చిత్రం: తాత మనవడు (1973) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి , కొసరాజు, సుంకర సత్యనారాయణ నటీనటులు: ఎస్.వి.రంగారావు, అంజలీ దేవి, విజయ నిర్మల, కైకాల సత్యన్నారాయణ, రాజ సులోచన, రాజబాబు, చంద్రమోహన్, శ్రీవిద్య, చంద్రకళ, రమాప్రభ కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణ రావు (తొలి సినిమా) నిర్మాత: కె.రాఘవ విడుదల తేది: 23.03.1973
Songs List:
అనుబంధం ఆత్మీయత పాట సాహిత్యం
చిత్రం: తాతా మనవడు (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: వి.రామకృష్ణ పల్లవి: అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం చరణం: 1 ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి? కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి ఎవరు తల్లి ఎవరు కొడుకు.. ఎందుకు ఆ తెగని ముడి? కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం చరణం: 2 కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం చరణం: 3 కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ చితిమంటల చిటపటలు వినిపించేనా? . . చితిమంటల చిటపటలు వినిపించేనా? అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం
ఈనాడే బాబు నీ పుట్టినరోజు పాట సాహిత్యం
చిత్రం: తాత మనవడు (1973) సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు సాహిత్యం: కొసరాజు గానం: పి.సుశీల ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు చిన్నిబాబు ఎదిగితే కన్నవారికానందం నెలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు చుక్కలు వేయేందుకు ఒక్క చంద్రుడే చాలు తనకోసం విలపించే తనయుడొక్కడు చాలు ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే... ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్న తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్న ఈనాడే బాబు నీ పుట్టినరోజు తండ్రిమాటకై అడవికి తరలిపోయె రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చరను విడిపించగ తలపడే ఆ గరుడుడు అందుకె ఆ పక్షి ఇంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి ఓ బాబు నువ్వు ఆ బాట నడవాలి భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి ధ్రువతారగ వెలగాలి ఈనాడే బాబు నీ పుట్టినరోజు ఈ ఇంటికే... ఈ ఇంటికే కొత్తవెలుగు వచ్చినరోజు ఈనాడే బాబు నీ పుట్టినరోజు
నూకాలమ్మని నేనే పాట సాహిత్యం
చిత్రం: తాతా మనవడు (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: కొసరాజు గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు పల్లవి: నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే చీపురుకట్టతో సింగారించి.. చీపురుకట్టతో సింగారించి దుమ్ముదులుపుతా..దుంపతెంచుతా దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే..ఏఏఏఏ నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే నూకాలమ్మను నేనే.. మీ పీకలు నొక్కేత్తానే చరణం:1 హేయ్ వొంటిదాన్నిగా సూత్తారా.. ఒళ్ళు హూనముగా సేత్తారా నుండేది మడిశారా.. ఇంకా ముంగట నిలిశారా డొక్కసించుతా..ఏయ్.. డోలుకట్టుతా.. నిలుసోబెట్టి తోలువొలుత్తా ఓయ్.. డొక్కసించుతా డోలుకట్టుతా.. నిలుసోబెట్టి తోలువొలుత్తా నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే చరణం: 2 వరసబెట్టి తింతన్నావే.. వోలమ్మ తెగబలిశావె వరసబెట్టి తింతన్నావే.. వోలమ్మ తెగబలిశావె కొంపకి కోడల్ని.. కలకత్తా మాంకాళిని యీ కొంపకి కోడల్ని.. కలకత్తా మాంకాళిని వీపు కాసుకోండి.. నా దెబ్బ సూసుకోండి మీ వీపు కాసుకోండి..నా దెబ్బ సూసుకోండి నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే నూకాలమ్మను నేనే.. మీ పీకలునొక్కేత్తానే చరణం: 3 ఎవరుచేసిన ఖర్మ వారనుభవింపక..ఎవరికైనా తప్పదమ్మా అలనాడు శూర్పణఖ.. ముక్కు చెవులు పోయి అడవిలో పడి...ఏడ్చినమ్మా.. ఆఆ యీనాడు అటువంటి బ్రహ్మ రాక్షసులకు ఎక్కడా చోటులేదమ్మా.. ఎక్కడా చోటులేదమ్మా ఏయ్..నూకాలమ్మను నేనే.. మీ పీకలు నొక్కేత్తానే నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే చీపురుకట్టతో సింగారించి..చీపురుకట్టతో సింగారించి దుమ్ముదులుపుతా.. దుంపతెంచుతా దుమ్ముదులుపుతానే..మీ దుంపతెంచుతానే నూకాలమ్మను నేనే..మీ పీకలు నొక్కేత్తానే నూకాలమ్మను నేనే..మీ పీకలునొక్కేత్తానే
రాయంటి నా మొగుడు పాట సాహిత్యం
చిత్రం: తాతా మనవడు (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: ఎల్. ఆర్. ఈశ్వరి పల్లవి: వచ్చేది పుల్లమ్మ..మొగుడూ ఎల్లేది ఎల్లమ్మ..మొగుడూ అడుగడుగో ఆదెమ్మ..మొగుడూ యిదుగిదుతో ఈరమ్మ..మొగుడూ మరి...నీ మొగుడో? చరణం: 1 రాయంటి నా...మొగుడూ రంగామెల్లి తిరిగి...రాలేదు మాచేను...దున్నాలి మంచిరైతు...కావాలి మంచిరైతు...కావాలి రాయంటి నా..మొగుడూ రంగామెల్లి తిరిగి..రాలేదు రంగామెల్లి తిరిగి..రాలేదు చరణం: 2 బీటిచేను మాది వాటంగ దున్నాలీ రాటుకు పోటుకు ఆగాలీ రాటుకు పోటుకు ఆగాలీ ఆ రైతు మోతుబరై ఉండాలీ మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది మాయ చెంగలితుంగ మస్తుగా పెరిగింది తీయలేక వదులుకున్నాను నాకు దిక్కులేక మొక్కుతున్నాను రాయంటి నా మొగుడూ రంగామెల్లి తిరిగి రాలేదు రంగామెల్లి తిరిగి రాలేదు చరణం: 3 మొరకలున్నచోట మేడి బాగానొక్కి మొరకలున్నచోట మేడి బాగానొక్కి మెరకాపల్లంచేసి మెత్తగా దున్నలీ తరగకుండా నీరు చెరువులా ఉండాలీ ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి ఈవలావలగట్టు యిరుకు పుంతలదారి వివరించి చూసితే ఎదరమోడున్నదే మాచేను యిష్టమైతే కౌలుకిస్తాను రాయంటి నా మొగుడూ రంగామెల్లి తిరిగి రాలేదు మాచేను దున్నాలి మంచిరైతు కావాలి మంచిరైతు కావాలి రాయంటి నా మొగుడూ రంగామెల్లి తిరిగి రాలేదు రంగామెల్లి తిరిగి రాలేదు
సోమ.. మంగళ.. బుధ.. పాట సాహిత్యం
చిత్రం: తాతా మనవడు (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: సుంకర సత్యనారాయణ గానం: ఎల్. ఆర్. ఈశ్వరి, యస్.పి. బాలు పల్లవి: సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది చరణం: 1 పెంచేదెట్లా గంపెడుమంద.. పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద కలిగిన చాలును వొకరూ ఇద్దరూ.. కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది చరణం: 2 కాదు.. కాదు.. కాదు.... వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా బుద్దుడో.. జవహరో.. గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు లౌతారౌతారౌతారు.. తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది చరణం: 3 ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ ఎవరికివారే ఇట్లనుకుంటే.. ఏమైపోవును మనదేశం ఎప్పుడు తీరును దారిద్ర్యం.. ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం అయ్యా.. అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య బాబూ.. బాబూ.. నీకెందుకురా ఆ గొయ్య నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?
ఏమిటో ఈ లోకమంతా పాట సాహిత్యం
చిత్రం: తాతా మనవడు (1973) సంగీతం: రమేశ్ నాయుడు సాహిత్యం: గానం: వి. రామక్రిష్ణ ఏమిటో ఈ లోకమంతా ఎంతకూ అంతుపట్టని వింత
1 comment
చాలా బాగుంది యాప్ చాలా ఉపయోగం ఉంది మంచి పాటలు అన్నీ మంచి సినిమాలు మంచి పాటలు అన్నీ ఉన్నాయి చాలా చాలా చాలా థాంక్స్
Post a Comment