చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఎస్.పి. బాలు, పి.సుశీల
నటీనటులు: కృష్ణంరాజు, భారతి, కల్పన
దర్శకత్వం: కె.బాబురావు
నిర్మాత: కె.ఎ. ప్రభాకర్
బ్యానర్: రమావిజేత ఫిలిమ్స్
విడుదల తేది: 1974
పల్లవి:
లలలలాలలలా...అహా...
లలలలాలలలా...అహా...
అహహహా...హా..అహహహా...హా...
సెలయేటి గలగల... ఆ...
చిరుగాలి కిలకిలా..ఆ..
సెలయేటి గలగల చిరుగాలి కిలకిల
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ
చరణం: 1
చందమామ కన్నా నీ చెలిమి చల్లన
సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన
నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
ఆ...నిన్ను కౌగిలించ గుండే ఝల్లన
నిలువెల్ల పులకించె మెల్లమెల్లన
సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ
చరణం: 2
పసి నిమ్మపండు కన్న నీవు పచ్చన
ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చన
అనురాగం ఏదేదో అమరభావన
అనురాగం ఏదేదో అమరభావన
అది నీవు దయచేసిన గొప్ప దీవెన
సెలయేటి గలగల...ఆ...
చిరుగాలి కిలకిల..ఆ...
సెలయేటి గలగల.....చిరుగాలి కిలకిల....
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిల
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళ
అహా...అ...అ.. .అహా...
అహహహా...హా..అహహహా...హా...
****** ****** ******
చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి.సుశీల
పల్లవి:
లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి
చరణం: 1
చీకటి ఇంట వెన్నెలపంట..పండేనోయి ఈరేయీ
ఎన్ని ఆశలో నాలో..కన్నెకలువలై విరిసాయి
లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి
చరణం: 2
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
నీవూ నేను నాన్నకు ప్రాణం..దీవించేనూ మనకోసం
పెరిగి పెద్దవై నీవే..తోడు నీడగా నిలవాలి
లాలీ నా కన్నా..జోజో నా చిన్నా
జాబిల్లి జోల పాడాలీ..కలలందు నీవు చేరాలి
***** ****** ******
చిత్రం: తులసి (1974)
సంగీతం: ఘంటసాల
సాహిత్యం:
గానం: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
పల్లవి:
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...
ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే... ఏ..ఏ..
మరి తీరా వస్తే... చల్లగా జారుకున్నావే..
మాట వరసకు అన్నాను గానీ ఓయమ్మో...
నువు అన్నంత చేస్తావనుకోలేదే గున్నమ్మో...
కలికి ముత్యాల కొలికి.. పడకమ్మ ఉలికి ఉలికి...
చరణం: 1
కోటేరు ముక్కుంది... కోటంత ఎత్తుంది...
మీసమంటు లేదు గానీ... పౌరుషం భలేగుందీ...
అందుకే నిను మెచ్చాను... ఒంటిగా ఇటు వచ్చాను...
హరి హరి నారాయణా... చచ్చాను... బాబోయ్ చచ్చాను...
కలికి ముత్యాల కొలికి... పడకమ్మ ఉలికి ఉలికి...
కలికి ముత్యాల కొలికి... రాకమ్మ ఉరికి ఉరికి..
చరణం: 2
ఆనాడు రాధగా నీ మేను తాకగా...
నిలువెల్ల కలిగింది గిలిగింత వెచ్చగా...
నిదరే రాదాయే....గుండెలో బాధాయే...
శివ శివ ... నీ వాలకం శృతిమించిపోయే....మించిపోయే...
కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
ఆడబిడ్దంటే అర్ధమొగుడని అన్నావే...ఏ..ఏ..
మరి తీరా వస్తే...చల్లగా జారుకున్నావే ...
మాటవరసకు అన్నాను కానీ ఓయమ్మో...ఓ...
నువు అన్నంత చేస్తావనుకోలేదు గున్నమ్మో...
కలికి ముత్యాల కొలికి...పడకమ్మ ఉలికి ఉలికి...
పడకమ్మ ఉలికి ఉలికి....రాకమ్మ ఉరికి ఉరికి...
No comments
Post a Comment