చిత్రం: తొలిరేయి గడిచింది (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం నటీనటులు: మురళీమహన్, జయచిత్ర, రజినీకాంత్, మోహన బాబు దర్శకత్వం: కె.యస్.రామిరెడ్డి నిర్మాత: యం.గోపాలకృష్ణ రెడ్డి విడుదల తేది: 17.11.1977
Songs List:
ఈ తీయని వేళ నా ఊహలలోన పాట సాహిత్యం
చిత్రం: తొలిరేయి గడిచింది (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: డా॥ సి. నారాయణరెడ్డి గానం: పి.సుశీల, యస్.పి.బాలు ఈ తీయని వేళ నా ఊహలలోన మల్లెలు విరిసే తేనెలు కురిసే జల జల జల జల ఈ తీయని వేళ నా ఊహల లోన నీల మేఘమాలికలోన నీ కురులూగెనులే పైరగాలి ఊయలలోన నీ మది పాడెనులే నా మదిలోని రాగిణులన్నీ నీకై మ్రోగెనులే ఈ తీయని వేళ నా ఊహల లోన లేలేత కోరికలన్నీ పూచెను పరువాలై దాచలేని భావనలన్నీ లేచెను కెరటాలై కన్నులలోన కలకల లాడే కలలే కిరణాలై ఈ తీయని వేళ నా ఊహల లోన
గుడ్ అంటే మంచిది పాట సాహిత్యం
చిత్రం: తొలిరేయి గడిచింది (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆత్రేయ గానం: పి.సుశీల, రమోలా గుడ్ అంటే మంచిది బ్యాడ్ అంటే చెడ్డది గుడ్ అండ్ బ్యాడ్ మంచీ చెడు - తెలుసు కునేందుకే చదువుకునేది No ! No ! No ! రీడ్ వైల్ యూ రీడ్ ప్లే స్టైల్ యూ ప్లే అంటే ? ఆడే వేళకు ఆడాలి చదివే వేళకు చదవాలి ఆరోగ్యం విజ్ఞానం చెట్టాపట్టగ పెరగాలి టీచర్ టీచర్ ! అ యామ్ యూ? నో నో ఆమ్ ఐ లైక్ యూ అని అడగాలి ఒకరిలా ఉండాలని ఎన్నడు అనుకోకు అనుసరించవచ్చును గాని అనుకరించకు నువ్వు నువ్వుగానే కనబడు నీ కాళ్ళమీదే నిలబడు అందమైనా చందమైనా నీకు నీవనే పేరుబడు టీచర్ టీచర్ ఎవర్నయినా ప్రేమించారా ? పెళ్ళి చేసుకుంటారా ? పెళ్ళి....ప్రేమా ? పెళ్ళి దేవుడు ముడివేసేది ప్రేమ మనుషులు తలపోసేది పేమకు పెళ్ళి లక్ష్యం కాదు పెళ్ళికి ప్రేమ సాక్ష్యంకాదు టీచర్ వాట్ డు యూ మీన్.... ఐమీన్ లౌ ఈజ్ స్వీట్ బట్ లైఫ్ ఈజ్ స్వీటెర్ .... వండ్రఫుల్ టీచర్ జీవితాన్ని ప్రేమించు తీయ తీయగా జీవించు మనుగడకర్తం సాధించు మంచిని ఎపుడూ గెలిపించు.
జాబిలి మెరిసెలే పాట సాహిత్యం
చిత్రం: తొలిరేయి గడిచింది (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: దాశరధి గానం: పి.సుశీల, జేసుదాస్ జాబిలి మెరిసెలే ఆశలు విరిసెలే తొలిరేయి గడిచినా ఈరేయే తొలిరేయి మనకు ఈరేయే తొలిరేయి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ కవ్వించు వెన్నెల రేయి ఆనాడు వెల వెలబోయె ఊరించు వెన్నెల రేయి ఈనాడు కళ కళలాడె నీలోని మిసమిసలన్నీ ఆరాట పరచెను నన్నే హే వలపు గెలిచెలే నేటికి జాబిలి మెరిసెలే మెరిసెలే ఆశలు విరిసెలే విరిసెలే తొలిరేయి గడిచినా ఈరేయే తొలిరేయి మనకు ఈరేయే తొలిరేయి నీలోని కొంటె తనాలూ నీలోని మంచితనాలూ జతజేరి విరబూయాలీ మన బాబులో చూడాలీ గోపాల బాలుడుతానై మన ఇంట వర్ధిల్లాలీ హే బ్రతుకు మధురమై సాగాలీ జాబిలి మెరిసెలే మెరిసెలే ఆశలు విరిసెలే విరిసెలే తొలిరేయి గడిచినా ఈరేయే తొలిరేయి మనకు ఈరేయే తొలిరేయి
ఇదోరకం, అదోరకం పాట సాహిత్యం
చిత్రం: తొలిరేయి గడిచింది (1977) సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం సాహిత్యం: ఆరుద్ర గానం: యస్.జానకి, యస్.పి.బాలు ఇదోరకం, అదోరకం తలో రకం సొగసులే తనివి తీర్చేను గాలి ముద్దులు వద్దంటావా ? వేడి ముద్దులే యిమ్మంటావా ? నా కోసం రానే వచ్చావు సగం సగం సిగ్గెందుకే సొగసైన లేత పరువాలు జిగేల్ జిగేల్ అనిపించవే అహొ మోహాల దాహాలు అందించనా మురిపాల ఉయ్యాల ఊగించనా లా.... లా..... జవరాలు బెట్టు మానాలి లేదంటే కథ మారేను ఏయ్.... రా ! మగవాడూ ఎగిరే తూరీగ మరోపూవు దరి చేరేను అహ .... .లా.... సరసాలా సరదాల తేలించనా ? సరికొత్త రుచిలోన ముంచెత్తనా ? ఇదోరకం .... అదోరకం ....
No comments
Post a Comment