళ్ళు జాగరతె తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా



మా పల్లె వాడలకు పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ 
గానం: యస్.పి.బాలు, యస్.పి.శైలజ 

మా పల్లె వాడలకు కృష్ణమూర్తి
నువ్వు కొంటెపనుల కొచ్చావా కృష్ణమూర్తి
కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగి
వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడి
మచ్చు చూపవే నాకు ఓ మచ్చెకంటి 
యశోదమ్మ యింటిలోని కృష్ణమూర్తి
చెన్నపూస నిండుకుందా కృష్ణమూర్తి
సరుకు మంచిది దొరుకునని ఓ చంద్రవదన
కోరి కోరి వచ్చానే ఓ కుందరదన
సరసమైన ధర చెప్పు ఓ మందయాన
తల్లిచాటు పిల్లనయ్య కృష్ణమూర్తి
మా నాయనమ్ము నడగవయ్య కృష్ణమూర్తి




మీ అమ్మవాడు నాకోసం పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: యస్.పి.బాలు 

మీ అమ్మవాడు నా కోసం ఈని ఉంటాడు
మా బాంబువాడు నీ కోసం కనీ ఉంటాడు
తలంప్రాలు నెత్తిన వేసి కొట్టుకుంటామా 
తమలపాంకు పోంక సెక్క మేసుకుంటామా
బకెటుగా బకెటుగా నిన్ను అవ్వు చేశాను
నీ సోంకు వాడ్ని కడుపులోని పాంతి పెట్టాసు
ముద్ద ముద్దకు నీ పేరు అరుసుకుంటాను
నీ ప్రేమవాడ్ని నీ మీదే కక్కుకుంటాను
చీ పాడు

పెళ్లి దినం పట్టుకోంక ఎత్తి పెడతానే
నీ సిగ్గులన్ని పింకి పింకి పందిరి వేసాను
కంపువాడికి అగరొ తుల మంట వేసాను
ఆంకలికి వాడికి డ్రమ్ము డ్రమ్ముగ పాలుపోస్తాను
గ్లాసు గ్లాసుగా తాక్కుంటామా ?



నవమి నాటి వెన్నెల నేను పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: వేటూరి 
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి 

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు 

నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ వయసే వసంత రుతువై
నీ మనసే జీవన మధువై
నీ పెదవే నా పల్లవి గా
నీ నగవే సిగ మల్లిక గా
చెరిసగమై యే సగమేదో
మరచిన మన తొలి కలయికలో

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు

నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
నీ వొడిలో వలపును నేనై
నీ గుడిలో వెలుగే నేనై
అందాలే నీ హారతి గా
అందించే నా పార్వతి గా
మనమొకటై రసజగమేలే
సరస మధుర సంగమ గీతికలో

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు
కలుసుకున్న ప్రతిరేయీ
కార్తీక పున్నమి రేయి

నవమి నాటి వెన్నెల నేను
దశమి నాటి జాబిలి నీవు



పాలకొల్లు సంతలోన పాట సాహిత్యం

 
చిత్రం: శివరంజని (1978)
సంగీతం: రమేశ్ నాయుడు పసుపులేటి
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ
గానం: పి.సుశీల, యస్.పి.బాలు

పాలకొల్లు సంతలోన పాపాయమ్మో పాపాయమ్మ
నువ్వు గిల్లిన గిల్లు తలుసుకుంటే పాపాయమ్మ
నా వల్లు జలదరించిందే పాపాయమ్మ

కాకినాడ రేవుకాడ కనకారావా-కనకారావా
నువు చెప్పిన వూసు తలుచుకుంటే కనకారావా
నా వొల్లు జలదరించిందోయ్ కనకారావా
మనసేమో తొందరచేసె
వయవేమొ పందెం వేసె
పడుచుదనం పారాకాసే కోర్కెలన్ని డేరావేసె
ఏదేదో అవుతుందమ్మో.. ఓబుల్లెమ్మా ఏదేదో అవుతుందమ్మో
పైటకొంగు బరువయ్యే - నిద్దరేమొ కరువయ్యె
వడ్డాణం వదులయ్యే - వల్లంతా వేడయ్యె
ఓ, మావో ఏదేదో అవుతుందయ్యో ఓ మావయ్యో
ఏదేదో అవుతుందయ్యో
పగడాల దండలతోటి కంచి పట్టు చీరలతోటి

సంపెంగలు తెస్తానే సందలడి వస్తానే
సందడిగా వుందామమ్మో - ఓ బుల్లెమ్మో
సందడిగా వుందామమ్మో
ఒంటరిగా వుండలేను - పెందలాడే వచ్చేయి
వల్లేమొ అల్లరి పెట్టె - మనసేమొ పోరుపెట్టె
మావో సందడిగా వుందామయ్యో ఓ మావయ్యో 
సందడిదా వుందామయ్యో 

No comments

Most Recent

Default