చిత్రం: వయసు పిలిచింది (1978)
సంగీతం: ఇళయరాజా
సాహిత్యం: వీటూరి
గానం: యస్.పి.బాలు
నటీనటులు: కమల్ హాసన్ , రజినీకాంత్, శ్రీప్రియ, జయచిత్ర
దర్శకత్వం: సి.వి.శ్రీధర్
నిర్మాత: కన్నయ్య
విడుదల తేది: 01.07.1978
(గమనిక: వేటూరి సుందరరామ మూర్తి, వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి ఇద్దరు వేరు వేరు కానీ ఇద్దరు పాటలు రచయితలు)
హే...ముత్యమల్లే మెరిపోయే మల్లెమొగ్గా
అరె ముట్టుకుంటే ముడుసు కుంటావ్ ఇంత సిగ్గా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన
కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నది లోన
గుబులౌతుందే గుండెల్లోనా
జరగనా కొంచెం నేనడగనా లంచం
చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం
వెచ్చగా ఉందామూ మనమూ
హే...పైటలాగా నన్ను నువ్వు కప్పుకోవే
గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
వలపు కురిస్తే వయసు తడిస్తే
పులకరించు నేల అది తొలకరించువేళ
తెలుసుకో పిల్లా ఈ బిడియమేలా మళ్ళా
ఉరికే పరువమిదీ మనదీ
హే...కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా దాపుకొస్తే కోర్కెలన్నీ తీరిపోవా
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
నవ్వని పువ్వే నువ్వు నునువెచ్చని తేనెలు ఇవ్వు
దాగదు మనసే ఆగదు వయసే
ఎరగదే పొద్దు అది దాటుతుంది హద్దు
ఈయవా ముద్దు ఇక ఆగనే వద్దు ఇద్దరమొకటవనీ కానీ
హే...బుగ్గ మీద మొగ్గలన్నీ దూసుకోనీ...
రాతిరంతా జాగారమే చేసుకోనీ...
మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
మంచిసోటే మనకు కుదిరిందిలే
******* ***** *******
చిత్రం: వయసు పిలిచింది (1978)
సంగీతం: ఇళయరాజా
గీతరచన: ఆరుద్ర
గానం: వాణి జయరాం
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?
నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?
నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!
నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
నీ కోసమే మరుమల్లెలా పూచింది నా సొగసూ
నీ పూజకే కర్పూరమై వెలిగింది నా మనసూ
దాచినదంతా నీ కొరకే దాచినదంతా నీ కొరకే
నీ కోరిక చూస్తే నను తొందర చేసే
నా ఒళ్ళంతా ఊపేస్తూ ఉంది నాలో ఏదో అవుతుందీ...!
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?
నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!
నీ మగతనం నా యవ్వనం శృంగారమే చిలికే
ఈ అనుభవం ఈ పరవశం సంగీతమై పలికే
పరుగులు తీసే నా పరువం పరుగులు తీసే నా పరువం
ఈ కథలే విందీ నువ్వు కావాలంది
నా మాటేమి వినకుండా ఉంది నీకూ నాకే జోడందీ
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?
నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!
ర ర ర ర ర ర ర ర ర ర ర ర
రర రా రర రా రా రా రా రా ర ర ర ర ర ర ర ర ర ర ర
నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా?
నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా?
నీ ముద్దు ముచ్చట కాదంటానా? సరదా పడితే వద్దంటానా? హయ్ యా!
******* ******* *****
చిత్రం: వయసు పిలిచింది (1978)
సంగీతం: ఇళయరాజా
గీతరచన: ఆరుద్ర
గానం: యస్. పి.బాలు, పి.సుశీల
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
చరణం: 1
వయసులో వేడుంది మనసులో మమతుంది
వయసులో వేడుంది మనసులో మమతుంది
మమతలేమో సుధామయం మాటలేమో మనోహరం
మదిలో మెదిలే మైకమేమో
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే
చరణం: 2
భావమే నేనైతే పల్లవే నీవైతే
భావమే నేనైతే పల్లవే నీవైతే
ఎదలోన ఒకే స్వరం కలలేమో నిజం నిజం
పగలు రేయి చేసే హాయి
ఇలాగే ఇలాగే సరాగమాడితే వయ్యారం ఈ యవ్వనం ఊయలూగునే ఊయలూగునే
******* ***** *******
చిత్రం: వయసు పిలిచింది (1978)
సంగీతం: ఇళయరాజా
గీతరచన: ఆరుద్ర
గానం: యస్. పి.బాలు
పల్లవి:
మాటే మరచావే ... చిలకమ్మా
మనసు విరిచావే
అంతట నీవే కనిపించి
అలజడి రేపావే
కమాన్ ... క్లాప్ ...
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
చరణం: 1
నీ పెదవులు చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం
నీ పెదవులు చిలుకును మధురసం
నీ హృదయం మాత్రం పాదరసం
నాలో రేపావు జ్వాలా
ఒకరితొ పాడేవు జోలా
నను మరచిపోవడం న్యాయమా
మనసమ్మినందుకు నమ్మినందుకు
వలపు గుండెకే గాయమా
కథలే మారెను
కలలే మిగిలెను ... హే ..
హల్లో మై రీటా
ఏవయ్యింది నీ మాటా
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
చరణం: 2
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
ప్రేమన్నది దేవుని కానుక
అది నీకు కేవలం వేడుక
కృష్ణుడు ఆశ పడీ రాగా
రాధిక వేరు పడీ పోగా
ఎడబాటు సహించదు హృదయము
ఒకనాటికైన నీ జీవితాన కనరాకపోవునా ఉదయము
నిజమే తెలుసుకో గతమే తలచుకో .. హే
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
హల్లో మై రీటా
ఏవయింది నీ మాట
పాడేవు సరికొత్త పాటా
మారింది నీ బాటా
మాటే మరచావే ... చిలకమ్మా
మనసు విరిచావే
No comments
Post a Comment