చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు నటీనటులు: యన్.టి.ఆర్, అంజలీదేవి, జమున దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు నిర్మాత: డి.రామానాయుడు విడుదల తేది: 25.08.1966
Songs List:
జయహొ జై జయహొ పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల & బృందం జయహొ జై జయహొ త్రిభువన మంగళకారి
ఓహొ మోహనరూపా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: శ్రీ శ్రీ గానం: ఘంటసాల, పి.సుశీల ఓహొ మోహనరూపా కేళీ కలపా కృష్ణా నినుగని మురిసెను
ఓ చెలి! కోపమా పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: దాశరథి గానం: ఘంటసాల పల్లవి: ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా ఓ చెలి! కోపమా అంతలో తాపమా చరణం: 1 అందాలు చిందేమోము కందేను ఆవేదనలో పన్నీట తేలించెదనే మన్నించవే ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా చరణం: 2 ఏనాడు దాచని మేను ఈ నాడు దాచెదవేల? దరిచేరి అలరించెదనే దయచూపవే... ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా ఓ చెలి! కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాలా చరణం: 3 ఈ మౌనమోపగలేనే విరహాలు సైపగలేనే తలవంచి నీ పదములకూ మ్రొక్కేనులే నను భవదీయ దాసుని మనంబున నియ్యపుకింకబూని కాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తనుకులకాగ్ర కంఠక విథానముతాకిన నొచ్చునన్చు నేననియదా అల్క మానవుగదా ఇకనైన అరాళకుంతలా...
కొనుమిదే కుసుమాంజలి పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: పి.సుశీల & బృందం కొనుమిదే కుసుమాంజలి అమరుల ప్రణయాంజలి
ఇది సరాగాల తోట పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: ఆరుద్ర గానం: పి.సుశీల, ఎల్. ఆర్. ఈశ్వరి ఇది సరాగాల తోట సుమపరాగల బాట ఇక తనివి
ఎందుకె నామీద నీకింతకోపం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: కొసరాజు గానం: మాధవపెద్ది సత్యం, స్వర్ణలత, ఎల్. ఆర్. ఈశ్వరి ఎందుకె నామీద నీకింతకోపం సుందరి ఓహోహో
కరుణించవే తులసిమాత.. పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: పి.సుశీల, ఎస్.జానకి పల్లవి: కరుణించవే తులసిమాత.. కరుణించవే తులసిమాత.. దీవించవే దేవీ మనసారా.. కరుణించవే తులసిమాత.. చరణం: 1 నిన్నే కోరి పూజించిన సతికీ... కలుగుకాదే సౌభాగ్యములన్ని నిన్నే కోరి పూజించిన సతికీ... కలుగుకాదే సౌభాగ్యములూ కరుణించవే తులసిమాత.. కరుణించవే తులసిమాత దీవించవే దేవీ మనసారా... కరుణించవే....దీవించవే.. పాలించవే.. తులసిమాత చరణం: 2 వేలుపురాణి....వాడని వయసు... వైభవమంతా నీ మహిమేగా... ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ ఆ......ఆ....ఆ...ఆ....ఆ...ఆ వేలుపురాణి.... వాడని వయసు... వైభవమంతా నీ మహిమేగా... అతివలలోనా అతిశయమందే... భోగమందీయ్యవే.. కరుణించవే కల్పవల్లీ... కరుణించవే కల్పవల్లీ...దీవించవే తల్లీ ... మనసారా కరుణించవే.... దీవించవే... పాలించవే... కల్పవల్లీ చరణం: 3 నిదురనైనా నా నాధుని సేవా.. చెదరనీక కాపాడగదే ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ ఆ...ఆ...ఆ...ఆ.ఆ.ఆ.ఆ నిదురనైనా నా నాధుని సేవా... చెదరనీక కాపాడగదే కలలనైనా గోపాలుడు నన్నే... వలచురీతి దీవించగదే.... కలలనైనా గోపాలుడు నన్నే... వలచురీతి దీవించగదే కరుణించవే కల్పవల్లీ... కరుణించవే తూలసిమాత దీవించవే తల్లీ మనసారా.. కరుణించవే... దీవించవే... పాలించవే.... తులసిమాత
మీరజాలగలడా...పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: స్థానం నరసింహారావు గానం: పి.సుశీల పల్లవి: మీరజాలగలడా... మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి చరణం: 1 నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి నటన సూత్రధారి మురారి.. ఎటుల దాటగలడో నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి చరణం: 2 సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి సుధాప్రణయజలధిన్ వైదర్భికి ఈద తావు గలదే నాతోనిక వాదులాడగలడా సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి చరణం: 3 మధుర మధుర మురళీగానరసాస్వాదనమున.. ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ..ఆ.. ఆ.. మధుర మధుర మురళీగానరసాస్వాదనమున అధర సుధారస మదినే గ్రోలగ అధర సుధారస మదినే గ్రోలగ మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా నా యానతి వ్రతవిధాన మహిమన్ సత్యాపతి మీరజాలగలడా...
భలే మంచి చౌక బేరము పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: చందాల కేశవదాసు గానం: ఘంటసాల, పి.సుశీల & బృందం భలే మంచి చౌక బేరము ఇది సమయమున్
విధుడు నీ మాట పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఎస్. వరలక్ష్మి విధుడు నీ మాట
ఇంద్ర కృష్ణ పారిజాత పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, మాధవపెద్ది సత్యం ఇంద్ర కృష్ణ పారిజాత
రుక్మిణి పుట్టిననాడు పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల , పి.లీల రుక్మిణి పుట్టిననాడు
తులాభార యోజన పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల తులాభార యోజన
కృష్ణ తులాభారం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల కృష్ణ తులాభారం
సత్యభామ గర్వభంగం పాట సాహిత్యం
చిత్రం: శ్రీ కృష్ణ తులాభారం (1966) సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య గానం: ఘంటసాల, పి.సుశీల సత్యభామ గర్వభంగం
No comments
Post a Comment